ఇళ్ళు, కార్లు, విలాసవంతమైన జీవితం.. ఈ రాశులకు రాబోయే 11 నెలల్లో కలలు నెరవేరుతాయి, సంపద పెరుగుతుంది!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 2026లో కొన్ని రాశుల వారికి చాలా బాగా కలిసి రాబోతోంది. కొత్త ఇల్లు, కార్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ రాశుల వారికి 2026 బాగుంటుంది. అన్నింటికీ ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. సంతోషంగా జీవిస్తారు. పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా బాగా లాభాలు వస్తాయి.
గ్రహాల సంచారంలో మార్పును బట్టి మన జీవితంలో అనేక మార్పులు వస్తాయి. 2026 మాత్రం కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. సరైన నిర్ణయాలను గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు తీసుకుంటే శుభ ఫలితాలు ఎదురవుతాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 2026లో కొన్ని రాశుల వారికి చాలా బాగా కలిసి రాబోతోంది. కొత్త ఇల్లు, కార్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ఈ రాశుల వారికి 2026 బాగుంటుంది. అన్నింటికీ ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మరింత సంతోషంగా జీవిస్తారు. పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా బాగా లాభాలు వస్తాయి. గురువు, శని, రాహు, కేతువుల స్థానాలను బట్టి ఏ రాశి వారికి ఈ ఏడాది కలిసి రాబోతుందో తెలుసుకుందాం.
ఈ రాశులకు గురువు, శని, రాహువు, కేతువుల అనుగ్రహంతో ఈ ఏడాది అంతా గోల్డెన్ డేస్
1.సింహ రాశి
సింహ రాశి వారికి ఈ కొత్త సంవత్సరం రానున్న 11 నెలలు కూడా బాగా కలిసి రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారు కారును కొనుగోలు చేసే అవకాశం ఉంది. కేతువు సింహ రాశిలో ఉండడంతో ఏడాది మొత్తం మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగం లేదా వ్యాపారంలో కూడా బాగా కలిసి వస్తుంది. ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు మరింత అద్భుతంగా ఉండబోతోంది.
2.కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. గురువు కర్కాటక రాశిలో సంచారం చేయడంతో మీకు బాగుంటుంది. కొత్త ఇల్లు, ఫ్లాట్లు లేదా పూర్వీకుల ఆస్తులను పొందే అవకాశం ఉంది. ఎప్పటినుంచో పూర్తికాని సమస్యల్ని కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు. సంతోషం, ప్రశాంతత ఎక్కువ అవుతాయి. జూలై నుంచి డిసెంబర్ వరకు మీకు మరింత అద్భుతంగా ఉండబోతోంది.
3.మిథున రాశి
మిథున రాశి వారికి కూడా 2026 బాగుంటుంది. మిథున రాశి వారు కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. రానున్న 11 నెలలు కూడా మీకు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ట్రావెల్, కమ్యూనికేషన్ రంగాల వారికి కూడా బాగుంటుంది. మీ మొదటి కారును కూడా ఈ ఏడాది మీరు కొనుగోలు చేసే అవకాశం ఉంది. హోమ్ లోన్ కూడా అప్రూవల్ కావచ్చు. జనవరి నుంచి జూన్ వరకు మీకు అద్భుతంగా ఉంటుంది.
4.మకర రాశి
మకర రాశి వారికి ఈ ఏడాది బాగుంటుంది. కొత్త ప్రాపర్టీలను కొనుగోలు చేస్తారు. రాహువు మకర రాశిలోకి ఈ ఏడాది ప్రవేశించడంతో ఊహించని మార్పులు వస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇల్లు, ప్లాట్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. పాత ప్రాపర్టీలను కూడా పొందవచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మీకు బాగా కలిసి వస్తుంది.
5.మీన రాశి
మీన రాశి వారికి 2026 బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగా కలిసి వస్తుంది. శని మీన రాశిలో ఏడాది మొత్తం ఉండడంతో మీకు అద్భుతంగా ఉంటుంది. భూములు వంటి వాటిపై ఇన్వెస్ట్మెంట్లు చేస్తే కూడా కలిసి వస్తాయి. కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు. మార్చి నుంచి నవంబర్ వరకు బాగుంటుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


