జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా దేవ గువు బృహస్పతి రాశి మార్పును అత్యంత కీలకమైన అంశంగా పరిగణిస్తారు. 2026 జూన్ నెల జ్యోతిష్య పరంగా ఒక పెద్ద మలుపు కాబోతోంది. ఎందుకంటే, సుమారు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గురుడు తన ఉచ్ఛ రాశి అయిన కర్కాటకంలోకి అడుగు పెడుతున్నారు. చంద్రుడికి సొంత రాశి అయిన కర్కాటకంలోకి గురుడు రావడం వల్ల గజకేసరి యోగం వంటి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది.

జ్యోతిష్య గణాంకాల ప్రకారం, జూన్ 2వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల 25 నిమిషాల ప్రాంతంలో ఈ గోచారం జరగనుంది. అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడు ఇదే రాశిలో ఉంటారు. ఈ ఐదు నెలల కాలంలో గురుడి అనుగ్రహం వల్ల మేషం నుండి మీనం వరకు అన్ని రాశులపై ప్రభావం ఉన్నప్పటికీ 6 రాశుల వారికి మాత్రం అదృష్టం వెల్లువలా రాబోతోంది.
మేష రాశి
మేష రాశి వారికి ఈ గోచారం చాలా శుభప్రదంగా మారుతుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి వీరికి విముక్తి లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరగడం వల్ల బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. గురువు, చంద్రుడి అనుగ్రహం తోడై ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. మీరు చేసే కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. కొత్త వస్తువులు లేదా వాహనాలు కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
కర్కాటక రాశి
స్వయంగా కర్కాటక రాశిలోనే గురుడి సంచారం జరుగుతోంది కాబట్టి, ఈ రాశి వారికి రాజయోగం పట్టినట్లే. ముఖ్యంగా కెరీర్ పరంగా మీరు ఆశించిన మార్పులు వస్తాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు తమకు ఇష్టమైన చోటుకు బదిలీ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఆస్తిపాస్తుల విషయంలో ఉన్న వివాదాలు తొలగిపోయి, కొత్త ఆస్తులు కొనే అవకాశం మెరుగుపడుతుంది.
సింహ రాశి
సింహ రాశి జాతకులకు ఈ కాలం వృత్తిపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు ఊహించని లాభాలను చూస్తారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పెద్ద డీల్స్ ఈ సమయంలో ఓకే అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నించే వారికి ఇది సరైన సమయం. మీ పనితీరుతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
తులా రాశి
{{/usCountry}}సింహ రాశి జాతకులకు ఈ కాలం వృత్తిపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు ఊహించని లాభాలను చూస్తారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పెద్ద డీల్స్ ఈ సమయంలో ఓకే అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నించే వారికి ఇది సరైన సమయం. మీ పనితీరుతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
తులా రాశి
{{/usCountry}}జూన్ 2 తర్వాత తులా రాశి వారి జీవితంలో పురోగతి వేగవంతం అవుతుంది. కార్యాలయంలో మీకు కొత్త బాధ్యతలు దక్కుతాయి, ఇది మీ హోదాను పెంచుతుంది. నిలిచిపోయిన పనులు వేగం పుంజుకుంటాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కష్టపడి పనిచేసే తత్వం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ సంచారం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న చికాకులు తొలగిపోయి, లాభాల బాట పడతారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. సానుకూల ఆలోచనలతో కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆర్థికంగా నిలకడ సాధిస్తారు.
మీన రాశి
ఈ రాశి మార్పు మీన రాశి వారికి సామాజికంగా మంచి గుర్తింపు తెస్తుంది. పాత పెట్టుబడుల నుంచి ఊహించని విధంగా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. కెరీర్‌లో కొత్త అవకాశాలు తలుపు తడతాయి. సంతానానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది.
గురు దోష నివారణకు పరిహారాలు
బృహస్పతి అనుగ్రహం రెట్టింపు కావాలంటే ఈ గోచార కాలంలో కొన్ని నియమాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు. "ప్రతి గురువారం పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల గురు గ్రహ దోషాలు తొలగిపోతాయి," అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అలాగే అరటి చెట్టుకు పూజ చేయడం, పసుపు రంగులో ఉండే శనగలు లేదా పప్పు దినుసులను దానం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. ప్రతి గురువారం 'ఓం బృం బృహస్పతయే నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
నిరాకరణ: (ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము.) వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి. )