ఇందిరా ఏకాదశి 2026: తేదీ, సమయం, పూజా విధానం పూర్తి వివరాలు!

ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి. ఆశ్వయుజ శుక్లపక్ష ఏకాదశిని ఇందిరా ఏకాదశిగా పిలుస్తారు. పితృపక్ష సమయంలో వచ్చే ఈ ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని మత విశ్వాసాలు చెబుతున్నాయి. భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించడం ద్వారా పాపాలు తొలగి, సుఖసంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయని నమ్మకం. 

Published on: Oct 2, 2026, 14:00:29 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ప్రతి నెలకు రెండు ఏకాదశులు వస్తాయి. అంటే సంవత్సరానికి 24 ఏకాదశులు. అక్టోబర్ నెలలో కూడా రెండు ఏకాదశులు వచ్చాయి. ఆశ్వయుజ మాసం శుక్లపక్ష ఏకాదశి తిథి ఎప్పుడు వచ్చింది? ఆ రోజు ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి? ఆ ఏకాదశి రోజు ఏం చేయాలి? ఏంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇందిరా ఏకాదశి 2026: తేదీ, సమయం, పూజా విధానం పూర్తి వివరాలు! (AI)
ఇందిరా ఏకాదశి 2026: తేదీ, సమయం, పూజా విధానం పూర్తి వివరాలు! (AI)

ఇందిరా ఏకాదశి 2026

ఆశ్వయుజ శుక్లపక్ష ఏకాదశి తిథిని ఇందిరా ఏకాదశి అని అంటారు. పితృపక్ష సమయంలో వచ్చే ఈ ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మత విశ్వాసాల ప్రకారం చూసినట్లయితే, భక్తి శ్రద్ధలతో ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయి, సుఖసంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయని నమ్మకం. అలాగే ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన పుణ్య ఫలితం దక్కుతుంది. విష్ణువుని పూజించడంతో పాటు పూర్వీకులకు ప్రార్థనలు చేయడం, వారి పేరుతో దానధర్మాలు చేయడం కూడా ఆనవాయితీగా వస్తుంది. పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు.

ఇందిరా ఏకాదశి తిథి సమయం

ఏకాదశి తిథి ప్రారంభం అక్టోబర్ 6, మంగళవారం ఉదయం 2:07 గంటలకు. ఏకాదశి తిథి ముగింపు అక్టోబర్ 7, బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు. ఏకాదశి వ్రతాన్ని అక్టోబర్ 6, మంగళవారం నాడు జరుపుకోవాలి.

వ్రత విరమణ

ఇందిరా ఏకాదశి రోజు ఉపవాసం ఉండి, తర్వాత రోజు అనగా అక్టోబర్ 7, బుధవారం నాడు ఉదయం 6:14 నుంచి ఉదయం 8 గంటల వరకు విరమణ చేయడానికి అనుకూలంగా ఉంది. పూజ చేసుకునే వారు ఈ పద్ధతిని పాటించడం మంచిది.

ఏకాదశి వ్రత విధానం

ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్ర లేచి, స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించి విష్ణువు ఎదుట వ్రత సంకల్పం చేసుకోవాలి.

తర్వాత పూజ మందిరంలో విష్ణువు విగ్రహం లేదా చిత్రపటాన్ని పెట్టండి.

విష్ణువుకి ఎంతో ఇష్టమైన పసుపు పూలను కచ్చితంగా సమర్పించేలా చూసుకోండి.

అలాగే విష్ణువుకి చందనం, అక్షింతలు, ధూపం, దీపం, నైవేద్యాలను సమర్పించండి.

తులసి ఆకులు అంటే విష్ణువుకి ఎంతో ప్రీతి కాబట్టి, తులసి ఆకులను కూడా విష్ణువుకి సమర్పించండి. తర్వాత పండ్లను నైవేద్యంగా పెట్టండి.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారంపై, అవి పూర్తిగా నిజమైనవి మరియు ఖచ్చితమైనవి అని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించండి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More