ప్రతీ ఏటా రెండుసార్లు హనుమాన్ జయంతిని జరుపుకుంటాము. ఒకటి ఏప్రిల్ నెలలో రాగా, మరొకటి మే 12 అనగా ఈరోజు వచ్చింది. వైశాఖ బహుళ దశమి, పూర్వాభాద్ర నక్షత్రం ఉండడంతో హనుమాన్ జయంతిని ఈరోజు జరుపుకోవాలని పండితులు తెలిపారు. అయితే ఈ శుభప్రదమైన హనుమాన్ జయంతి నాడు ఈ పదింటిని కచ్చితంగా పాటించేటట్టు చూసుకోండి. ఈ పది పాటించడం వలన హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది. సంతోషంగా ఉండవచ్చు. కష్టాల నుంచి సులువుగా బయటపడొచ్చు.
ఈరోజు హనుమాన్ జయంతి వేళ కచ్చితంగా ఈ పది పాటించండి.. ఇక హనుమాన్ దయతో సంతోషంగా ఉండొచ్చు
1.బ్రహ్మ ముహూర్తంలో స్నానం

హనుమాన్ జయంతి నాడు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తం సమయంలో స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. పవిత్రతతో రోజును మొదలు పెట్టండి.
2.హనుమంతుడికి సింధూరం
హనుమంతుడికి సింధూరం అంటే మహా ప్రీతి. ఆలయంలో లేదా ఇంట్లో హనుమంతుడి విగ్రహానికి కచ్చితంగా సింధూరాన్ని సమర్పించండి.
3.హనుమాన్ చాలీసా పారాయణం
హనుమాన్ జయంతి నాడు హనుమాన్ చాలీసాను భక్తితో చదవండి. భయాలు, అడ్డంకులు తొలగిపోయి సంతోషంగా ఉండవచ్చు. హనుమాన్ చాలీసా చదవడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చు.
4.శ్రీరామ నామ జపం
హనుమంతుడు శ్రీరాముని భక్తుడు కనుక శ్రీరామ నామాన్ని జపించండి. మనసు ప్రశాంతంగా మారుతుంది. సంతోషంగా ఉండవచ్చు. హనుమంతుని ప్రత్యేక ఆశీస్సులు కూడా లభిస్తాయి.
5.ఉపవాసం
హనుమాన్ జయంతి నాడు చాలా మంది ఉపవాసం చేస్తారు. పాలు, పండ్లు మాత్రమే తీసుకుని భక్తితో ఉపవాసం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది.
6.బెల్లం, వడమాల
హనుమంతుడికి ఈ రెండు చాలా ఇష్టం. వీటిని హనుమంతుడికి నైవేద్యంగా సమర్పించండి. స్వామివారి ప్రత్యేక అనుగ్రహాన్ని పొందడానికి వీలవుతుంది.
7.హనుమంతుని ఆలయానికి వెళ్లండి
హనుమాన్ ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోండి. ఆలయంలో భజనల్లో పాల్గొనండి.
8.సుందరకాండ పారాయణం
హనుమాన్ జయంతి నాడు సుందరకాండను చదవడం వలన ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఆనందంగా కూడా ఉండవచ్చు.
9.దానం
{{/usCountry}}హనుమాన్ జయంతి నాడు సుందరకాండను చదవడం వలన ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఆనందంగా కూడా ఉండవచ్చు.
9.దానం
{{/usCountry}}ఈరోజు హనుమాన్ జయంతి వేళ దానాలు చేయడం వలన మంచి ఫలితాలను చూడొచ్చు. ఆహారం, పండ్లు, బట్టలు వంటివి దానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది.
10.కోతులకు ఆహారం
హనుమాన్ జయంతి నాడు హనుమంతుడిని భావిస్తారు. ఈరోజు కోతులకు అరటిపండ్లు లేదా ఇతర ఆహార పదార్థాలను పెడితే శుభ ఫలితాలను చూడొచ్చు.
11.సాయంత్రం దీపారాధన
హనుమాన్ జయంతి నాడు సాయంత్రం పూట కూడా దీపారాధన చేయండి. నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఈరోజు ప్రశాంతంగా ఉండి మంచి మాటలు మాట్లాడేలా చూసుకోండి. కోపం, అసూయ లాంటి భావాలను దూరంగా ఉంచండి.