Hanuman Jayanthi 2026 Wishes: ఈరోజు హనుమాన్ జయంతి వేళ బంధువులకు, స్నేహితులకు ఇలా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పేయండి!
హనుమాన్ జయంతి నాడు ఉపవాసం ఉండి హనుమంతుడికి ఇష్టమైన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. హనుమంతుని స్మరించడంలో శక్తి, భక్తి, ధైర్యం కలుగుతాయని నమ్ముతారు. హనుమాన్ జయంతి నాడు మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు శుభాకాంక్షలు తెలపడానికి కొన్ని ప్రత్యేకమైన హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఉన్నాయి.
హనుమాన్ జయంతి నాడు హనుమంతుని ప్రత్యేకించి పూజిస్తారు. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తారు. ఉపవాసం ఉండి హనుమంతుడికి ఇష్టమైన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. హనుమంతుని స్మరించడంలో శక్తి, భక్తి, ధైర్యం కలుగుతాయని నమ్ముతారు. హనుమాన్ జయంతి నాడు మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు శుభాకాంక్షలు తెలపడానికి ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఉన్నాయి. మరి వాటిపై ఒక లుక్ వేసేయండి.

హనుమాన్ జయంతి 2026 శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి:
హనుమాన్ జయంతి నాడు కొత్త ఆశలు, శాంతి, ఆనందం కలగాలని ఆ హనుమంతుడిని కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
ఆరోగ్యం, ఆనందం, విజయాలు హనుమంతుని ఆశీస్సులతో మీకు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
శ్రీరాముని చరణాల సేవకుడైన హనుమంతుడి ఆధ్యాత్మిక శక్తి మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.
హనుమంతుని అనుగ్రహంతో కష్టాలన్నీ తొలగిపోవాలని ప్రార్థిస్తూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
రామనామంతో హృదయం నింపుకొని ఆంజనేయస్వామిని స్మరిస్తూ జీవితాన్ని సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
వాయుపుత్రుని ఆశీస్సులతో ఎప్పుడూ మీకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
ఆ వాయుపుత్రుడు బుద్ధి, బలం, ధైర్యం మీకు ప్రసాదించాలని కోరుకుంటూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మీ ఇంటికి శాంతి, ఆనందం నిండాలని కోరుకుంటున్నాను.
ఆపదల్లో ఆవిర్భవించి భక్తులకు అండగా ఉండే హనుమంతుడికి వందనం... హనుమాన్ జయంతి 2026 శుభాకాంక్షలు.
హనుమంతుని తత్వం, శాంతి, శక్తి, సేవ మీ జీవితంలోకి రావాలని ఆశిస్తున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
హనుమాన్ జయంతి సందర్భంగా పవనపుత్రుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించి, ఆయన ఆశీర్వాదం దక్కాలని కోరుకుందాం. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.. హనుమంతుడు మీ జీవితాన్ని సమృద్ధిగా, ఆనందంతో నింపాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.
జై శ్రీరామ్.. మీకు, మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
అతులిత బలధామం, హేమశైలాభ దేహం
దనుజవన కృశానుం, జ్ఞానినాం అగ్రగణ్యం
మీకు, మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
ఈ హనుమాన్ జయంతి నుంచి మీకు విజయాలు, సంతోషం కలగాలని ఆ హనుమంతుని ప్రార్థిస్తున్నాను. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
ఆంజనేయాయ విద్మహే, వాయుపుత్రాయ ధీమహి, తన్నో హనుమత్ ప్రచోదయాత్.. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
తత్వజ్ఞాన సుధా సింధు నిమగ్నాయ మహీయసే
ఆంజనేయాయ సూరాయ సుగ్రీవ సచివాయచ
మీకు, మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
జై భజరంగబలి! శ్రీ ఆంజనేయం! హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే
నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే
మీకు, మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి 2026 శుభాకాంక్షలు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


