...
...
Next Story

పెళ్లికి ముందు ఈ 7 ప్రశ్నలు అడగకపోతే.. భవిష్యత్తులో మీరు కచ్చితంగా పశ్చాత్తాపపడతారు!

ప్రతీ ఒక్కరి జీవితంలో వివాహం అనేది చాలా ముఖ్యమైన విషయం. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉండాలో కొన్ని అంచనాలు ఉంటాయి. అందుకే వివాహానికి ముందే కాబోయే వ్యక్తిని కొన్ని ప్రశ్నలు అడగండి.

Published on: Oct 30, 2026, 11:24:07 IST
Advertisement

హిందూ సంప్రదాయంలో వివాహానికి ముందు వధూవరుల జాతకం, ఇతర విషయాలు పరిశీలించడం ఆనవాయితీ. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు, నక్షత్రాల ఆధారంగా వైవాహిక జీవిత భవిష్యత్తు నిర్ణయించబడుతుందని నమ్మకం. అయితే జాతకంలోని 36 గుణాలు పూర్తిగా అనుకూలంగా ఉండి గురు, శుక్ర గ్రహాలు మంచి స్థితిలో ఉన్నప్పటికీ, ఇద్దరి మనసులు కలవకపోతే ఆ బంధం బలంగా నిలవదు. జ్యోతిష్య గణనలతో పాటు మీ కాబోయే భాగస్వామితో చర్చలు జరపడం కూడా అంతే ముఖ్యం. వివాహానికి ముందు ఈ ముఖ్యమైన విషయాలను మీ భాగస్వామితో చర్చించడం తప్పనిసరి.

వివాహం ఇష్టమేనా?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

మీరు అడగవలసిన మొదటి ప్రశ్న.. వారు ఈ వివాహానికి పూర్తిగా అంగీకరిస్తున్నారా లేదా అని. పరస్పర అంగీకారంతో ఎటువంటి ఒత్తిడి లేకుండా జరిగే వివాహం మాత్రమే ఎక్కువ కాలం నిలుస్తుంది. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తినా, మనం పరస్పర అంగీకారంతో వివాహం చేసుకున్నామనే విషయం సమస్యలను పరిష్కరించుకోవడానికి సహాయపడుతుంది.

కలలకు గౌరవం ఇవ్వండి

ప్రతి ఒక్కరికీ వారి సొంత కలలు, లక్ష్యాలు ఉంటాయి. భవిష్యత్తు గురించి వారి కలలు ఏమిటో వారిని అడగడం, ఆ కలలను మనం కలిసి ఎలా సాకారం చేసుకోగలమో తెలుసుకోవడం ముఖ్యం. దీనివల్ల మీరు, మీ భాగస్వామి ఒకే దిశలో ఆలోచిస్తున్నారో లేదో ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటున్నారో లేదో తెలుసుకోవచ్చు.

ఫ్యామిలీల గురించి మాట్లాడుకోండి

వివాహం తర్వాత రెండు కుటుంబాలు ఒకటిగా మారతాయి. రెండు కుటుంబాలకూ సమాన గౌరవం ఇవ్వడం చాలా ముఖ్యం. అందువల్ల వివాహం తర్వాత రెండు కుటుంబాలతో సంబంధాలను ఎలా నిర్వహించాలనే దానిపై ముందుగానే చర్చించుకోవడం ముఖ్యం. ఇది భవిష్యత్తులో కుటుంబంతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి, సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి మార్గం సుగమం చేస్తుంది.

పిల్లల గురించి మాట్లాడండి

పిల్లలు, కుటుంబ ప్రణాళికల గురించి బహిరంగంగా మాట్లాడటం ముఖ్యం. పెళ్లి తర్వాత పిల్లలను కనాలా వద్దా, ఎన్ని సంవత్సరాల వ్యవధి ఉండాలి అనే విషయాలపై ముందుగానే స్పష్టత ఉండాలి.

ఆరోగ్యం గురించి

వివాహానికి ముందే ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛకు మరొకరు మద్దతు ఇవ్వడంపై ఏకాభిప్రాయం ఉండాలి. అలా అయితే భవిష్యత్తులో వైవాహిక జీవితం ఎటువంటి ఆటంకాలు లేకుండా మరింత సంతోషంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇద్దరి మధ్య సంబంధంలో అత్యంత ముఖ్యమైనది ఏంటో అడగండి. అది ప్రేమ, నమ్మకం, విశ్వాసం లేదా మరే ఇతర విషయమైనా, వారు ఎలా ఊహిస్తారో అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది.

ఆర్థిక విషయాలు

వైవాహిక జీవితంలో ఆర్థిక విషయాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. డబ్బు విషయంలో దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి, దాని కారణంగా వారి సంబంధాలు విచ్ఛిన్నమైన అనేక సందర్భాలను సాధారణంగా చూస్తూనే ఉంటాం. అందువల్ల వివాహానికి ముందే ఆర్థిక బాధ్యతలు, పొదుపు, ఖర్చుల గురించి చర్చించుకోవడం చాలా అవసరం.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks