Shani Transit in 2026: కొత్త సంవత్సరంలో 6 నెలల పాటు తిరోగమనంలో శని.. ఈ 4 రాశులకు గోల్డెన్ డేస్!

శని న్యాయదేవుడు. మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి పనులకు మంచి ఫలితాలు, చెడ్డ పనులకు చెడ్డ ఫలితాలను అందిస్తాడు. 2026లో శని ఆరు నెలల పాటు తిరోగమనంలోనే ఉంటాడు. కొత్త సంవత్సరం 2026లో జూలై 27 నుంచి శని తిరోగమనంలో ఉంటాడు. దీంతో కొన్ని రాశుల వారు ప్రయోజనాలను పొందుతారు, విజయాలను అందుకుంటారు.

Published on: Jan 8, 2026, 10:00:51 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. శని న్యాయదేవుడు. మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి పనులకు మంచి ఫలితాలు, చెడ్డ పనులకు చెడ్డ ఫలితాలను అందిస్తాడు.

Shani Transit in 2026: కొత్త సంవత్సరంలో 6 నెలల పాటు తిరోగమనంలో శని
Shani Transit in 2026: కొత్త సంవత్సరంలో 6 నెలల పాటు తిరోగమనంలో శని

2026లో శని ఆరు నెలల పాటు తిరోగమనంలోనే ఉంటాడు. కొత్త సంవత్సరం 2026లో జూలై 27 నుంచి శని తిరోగమనంలో ఉంటాడు. సుమారు 6 నెలల పాటు శని తిరోగమనంలో ఉండడం జరుగుతుంది. దీంతో కొన్ని రాశుల వారు ప్రయోజనాలను పొందుతారు, విజయాలను అందుకుంటారు.

జూలై 27 నుంచి తిరోగమనంలో శని

శని నెమ్మదిగా కదిలే గ్రహం. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తూ ఉంటాడు. శని జూలై 26న మీన రాశిలో తిరోగమనం చెందుతాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను పొందుతారు. మరి ఏ రాశుల వారికి శని తిరోగమనం కారణంగా శుభ ఫలితాలు ఎదురవుతాయి? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు? ఇప్పుడు తెలుసుకుందాం.

శని తిరోగమనంతో ఈ రాశుల వారికి అనేక లాభాలు.. కెరియర్, ఆర్థికపరంగా ఊహించని లాభాలు

1.వృషభ రాశి

వృషభ రాశి వారికి శని తిరోగమనం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. విజయాలను అందుకుంటారు. వృషభ రాశి వారు ఈ సమయంలో ప్రతి పనిలో కూడా ప్రయోజనాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీవితంలో అన్ని సమస్యల నుంచి ఉపశమనం కూడా రావచ్చు. ఉద్యోగంలో పదోన్నతి కలిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కూడా ఎక్కువగా లాభాలు కలుగుతాయి.

2.తులా రాశి

తులా రాశి వారికి ఆరు నెలల పాటు శని తిరోగమనం కారణంగా బాగుంటుంది. ఈ రాశి వారు ఈ సమయంలో సంతోషంగా ఉంటారు. అనుకున్న అగ్రిమెంట్లు పూర్తవుతాయి. ఈ సమయంలో ఆస్తిని విక్రయించడం ద్వారా ఎక్కువ లాభం కలుగుతుంది. ఉద్యోగం చేసే వారికి కూడా బదిలీలు ఉంటాయి. ఆర్థికపరంగా కూడా ఈ సమయంలో మీకు బాగా కలిసి వస్తుంది.

3.కన్యా రాశి

కన్యా రాశి వారికి శని తిరోగమనం అనేక విధాలుగా లాభాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఇతర మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం. ఈ సమయంలో మీ అదృష్టం కూడా పెరుగుతుంది.

4.మకర రాశి

మకర రాశి వారికి శని తిరోగమనం ఎక్కువ లాభాలను తీసుకు వస్తుంది. విజయాలను అందుకుంటారు. ఇది అద్భుతమైన సమయం. సంతోషం పెరుగుతుంది. అన్ని పనుల్లో కూడా అదృష్టం కలిసి వస్తుంది. స్టాక్ మార్కెట్ల ద్వారా కూడా లాభాలు కలుగుతాయి. పొదుపు ద్వారా విజయాలను అందుకుంటారు. ఆర్థికపరంగా కూడా లాభాలు ఉంటాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More