...
...
Next Story

గురు నక్షత్ర సంచారం : ఈ 5 రాశుల వారికి అత్యంత శుభ ఫలితాలు - అదృష్టం మీవైపే..!

2026లో గురు గ్రహం మఖ నక్షత్రంలోకి ప్రవేశించనుంది. కేతువు అధిపతిగా ఉండే ఈ నక్షత్రంలో బృహస్పతి సంచారం వల్ల మేషం, సింహం సహా 5 రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు, వృత్తిలో పురోగతి కలగనున్నాయి.

Published on: Sep 18, 2026, 11:14:55 IST
Advertisement

జ్యోతిష్యశాస్త్రంలో గురు గ్రహానికి (బృహస్పతి) అత్యంత కీలకమైన స్థానం ఉంది. జ్ఞానం, విజ్ఞానం, సంతానం, సంపద, విద్య, అదృష్టానికి బృహస్పతిని ప్రధాన కారకుడిగా పండితులు పరిగణిస్తారు. జాతకంలో గురు గ్రహం శుభస్థానంలో ఉంటే సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడమే కాకుండా ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని వేద జ్యోతిష నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గురు గ్రహం తన రాశిని లేదా నక్షత్రాన్ని మార్చినప్పుడల్లా దాని ప్రభావం ద్వాదశ రాశుల జీవితాలపై స్పష్టంగా కనిపిస్తుంది.

గురు నక్షత్ర గోచరం 2026
గురు నక్షత్ర గోచరం 2026

ప్రస్తుతం ఆశ్లేష నక్షత్రంలో సంచరిస్తున్న బృహస్పతి…. 2026 అక్టోబర్ 31న మఖ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. 2027 జూన్ 25 వరకు, అంటే దాదాపు 86 రోజుల పాటు గురు గ్రహం ఇదే నక్షత్రంలో కొనసాగుతాడు. మఖ నక్షత్రానికి అధిపతి కేతువు. కేతువు నక్షత్రంలో దేవగురు బృహస్పతి ప్రవేశించడం జ్యోతిష్య రీత్యా ఎంతో ప్రాధాన్యత కలిగిన ఘట్టంగా పండిత నరేంద్ర ఉపాధ్యాయ్ వివరించారు. ఈ ప్రత్యేక నక్షత్ర సంచారం వల్ల ముఖ్యంగా ఐదు రాశుల వారికి వ్యక్తిగత, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అత్యంత శుభ ఫలితాలు సిద్ధించనున్నాయి. ఆ అదృష్ట రాశుల వివరాలు ఇవే…

1. మేష రాశి

మేష రాశి వారికి ఈ నక్షత్ర గోచరం విశేషమైన ప్రయోజనాలను మోసుకొస్తుంది. సమాజంలో హోదా, ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించడంతో పాటు పదోన్నతులు (ప్రమోషన్లు) వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త ఒప్పందాలు (డీల్స్) చేసుకోవడానికి ఇది అనుకూల సమయం. సుదూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఊహించని ధనలాభంతో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

2. సింహ రాశి

వృశ్చిక రాశి జాతకులకు కెరీర్ పరంగా తిరుగులేని పురోగతి లభిస్తుంది. మీ పనితీరుతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. కీలకమైన కొత్త ప్రాజెక్టులు, ఉన్నత బాధ్యతలను సంస్థ మీకు అప్పగించే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. డబ్బుకు సంబంధించిన ఆర్థిక ప్రణాళికలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. వ్యాపారవేత్తలు లాభదాయకమైన కొత్త ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. ముఖ్యంగా విద్యా సంబంధిత రంగాలు, పరిశోధనల్లో ఉన్నవారికి ఈ సమయం అత్యంత సానుకూల ఫలితాలను ఇస్తుంది.

4. ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి అదృష్టం సంపూర్ణంగా కలసివస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌తో పాటు జీతాల పెంపును ఆశించవచ్చు. పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి ఊహించని స్థాయిలో మంచి రాబడి లభిస్తుంది. వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారి వ్యూహాలు పక్కాగా అమలువుతాయి. నూతన గృహం, భూమి లేదా వాహనాలను కొనుగోలు చేసే యోగం ఉంది. స్థిరాస్తి వివాదాలు ఉంటే పరిష్కారమవుతాయి.

5. మీన రాశి

మీన రాశి వారికి భౌతిక సుఖసంతోషాలు విశేషంగా పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరగడం వల్ల సంతోషం, శాంతి నెలకొంటాయి. కళలు, సాహిత్యం, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి విశేషమైన ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక పరిస్థితిలో స్పష్టమైన పురోగతి కనిపిస్తుంది. ఆత్మీయులు, బంధువులతో సంబంధాలు మరింత బలపడతాయి. జీవిత భాగస్వామి నుంచి పరిపూర్ణ మద్దతు లభిస్తుంది. సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks