ఫిబ్రవరి నెలలో నాలుగు ప్రధాన గ్రహాల సంచారంలో మార్పుతో ఐదు శక్తివంతమైన రాజయోగాలు.. ఈ రాశుల వారి పంట పండినట్టే!
ఫిబ్రవరి నెలలో చూసినట్లయితే, కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు జరగబోతోంది. కొన్ని గ్రహాలు వాటి రాశులను మార్చబోతున్నాయి. దీంతో ఐదు శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. ఫిబ్రవరి 2026లో కొన్ని రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నారు.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఫిబ్రవరి నెలలో చూసినట్లయితే, కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు జరగబోతోంది. కొన్ని గ్రహాలు వాటి రాశులను మార్చబోతున్నాయి. దీంతో ఐదు శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. ఫిబ్రవరి 2026లో కొన్ని రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నారు. దీంతో ఈ నాలుగు గ్రహాలు కొన్ని ముఖ్యమైన యోగాలను ఏర్పరుస్తున్నాయి.

ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు
ఫిబ్రవరి 3న గ్రహాలకు యువరాజైన బుధుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ రాహువుతో సంయోగం చెందుతాడు. ఆ తర్వాత శుక్రుడు ఫిబ్రవరి 6న కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు ఫిబ్రవరి 13న కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు ఫిబ్రవరి 23న కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో లక్ష్మీనారాయణ యోగం, శుక్రాదిత్య రాజయోగం, సూర్య కుజ రాజయోగం, బుధాదిత్య రాజయోగం, చతుర్గ్రాహి రాజయోగాలు ఏర్పడతాయి. ఇవి ఐదు రాశుల వారి జీవితాల్లో అద్భుతాలను తీసుకురాబోతున్నాయి.
ఫిబ్రవరి నెలలో నాలుగు ప్రధాన గ్రహాల సంచారంలో మార్పుతో ఐదు శక్తివంతమైన రాజయోగాలు.. ఈ రాశులకు అద్భుతాలు
మేష రాశి
మేష రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ప్రమోషన్లు పొందుతారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ఎర్రటి దానిమ్మలను దానంగా ఇచ్చి, మంగళవారం నాడు హనుమాన్ చాలీసాను పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. ఫిబ్రవరి 17న ఈ రాశి వారికి చాలా బాగా కలిసి వస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆర్థికపరంగా బాగుంటుంది. వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వారు శనివారం నాడు ఆహారాన్ని దానం చేస్తే బాగా కలిసి వస్తుంది.
మిథున రాశి
ఫిబ్రవరి నెల ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఎప్పటి నుంచో పూర్తి కాని పనులను ఈ సమయంలో పూర్తి చేస్తారు. ఒత్తిడి ఉన్నప్పటికీ అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికపరంగా బాగుంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బాగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో మర్చిపోలేని ట్రిప్ వేస్తారు.
కన్య రాశి
కన్య రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. విజయాలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు కూడా బాగా కలిసి వస్తుంది. రిలేషన్‌షిప్‌లో కూడా బాగుంటుంది. అన్ని విధాలుగా లాభాలను పొందుతారు.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఇది మంచి సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఈ నెలలో ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి బాగా కలిసి వస్తుంది. ఫిబ్రవరిలో ఈ రాశి వారు ఆర్థికపరంగా ప్రయోజనాలను పొందుతారు. సక్సెస్‌ను అందుకుంటారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


