ప్రదోష వ్రతం నాడు పరమేశ్వరుడిని భక్తితో ఆరాధించడం వలన ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. గురు ప్రదోష వ్రతం పరమశివుడికి అంకితం చేయబడిన పవిత్రమైన రోజు. త్రయోదశి గురువారం రావడం చాలా విశేషం. త్రయోదశి గురువారం వచ్చిన రోజునే గురు ప్రదోషం అని అంటారు. ఈ ఏడాది అక్టోబర్ 8న గురు ప్రదోష వ్రతం వచ్చింది.

జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం గురువారం దేవతల గురువైన బృహస్పతికి సంబంధించిన రోజు. కనుక గురు ప్రదోషం రోజున శివుని పూజించడంతో పాటు గురు గ్రహానికి సంబంధించిన పరిహారాలను పాటించడం వలన కూడా అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. మరి గురు ప్రదోష వ్రతం రోజు ఎలాంటి పరిహారాలను పాటించాలి? గురు గ్రహం అనుగ్రహం కలగాలంటే గురువారం ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గురు గ్రహం అనుగ్రహం
గురువు అనుగ్రహం ఉంటే మంచిది. గురు అనుగ్రహం ఉంటే చాలా మంచిది. గురు గ్రహాన్ని గురుత్వం, ధర్మం, సంతానం, జ్ఞానం, అదృష్టానికి కారకుడిగా చెప్తారు. జాతకంలో గురు గ్రహం బలంగా ఉండాలంటే ఈ పరిహారాలు పాటించడం మంచిది.
1.పసుపు రంగు వస్తువులను దానం చేయండి
గురు ప్రదోష వ్రతం నాడు గురు గ్రహానికి సంబంధించిన ఈ పరిహారాన్ని పాటిస్తే మంచి ఫలితాలను చూడొచ్చు. గురు ప్రదోషం నాడు శనగపప్పు, పసుపు, పసుపు రంగు వస్త్రాలు లేదా పసుపు రంగులో ఉండే పండ్లను దానం చేస్తే మంచి ఫలితాన్ని చూడొచ్చు.
2.పరమశివుడికి అభిషేకం చేయండి
గురు ప్రదోష వ్రతం నాడు శివుడికి అభిషేకం చేయడం వలన మంచి ఫలితాలను చూడొచ్చు. అలాగే బిల్వపత్రాలను సమర్పించండి. “ఓం నమః శివాయ” అనే మంత్రాన్ని కూడా జపిస్తే మంచిది.
3.విష్ణువుని ఆరాధించండి
{{/usCountry}}గురు ప్రదోష వ్రతం నాడు శివుడికి అభిషేకం చేయడం వలన మంచి ఫలితాలను చూడొచ్చు. అలాగే బిల్వపత్రాలను సమర్పించండి. “ఓం నమః శివాయ” అనే మంత్రాన్ని కూడా జపిస్తే మంచిది.
3.విష్ణువుని ఆరాధించండి
{{/usCountry}}గురు ప్రదోష వ్రతం రోజు విష్ణువుని కూడా ఆరాధించడం మంచిది. ఉదయాన్నే విష్ణుమూర్తిని పూజించి, దీపం వెలిగించి, పసుపు రంగు పుష్పాలను సమర్పిస్తే అద్భుతమైన మార్పులను చూడొచ్చు.
4.గురు మంత్రం
“ఓం బ్రీం బృహస్పతయే నమః” అనే మంత్రాన్ని చదవండి. ఈ మంత్రాన్ని జపించడం వలన గురు అనుగ్రహం కలుగుతుంది. ప్రశాంతమైన, పరిశుభ్రమైన ప్రదేశంలో మంత్ర జపం చేస్తే చక్కటి ఫలితాన్ని చూడొచ్చు.
5.గురువులు, పెద్దల ఆశీర్వాదం
గురుత్వ తత్వానికి ప్రతీక గురు గ్రహం కనుక, ప్రదోష వ్రతం రోజు తల్లిదండ్రులు, గురువులు, పెద్దల యొక్క ఆశీర్వాదాలు తీసుకోండి. అవసరమైన విద్యార్థులకు పుస్తకాలను అందించండి. చదువుకు ఉపయోగపడే సామాగ్రిని కూడా అవసరమైన వారికి ఇవ్వడం వలన మంచి ఫలితాలను చూడొచ్చు.
చాలా మందికి గురువారానికి, గురు ప్రదోషానికి ఉన్న సంబంధం తెలియదు. ప్రదోష వ్రతం శివుడి ఆరాధనకు పవిత్రమైన రోజు. త్రయోదశి తిథి ఏ వారంలో వస్తుందనే దాని ఆధారంగా ప్రదోషానికి పేర్లు వస్తాయి. గురువారం వస్తే గురు ప్రదోష వ్రతం అని అంటారు. ఆ రోజు శివుడిని పూజించేటప్పుడు ఎంతో పాటుగా గురు గ్రహానికి సంబంధించిన ఈ పరిహారాలను పాటిస్తే చక్కటి మార్పులను చూడొచ్చు.