అక్టోబర్‌లో రెండు ఏకాదశులు.. ఇంద్ర, పాపాంకుశ ఏకాదశి తేదీలు, పూజా విధానం ఇదే!
హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెల శుక్లపక్షం, కృష్ణపక్షంలో ఒక్కొక్కటి చొప్పున రెండు ఏకాదశులు వస్తాయి. సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు ఉండగా, ప్రతి ఏకాదశికి ప్రత్యేకమైన పేరు, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంటుంది. అక్టోబర్ 2026లో ఇంద్ర ఏకాదశి, పాపాంకుశ ఏకాదశి వస్తున్నాయి.
ఏకాదశి తిథికి ఉన్న విశిష్టత గురించి చెప్పక్కర్లేదు. ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన విష్ణు అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెలలో శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో ఒక్కొక్క ఏకాదశి వస్తుంది. సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ప్రత్యేకమైన పేరు, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉంటాయి.

అక్టోబర్ నెలలో వచ్చే రెండు ఏకాదశుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అక్టోబర్ నెలలో ఇంద్ర ఏకాదశి, పాపాంకుశ ఏకాదశి.. ఈ రెండు ఏకాదశులు కూడా చాలా విశేషమైనవి. ఈ రెండు ఏకాదశుల రోజు విష్ణువుని భక్తితో పూజించడం వలన అద్భుతమైన ఫలితాలను చూడవచ్చు.
ఇంద్ర ఏకాదశి 2026
భాద్రపద మాసం కృష్ణపక్ష ఏకాదశిని ఇంద్ర ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి పితృపక్షంలో వస్తుంది. ధార్మిక విశ్వాసాల ప్రకారం ఇంద్ర ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణువును ఆరాధించడం వలన అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు.
ఉపవాస తిథి తేదీ: అక్టోబర్ 6, మంగళవారం.
ఏకాదశి తిథి ప్రారంభం: అక్టోబర్ 6 ఉదయం 02:07 గంటలకు.
ఏకాదశి తిథి ముగింపు: అక్టోబర్ 7 అర్ధరాత్రి 12:34 గంటలకు.
వ్రత పారణ సమయం: అక్టోబర్ 7 ఉదయం 06:14 నుంచి 08:05 వరకు.
పాపాంకుశ ఏకాదశి 2026
ఆశ్వయుజ మాసం శుక్లపక్ష ఏకాదశిని పాపాంకుశ ఏకాదశి అని అంటారు. శారదీయ నవరాత్రులు, విజయదశమి తర్వాత ఈ ఏకాదశి వస్తుంది. ఆ రోజు ఉపవాసం ఉండి విష్ణువును భక్తిశ్రద్ధలతో పూజిస్తే పాపాలు తొలగిపోతాయి. సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయి.
ఉపవాస తేదీ: అక్టోబర్ 22, గురువారం.
ఏకాదశి తిథి ప్రారంభం: అక్టోబర్ 21 మధ్యాహ్నం 02:11 గంటలకు.
ఏకాదశి తిథి ముగింపు: అక్టోబర్ 22 మధ్యాహ్నం 02:47 గంటలకు.
వ్రత పారణ సమయం: అక్టోబర్ 23 ఉదయం 05:51 నుంచి 09:39 వరకు.
ఏకాదశి పూజా విధానం
ఏకాదశి నాడు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి, విష్ణువుని ధ్యానించి ఉపవాస సంకల్పం చెప్పుకోవాలి. పూజా స్థలాన్ని శుభ్రం చేసి, విష్ణువు చిత్రపటం లేదా విగ్రహాన్ని పెట్టి పసుపు, కుంకుమలు, అక్షింతలు, పసుపు రంగులో ఉండే పూలు, తులసి దళాలు సమర్పించాలి. నైవేద్యం కూడా సమర్పించి, వ్రత కథను చదువుకోవాలి. విష్ణువుకి హారతి ఇచ్చి పూజను ముగించాలి.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారంపై, అవి పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనవి అని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలోని నిపుణుడి సలహా తీసుకోండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


