గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అశుభ యోగాలు, శుభ యోగాలు ఏర్పడుతుంటాయి. మరి కొన్ని రోజుల్లో నవంబర్ నెల పూర్తి కాబోతోంది, డిసెంబర్ రాబోతోంది. ఈ డిసెంబర్ నెలలో కొన్ని గ్రహాల సంచారంలో మార్పు ఉండనుంది.

ముఖ్యంగా శుక్రుని సంచారం ఆసక్తికరంగా మారబోతోంది. డిసెంబర్ 2025లో శుక్రుడు నాలుగు సార్లు తన స్థానాన్ని మారుస్తాడు. ఐదు రాశుల వారికి విపరీతమైన లాభాలను తీసుకొస్తాడు. శుక్రుడు సంపద, డబ్బు, విలాసవంతమైన జీవితానికి కారకుడు. శుక్ర సంచారం కొన్ని రాశుల వారిపై శుభ ఫలితాలను తీసుకురాబోతోంది.
డిసెంబర్ నెలలో నాలుగు సార్లు శుక్రుని సంచారంలో మార్పు:
డిసెంబర్ 9న శుక్రుడు అనూరాధ నక్షత్రం నుంచి జ్యేష్ఠ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. డిసెంబర్ 19న శుక్రుడు దక్షిణం వైపు కదులుతాడు. డిసెంబర్ 20న శుక్రుడు వృశ్చిక రాశి నుంచి తులా రాశి ద్వారా ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. డిసెంబర్ 30న శుక్రుడు మూల నక్షత్రం నుంచి పూర్వాషాఢ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇలా నాలుగు సార్లు శుక్రుని సంచారంలో మార్పు కొన్ని రాశుల వారికి అద్భుతాలను తీసుకురాబోతోంది.
డిసెంబర్ నెలలో నాలుగు సార్లు శుక్రుడి సంచారంలో మార్పు.. ఈ రాశులకు లాభాలు
1.మిథున రాశి
మిథున రాశి వారికి డిసెంబర్ నెల బాగా కలిసి రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. ఆర్ట్స్, మ్యూజిక్‌పై ఆసక్తి ఇంకా పెరుగుతుంది. చిన్న ఇన్వెస్ట్మెంట్లు చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి.
2.వృషభ రాశి
వృషభ రాశి వారికి శుక్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవ–మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థికపరంగా కూడా బాగా ఉంటుంది. ప్రశాంతత ఉంటుంది.
3.కన్యా రాశి
కన్యా రాశి వారికి శుక్రుని సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆనందం పెరుగుతుంది. ప్రేమ జీవితం అద్భుతంగా సాగుతుంది. ఉద్యోగులు, వ్యాపారస్తులకు ఇది మంచి సమయం. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి.
4.తులా రాశి
{{/usCountry}}కన్యా రాశి వారికి శుక్రుని సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆనందం పెరుగుతుంది. ప్రేమ జీవితం అద్భుతంగా సాగుతుంది. ఉద్యోగులు, వ్యాపారస్తులకు ఇది మంచి సమయం. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి.
4.తులా రాశి
{{/usCountry}}తులా రాశి వారికి శుక్రుని సంచారంలో మార్పు బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు. అదృష్టం కూడా మీ వైపు ఉంటుంది.
5.మీన రాశి
మీన రాశి వారికి శుక్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ఆర్థికపరంగా బాగుంటుంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల సపోర్ట్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.