గ్రహాల ఇబ్బంది పెడుతున్నాయా? గ్రహ శాంతికి 9 సులభమైన నీటి నివారణలు!

నవగ్రహాల అనుకూల, ప్రతికూల ప్రభావాలు మన జీవితంలోని వివిధ అంశాలపై ప్రభావం చూపుతాయని భావిస్తారు. ఈ కథనంలో నీటితో చేసే సులభమైన గ్రహ పరిహారాలను వివరించారు. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, చంద్రుడి కోసం శివలింగానికి జలాభిషేకం చేయడం, గురు దోషానికి పసుపు కలిపిన నీటితో స్నానం చేయడం వంటి పరిహారాలను సూచించారు.

Published on: Aug 8, 2026, 11:00:57 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మనిషి జీవితాన్ని ప్రభావితం చేయడంలో నవగ్రహాల పాత్ర చాలా కీలకం. జాతకంలో గ్రహాల స్థితి బాగుంటే ఎలాంటి ప్రయత్నంలోనైనా విజయాలు సాధించవచ్చు. అదే సమయంలో గ్రహాల సంచారం అనుకూలించకపోతే కెరీర్, ఆరోగ్యం, కుటుంబ జీవితంలో ఇబ్బందులు ఎదురుకావడం సర్వసాధారణం. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా, కేవలం నీటితో చేసే కొన్ని సులభమైన పరిహారాల ద్వారా ఈ గ్రహ దోషాల ప్రభావాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చని జ్యోతిష్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

గ్రహాల లోపాలు ఇబ్బంది పెడుతున్నాయా? గ్రహ శాంతికి 9 సులభమైన నీటి నివారణలు!
గ్రహాల లోపాలు ఇబ్బంది పెడుతున్నాయా? గ్రహ శాంతికి 9 సులభమైన నీటి నివారణలు!

సూర్యుడు, చంద్రుడి దోషాలకు నీటి నివారణలు

జాతకంలో సూర్య భగవానుడి అనుగ్రహం లేకపోతే ఉద్యోగంలో ఎదుగుదల ఉండదు. దీని కోసం ప్రతిరోజూ ఉదయమే రాగి పాత్రలోని నీటిలో ఎర్రచందనం, ఎర్రటి పువ్వులు వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి.

ఇలా చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే మానసిక ప్రశాంతత లోపించినప్పుడు, నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోతే చంద్ర దోషం ఉన్నట్లు భావించాలి. ప్రతి సోమవారం శివలింగానికి పాలు, కొద్దిగా తెల్లని పువ్వులు కలిపిన జలాన్ని అభిషేకం చేయడం ద్వారా మనసు కుదుటపడుతుంది.

గురు, బుధ గ్రహాల అనుగ్రహం కోసం

చదువు, వివాహం, కెరీర్ పరంగా నిత్యం అడ్డంకులు ఎదురవుతుంటే గురు దోషం కారణం కావచ్చు. దీని నివారణకు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయాలి. ముఖ్యంగా గురువారం రోజు ఈ పరిహారం ఆచరించడం వల్ల అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. ఇక వ్యాపారంలో రాణించడానికి, వాక్శుద్ధి పెరగడానికి బుధవారం తులసి మొక్కకు ఒక చెంబు శుద్ధమైన నీటిని సమర్పించడం ఉత్తమం.

శుక్రుడు, శని, కుజుడి ప్రసన్నతకు మార్గాలు

వైవాహిక జీవితంలో గొడవలు, ఇబ్బందులు ఉంటే శుక్రుడు బలహీనంగా ఉన్నాడని అర్థం. స్నానం చేసే నీటిలో గులాబీ రేకులు లేదా రోజ్ వాటర్ కలుపుకోవడం వల్ల ఈ సమస్య దూరం అవుతుంది. అలాగే శని, కుజ దోషాలతో బాధపడేవారు దారిలో వెళ్లే బాటసారులకు, పేదలకు దాహం తీర్చడానికి మంచి నీటిని అందించాలి. వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆపదలు తొలగిపోతాయని నమ్ముతారు.

రాహు-కేతువుల దుష్ప్రభావాల నివారణ

జీవితంలో ఊహించని సమస్యలు చుట్టుముడితే అది రాహు-కేతువుల ప్రభావం కావచ్చు. రాహు దోషం తొలగిపోవడానికి ఒక పాత్రలో నీరు పోసి ఇంటి బయట ఉంచి, ఆ నీటిని కుక్కకు తాగించాలి. అలాగే కేతువు అనుగ్రహం కోసం పూజా మందిరంలో ఇష్ట దైవం ముందు ఒక చెంబు నీరు ఉంచి, కొంత సమయం తర్వాత ఆ నీటిని సేవించాలి. భక్తి శ్రద్ధలతో చేసే ఈ చిన్న ఉపాయాలు జీవితంలో సానుకూల మార్పులను తెస్తాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More