...
...
Next Story

మరో ఐదు రోజుల్లో బుధ, శనిల శక్తివంతమైన నవపంచమ యోగం, ఈ రాశులకు బోలెడు లాభాలు.. డబ్బు, ఆస్తులు, అదృష్టంతో పాటు ఎన్నో

బుధుడు, శని నవపంచమ యోగాన్ని ఏర్పరచనున్నాయి. దీనితో ప్రత్యేకమైన లాభాలు కలుగుతాయి. ఈ శక్తివంతమైన రాజయోగం వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ ముఖ్యంగా ఈ మూడు రాశుల వారు ఎక్కువ లాభాలను పొందుతారు. పూర్వీకుల నుంచి ఆస్తిని పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది.

Published on: Oct 21, 2025, 10:00:14 IST
Advertisement

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. బుధుడు, శని నవపంచమ యోగాన్ని ఏర్పరచనున్నాయి. దీనితో ప్రత్యేకమైన లాభాలు కలుగుతాయి. మరి ఈ నవపంచమ రాజయోగం ఏ రాశుల వారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం.

బుధ,శనిల నవపంచమ యోగం:

బుధ,శనిల నవపంచమ యోగం (pinterest)
బుధ,శనిల నవపంచమ యోగం (pinterest)

బుధుడు, శని రెండు ఒకదానికొకటి 120 డిగ్రీల కోణంలో ఉన్నప్పుడు ఈ నవపంచమ యోగం ఏర్పడుతుంది. ద్రిక్ పంచాంగం ప్రకారం బుధుడు, శని నవపంచమ రాజయోగాన్ని ఏర్పరచబోతున్నాయి. అక్టోబర్ 26, ఆదివారం ఉదయం 2:44కు రాజయోగం ఏర్పడుతుంది.

ఈ రాశులకు బోలెడు లాభాలు

ఈ శక్తివంతమైన రాజయోగం వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ ముఖ్యంగా ఈ మూడు రాశుల వారు ఎక్కువ లాభాలను పొందుతారు. పూర్వీకుల నుంచి ఆస్తిని పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. కొత్త ప్రాజెక్టులపై పని చేస్తారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఈ రెండు గ్రహాల కలయిక ఏ రాశుల వారికి అదృష్టం తీసుకువస్తుంది, ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు ఇప్పుడు తెలుసుకుందాం.

బుధ, శనిల నవపంచమ యోగం.. ఈ రాశుల వారికి విపరీతమైన అదృష్టం:

1.మిథున రాశి:

మిథున రాశి వారికి రాజయోగం అనేక విధాలుగా కలిసి వస్తుంది. అదృష్టం పెరుగుతుంది, ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది. అలాగే ఎదుగుదలని చూస్తారు. ఈ సమయంలో మీపై మీకు నమ్మకం కలుగుతుంది, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది. పూర్వీకుల నుంచి ఆస్తిని పొందుతారు. కార్లు, భూములు కొనుగోలు చేస్తారు.

2.మకర రాశి:

కుంభ రాశి వారికి ఈ రాజయోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు, ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. వ్యాపారులకూ బాగా కలిసి వస్తుంది. సంతోషంగా ఉంటారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks