గురు పౌర్ణమి 2026: ఈ 4 తప్పులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం దూరమవుతుందట!
గురు పౌర్ణమి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినం. వేదవ్యాస మహర్షి జన్మదినంగా దీనిని వ్యాస పౌర్ణమిగా కూడా పిలుస్తారు. 2026లో జూలై 29న గురు పౌర్ణమిని జరుపుకోనున్నారు. ఈ రోజున పుణ్యస్నానం, ఉపవాసం, గురువులు, శ్రీహరి, లక్ష్మీదేవి, చంద్ర భగవానుడిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుందని విశ్వాసం.
ఆధ్యాత్మికంగా, ధార్మికంగా హిందూ సంప్రదాయంలో గురు పౌర్ణమికి ఎంతో విశేష ప్రాధాన్యం ఉంది. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన పర్వదినం కాబట్టే దీనిని 'వ్యాస పౌర్ణమి' అని కూడా పిలుస్తుంటారు. ప్రతి ఏడాదీ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. ఈ పవిత్రమైన రోజున శ్రీహరి, లక్ష్మీదేవి, చంద్ర భగవానుడితో పాటు మనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం.

గురు పౌర్ణమి 2026
హిందూ పంచాంగం ప్రకారం.. ఈ ఏడాది జులై 29వ తేదీ, బుధవారం నాడు గురు పౌర్ణమి వేడుకలను జరుపుకోనున్నారు. ఈ పర్వదినాన ఉదయాన్నే పుణ్యస్నానాలు ఆచరించి, ఉపవాసం ఉండి, దానధర్మాలు చేయడం ద్వారా ఎంతో పుణ్యం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.
ఆర్థిక ఇబ్బందులకు చెక్
లక్ష్మీ నారాయణులను గురు పౌర్ణమి నాడు భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుందని గట్టి విశ్వాసం. అయితే, ఈ పవిత్రమైన రోజున కొన్ని పనులు చేయడం వల్ల అరిష్టం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం హెచ్చరిస్తోంది. సిరిసంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే, ఈ కింద సూచించిన నాలుగు పనులకు తప్పకుండా దూరంగా ఉండాలి.
గురు పౌర్ణమి నాడు పొరపాటున కూడా చేయకూడని పనులు
1.మాంసాహారం, మద్యానికి దూరం
గురు పౌర్ణమి నాడు పూర్తిగా సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం తినడం, మద్యం సేవించడం లాంటి తామసిక అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
2.పాలు, వెండి దానం చేయొద్దు
సాధారణంగా పౌర్ణమి రోజు దానధర్మాలు చేయడం చాలా మంచిది. కానీ, గురు పౌర్ణమి నాడు పాలు, వెండి వస్తువులను దానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో చంద్రుడి స్థానం బలహీనపడుతుంది. చంద్ర గ్రహం నీచస్థితికి చేరితే నేరుగా అది మీ ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. చేతిలో డబ్బు నిలవకపోవడం లాంటి ఇబ్బందులు వస్తాయి.
3.చిరిగిన, నలుపు రంగు దుస్తులు వద్దు
పండుగ రోజుల్లో అలంకరణకు ఎంతో ప్రాధాన్యం ఇస్తాం. గురు పౌర్ణమి వ్రతం ప్రధానంగా లక్ష్మీదేవికి అంకితం చేసినందున, పొరపాటున కూడా చిరిగిన లేదా పాత బట్టలు వేసుకోకూడదు. అదే సమయంలో నలుపు రంగు దుస్తులకు పూర్తిగా దూరంగా ఉండాలి. అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా లభించాలంటే ఎరుపు లేదా గులాబీ రంగు వస్త్రాలు ధరించడం ఎంతో శ్రేయస్కరం.
4.ఇంట్లో చీకటి ఉండకూడదు
గురు పౌర్ణమి నాడు సాయంత్రం వేళ ఇంట్లో ఏ మూలనా చీకటి లేకుండా చూసుకోవాలి. చీకటి అలుముకున్న ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదని ఒక బలమైన నమ్మకం. కాబట్టి సంధ్యా సమయం దాటిన తర్వాత ఇంటి నిండా దీపాలు వెలిగించి, వెలుతురు ఉండేలా జాగ్రత్తపడాలి.
ఈ చిన్నపాటి నియమాలను పాటించడం ద్వారా గురు పౌర్ణమి నాడు లక్ష్మీ కటాక్షంతో పాటు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


