...
...
Next Story

Happy Guru Purnima 2026 : గురు పౌర్ణమి శుభాకాంక్షలు.. ఇలా చెప్పండి

Guru Purnima 2026 Wishes : జూలై 29 గురు పూర్ణిమ. హిందూమతంలో దీనికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. మీరు గురు పౌర్ణమి 2026 శుభాకాంక్షలు గురువులకు, పెద్దలకు తెలియజేయాలనుకుంటే మీకోసం ఇక్కడ కొన్ని ఉన్నాయి.

Published on: Jul 29, 2026, 10:04:24 IST
Advertisement

గురు పూర్ణిమ 2026 జూలై 29, బుధవారం నాడు వచ్చింది. మహర్షి వేద వ్యాసుడు ఈ పవిత్రమైన రోజున జన్మించినందున దీనిని వ్యాస జయంతి లేదా వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. మీరు గురు పౌర్ణమి 2026 నాడు మీ ఉపాధ్యాయులకు, పెద్దలకు కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే మీకోసం ఇక్కడ కొన్ని కొటేషన్స్ ఉన్నాయి.

గురు పౌర్ణమి శుభాకాంక్షలు
గురు పౌర్ణమి శుభాకాంక్షలు

దేశ ప్రజలందరికీ గురు పూర్ణిమ 2026 శుభాకాంక్షలు.

ఒక వ్యక్తి తన భవిష్యత్తు, జీవితాన్ని ఏ దిశలో ప్రారంభించాలో విద్య సూచిస్తుంది - గురు పూర్ణిమ 2026 శుభాకాంక్షలు.

దేశంలోని గురువులందరికీ 2026 గురు పూర్ణిమ శుభాకాంక్షలు.

గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః

గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః - గురు పూర్ణిమ శుభాకాంక్షలు 2026.

గురువు మన జీవితాల నుండి అజ్ఞానమనే చీకటిని తొలగించి, మన జీవితాల్లో జ్ఞాన వెలుగును ప్రకాశింపజేసే శక్తి. అటువంటి గురువు ఆశీస్సులు జీవితానికి అమూల్యమైన సంపద - Happy Guru Purnima 2026

గమ్యం ముందుంది, దాని వెనక గురువు ఉంటే విజయం మనదే. Happy Guru Purnima 2026

మానవులను సృష్టించడం దేవుని కర్తవ్యం.. ఆ మానవులను ఉత్తమ మానవులుగా తీర్చిదిద్దడం గురువు కర్తవ్యం.. ఈ పరివర్తన మార్గంలో మనల్ని నడిపించే గురువులకు గురు పౌర్ణమి 2026 సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు.

Happy Guru Pournami 2026! నిరంతరం జ్ఞానం, ప్రోత్సాహం, స్ఫూర్తిని అందిస్తున్నందుకు ధన్యవాదాలు.

జ్ఞానాన్ని పంచుకోవడానికి తమ జీవితాన్ని అంకితం చేసిన ప్రతి గురువుకు ఈ గురు పౌర్ణమి ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను. Happy Guru Purnima 2026

అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసాదించే పూజ్య గురువులకు హృదయపూర్వక ప్రణామాలు. మీకు, మీ కుటుంబ సభ్యులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు!

జీవితంలో ప్రతి అడుగులో సరైన మార్గాన్ని చూపి, గమ్యం వైపు నడిపించే శక్తే గురువు. గురు పౌర్ణమి సందర్భంగా నా జీవిత మార్గదర్శకుడైన నా గురువుకి శతకోటి నమస్కారాలు!

ఒక రాతిని అందమైన శిల్పంగా మలిచే శిల్పిలా... నాలోని ప్రతిభను వెలికితీసి, నన్ను ఒక ఉన్నతమైన మనిషిగా తీర్చిదిద్దిన గురువులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు!

"గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరఃగురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః"త్రిమూర్తి స్వరూపుడై మన జీవితాన్ని తీర్చిదిద్దే ప్రతి గురువుకూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గురు పౌర్ణమి శుభాకాంక్షలు!

పుస్తకాల్లో లేని జీవిత పాఠాలను నేర్పి, అనుక్షణం ప్రోత్సహిస్తూ వెన్నుతట్టిన గురువుల రుణం ఏనాటికీ తీర్చుకోలేనిది. మీకు గురు పౌర్ణమి పర్వదిన మహోత్సవ శుభాకాంక్షలు!

మీరు నేర్పిన అక్షర రూపాల శిక్షణే నేటి నా విజయానికి పునాది. నా ఆశయాలకు రెక్కలు తొడిగిన మహానీయులైన గురువులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు!

చీకటిని తరిమేసే కాంతి రేఖ గురువు. మీ మాటలే నా మార్గదర్శకం, మీ దీవెనలే నా రక్షణ కవచం. శ్రేయోభిలాషి అయిన నా గురువుకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు!

తల్లిదండ్రులు జన్మనిస్తే... ఆ జన్మకు సార్థకత చేకూర్చి సమాజంలో ఎలా జీవించాలో నేర్పిన గురువులు పునర్జన్మనిస్తారు. నా గురువులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు!

జ్ఞానానికి ప్రతీక, సన్మార్గానికి సూచిక అయిన గురుదేవుల ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ... Happy Guru Pournami 2026

గురువు చూపించే బాటలో నడిస్తే ఏ గమ్యాన్నైనా సులువుగా చేరుకోవచ్చు. సమస్త గురు పరంపరకు శిరస్సు వంచి ప్రణమిల్లుతూ... శుభ గురు పౌర్ణమి!

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe