మన దేశంలో చాలా ఆలయాలు ఉన్నాయి. చాలామందికి ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో ఉన్న ఈ ఆలయం గురించి తెలియదు. ఈ హాపాముని మహామాయ ఆలయం ఆధ్యాత్మిక శక్తికి నిలయం అని చెప్పొచ్చు. శతాబ్దాల చరిత్రను ఈ ఆలయం కలిగి ఉంది. పైగా, ఇక్కడ వింత ఆచారాలు కూడా అందరినీ ఆకర్షిస్తాయి. మరి ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూసేద్దాం.
పురాతన క్షేత్రం

హాపాముని మహాదేవ క్షేత్రం ఝార్ఖండ్‌లోని లోహార్‌డాగా రోడ్డు మార్గంలో వెళ్తుంటే, ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉన్న ఈ పురాతన హాపాముని మహామాయ దేవాలయం కనిపిస్తుంది. అమ్మవారిని దర్శించుకుంటే అపారమైన మానసిక ప్రశాంతత కలుగుతుంది. పూజలు మాత్రమే కాదు, ఇక్కడ అద్భుతమైన ఆచారాలు కూడా ఆలయానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి.
నిప్పుల మీద భక్తుల ప్రయాణం
శ్రీరామనవమి వంటి పండుగల సమయంలో ఇక్కడ జరిగే మండా పూజ చాలా ప్రాచుర్యం పొందింది. ఆ సమయంలో వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. భక్తి పారవశ్యంలో మునిగిపోయిన భక్తులు నిప్పుల మీద చెప్పులు లేకుండా నడిచి అచంచలమైన విశ్వాసాన్ని చాటుకుంటారు. ఈ అరుదైన ఆచారం చూడడానికి రెండు కళ్లు చాలవు. ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభించి, కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.
ఆలయ చరిత్ర
ఈ ఆలయ చరిత్ర క్రీస్తుశకం 908 నాటిది. నాగవంశీ రాజు గజఘంట్‌రాయ్ చేతుల మీదుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. తర్వాత 1931లో రాజా మోహన్‌రాయ్ తనయుడు శివదాస్ విష్ణుమూర్తి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించారు. గుమ్లాకు సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఝార్ఖండ్ ప్రాచీన సంస్కృతికి, ధార్మిక వారసత్వానికి ఇది సజీవ సాక్ష్యం.
అమ్మవారి విగ్రహాన్ని ఎప్పుడూ ఎందుకు కప్పి ఉంచుతారు?
మహామాయ ఆలయంలో అమ్మవారి విగ్రహం విషయంలో ఒక వింత ఆచారం ఉంది. అమ్మవారి విగ్రహాన్ని వస్త్రంతో కప్పి ఉంచుతారు. అమ్మవారిని నేరుగా చూసినట్లయితే కళ్లు పోతాయని, దృష్టి మందగిస్తుందని అంటారు. అందుకనే అమ్మవారికి వస్త్రాలు మార్చేటప్పుడు పూజారులు కూడా కళ్లకు గంతలు కట్టుకుంటారు. శతాబ్దాలుగా వస్తున్న ఈ ఆచారం భక్తులలో ఒక దైవికమైన భయాన్ని, భక్తిని కలిగిస్తుంది.
ఈ ఆలయం వెనక ఉన్న వీరగాథ
{{/usCountry}}మహామాయ ఆలయంలో అమ్మవారి విగ్రహం విషయంలో ఒక వింత ఆచారం ఉంది. అమ్మవారి విగ్రహాన్ని వస్త్రంతో కప్పి ఉంచుతారు. అమ్మవారిని నేరుగా చూసినట్లయితే కళ్లు పోతాయని, దృష్టి మందగిస్తుందని అంటారు. అందుకనే అమ్మవారికి వస్త్రాలు మార్చేటప్పుడు పూజారులు కూడా కళ్లకు గంతలు కట్టుకుంటారు. శతాబ్దాలుగా వస్తున్న ఈ ఆచారం భక్తులలో ఒక దైవికమైన భయాన్ని, భక్తిని కలిగిస్తుంది.
ఈ ఆలయం వెనక ఉన్న వీరగాథ
{{/usCountry}}ఆలయ చరిత్ర ఒక విషాదమైన వీరగాథతో ముడిపడి ఉంది. లార్క ఉద్యమం సమయంలో బజ్జూరాం అనే భక్తుడు అమ్మవారిని ఆరాధిస్తున్నప్పుడు, శత్రువులు ఆయన కుటుంబ సభ్యుల ప్రాణాలను తీశారు. తన సహచరుడు రాదోరాం ద్వారా ఈ విషయాన్ని బజ్జూరాం తెలుసుకుంటాడు. శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. యుద్ధంలో తనను తాను నిరూపించుకున్నా, అమ్మవారి హెచ్చరికను పాటించకుండా వెనక్కి తిరిగి చూడడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడ ఇప్పటికీ కూడా వీరి సమాధులు భక్తుల పూజలు అందుకుంటున్నాయి.
తంత్ర విద్యలకు నిలయం
ఈ ఆలయం మతపరమైన కేంద్రం మాత్రమే కాదు, శక్తి ఆరాధనలో కీలకమైన తాంత్రిక క్షేత్రం కూడా. ఆలయ ప్రధాన నిర్మాణం ఇప్పటికీ పాతకాలపు పద్ధతిలో ఉండడం మరో విశేషం. ఝార్ఖండ్ యొక్క ఆధ్యాత్మిక, సాంస్కృతిక అస్తిత్వానికి ఈ ఆలయం చిహ్నంగా నిలుస్తుంది. ఒక్కసారైనా ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుంటే మంచిదని, ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందవచ్చని అంటారు.