కుజ-రాహు ప్రభావం.. ఈ 5 రాశుల వారికి ధనయోగం, కెరీర్‌లో భారీ విజయాలు!
ఆగస్టు 2, 2026న కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించి, సెప్టెంబర్ 18 వరకు అక్కడే సంచరించనున్నాడు. ఈ గోచారంతో రాహువుతో ఏర్పడిన ప్రభావవంతమైన గ్రహస్థితి అన్ని రాశులపై ప్రభావం చూపనున్నప్పటికీ, ముఖ్యంగా మేషం, సింహం, కన్యా, వృశ్చికం, మకర రాశుల వారికి అత్యంత శుభప్రదంగా ఉండనుంది.
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తాజాగా గ్రహాల సేనాపతి అయిన కుజుడు (అంగారకుడు) ఆగస్టు 2న మిథున రాశిలోకి సంచారం చేశాడు. సెప్టెంబర్ 18, 2026 వరకు కుజుడు ఇదే రాశిలో సంచరించనున్నాడు. ప్రస్తుతం మిథున రాశిలో కుజుడు ప్రవేశించడం ద్వారా రాహువుతో ఎదురుపడే పరిస్థితి ఏర్పడింది.

జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, సాహసం, పరాక్రమానికికారకుడైన కుజుడు, భ్రమం మరియు ఆకస్మిక పరిణామాలకు ప్రతీక అయిన రాహువు ఎదురుపడటం అత్యంత ప్రభావవంతమైన పరిణామం. ఈ శక్తివంతమైన కలయిక కొన్ని రాశుల వారికి జీవితంలో స్వర్ణయుగాన్ని తలపించే శుభ ఫలితాలను ఇస్తుండగా, మరికొన్ని రాశులు కాస్త అప్రమత్తంగా ఉండాలి.
కుజ గోచారంతో అదృష్టాన్ని దక్కించుకోనున్న ప్రధాన 5 రాశులు ఇవే:
1. మేష రాశి: కుజుని రాశి మార్పు మేష రాశి వారికి అత్యంత లాభదాయకంగా మారుతుంది. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే ఎంతో బలపడుతుంది. నిలిచిపోయిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. అదృష్టం తోడు నిలవడంతో ఉద్యోగంలో పదోన్నతులు, వ్యాపారంలో భారీ లాభాలు కలుగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి.
2. కన్యా రాశి: కుజుని గోచారం కన్యా రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఎంతో కాలంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త అందుతుంది. అదృష్టం కలిసిరావడం వల్ల తలపెట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితిలో ఊహించని మెరుగుదల కనిపిస్తుంది.
3. సింహ రాశి: సింహ రాశి వారికి ఈ కాలం అన్ని విధాలుగా ఊరటను, సుఖసంతోషాలను ఇస్తుంది. ఉద్యోగ రంగంలో ఎదురవుతున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు ఆశించిన ఫలితాలు కెరీర్‌లో కనిపిస్తాయి. అనుకోని మార్గాల ద్వారా ధనలాభం కలుగుతుంది. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది.
4. వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారికి ఈ గ్రహ సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఎక్కడో ఆగిపోయిన పాత బకాయిలు, ధనం మీ చేతికి అందుతాయి. వ్యాపారస్తులకు పెద్ద లావాదేవీలు కుదిరే అవకాశం ఉంది. సమాజంలో పేరున్న ప్రభావశీల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
5. మకర రాశి: మకర రాశి వారికి ఈ గోచారం చాలా ప్రత్యేకమైనది. కార్యాలయంలో మీ పనితీరుకు గుర్తింపు లభించి ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తారు. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కుటుంబం నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


