Mercury Transit: గ్రహాలు కాలనుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది మొత్తం అన్ని రాశుల వారి జీవితంలో కూడా అనేక మార్పులను తీసుకొస్తుంది. బుధుడు తెలివితేటలు, వ్యాపారం, మాట మొదలైన వాటికి కారకుడు. బుధుడు కూడా కాలానుగుణంగా తన రాశిని మారుస్తూ ఉంటాడు. అయితే డిసెంబర్ నెలలో బుధుడు ఏకంగా ఒకటి కాదు, రెండు కాదు, ఐదు సార్లు తన రాశి సంచారంలో మార్పు చేయబోతున్నాడు. బుధుడు సంచారంతో ఏ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది, ఏ రాశుల వారు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
బుధ సంచారంలో మార్పు

2025లో ఆఖరి నెల డిసెంబర్. ఈ నెలలో ఐదు సార్లు బుధ సంచారంలో మార్పు జరగబోతోంది. బుధుడు డిసెంబర్లో వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. డిసెంబర్ 6న బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. డిసెంబర్ 10న బుధుడు అనూరాధ నక్షత్రంలో సంచారం చేస్తాడు. డిసెంబర్ 24న జ్యేష్ఠ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అలాగే డిసెంబర్ 27న బుధుడి సంచారంలో మార్పు వస్తుంది. డిసెంబర్ 29న ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా ఐదు సార్లు బుధ సంచారంలో మార్పు జరుగుతుంది. కొన్ని రాశుల వారికి అదృష్టం కలుగుతుంది.
బుధ సంచారంలో ఐదు సార్లు మార్పు.. ఈ రాశుల వారికి బోలెడు లాభాలు
1.మకర రాశి:
మకర రాశి వారికి ఐదు సార్లు బుధ సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎప్పటి నుంచో పూర్తి కాని పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆర్థికపరంగా బాగుంటుంది. సంతోషం కూడా పెరుగుతుంది. ఇలా ఈ రాశి వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు.
2.సింహ రాశి:
సింహ రాశి వారికి బుధ సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు పురోగతిని చూస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారి జ్ఞానం పెరుగుతుంది. విద్యార్థులకు కూడా ఇది శుభ సమయం. ఆర్థికపరంగా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా బాగా కలిసి వస్తుంది. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది.
3.తులా రాశి:
{{/usCountry}}సింహ రాశి వారికి బుధ సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు పురోగతిని చూస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారి జ్ఞానం పెరుగుతుంది. విద్యార్థులకు కూడా ఇది శుభ సమయం. ఆర్థికపరంగా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా బాగా కలిసి వస్తుంది. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది.
3.తులా రాశి:
{{/usCountry}}తులా రాశి వారికి బుధ సంచారంలో మార్పు బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఈ రాశి వారు పేరు, ప్రతిష్టలను సంపాదిస్తారు. సువర్ణ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారులకు కూడా ఇదే శుభసమయం. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు.