...
...
Next Story

దారిలో వెళ్తుంటే డబ్బు దొరకడం అదృష్టమా? దురదృష్టమా?

రోడ్డు మీద ఏదో ఒకసారి డబ్బులు దొరికే ఉంటాయ్ కదా. ఇలా దొరకడం కొందరు అదృష్టంగా భావిస్తారు. మరికొందరు ఇది విపత్తుకు సంకేతమని భయపడతారు. జ్యోతిష్య శాస్త్రం రోడ్డు మీద దొరికిన డబ్బు గురించి కొన్ని విషయాలు చెబుతోంది.

Published on: Aug 15, 2026, 12:23:20 IST
Advertisement

రోడ్డుపై దొరికిన డబ్బును అలా వదిలేస్తారా? దాదాపు ఎవరూ అంత ఈజీగా వదిలేసి వెళ్లరు. రోడ్డుపై పది రూపాయల నోటు దొరికినా జనం ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుంటారు. దాన్ని అందుకోవడానికి ముందు నలుదిక్కులా చూస్తారు. ఎవరైనా చూస్తున్నారేమోనని కూడా పరిశీలిస్తారు. ఆ తర్వాత తీసి జేబులో పెట్టుకుంటారు. జ్యోతిష్యం, హిందూ శాస్త్రాల ప్రకారం రోడ్డుపై డబ్బు దొరకడం కేవలం అదృష్టం కాదు. దాని వెనక కొన్ని విషయాలు ఉన్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

జ్యోతిష్య శాస్త్రంలో రోడ్డుపై డబ్బు దొరకడాన్ని శుభ, అశుభ సంకేతంగా భావిస్తారు. కొంతమంది పండితుల ప్రకారం ఇది లక్ష్మీదేవి అనుగ్రహం. మీ కర్మ ఫలితంగా అది మీకు లభించింది. మరికొందరి ప్రకారం అది ఎవరో కష్టపడి సంపాదించి పోగొట్టుకున్న డబ్బు. మీరు దానిని తీసుకుంటే.. దుఃఖం మీకు కూడా తోడవ్వవచ్చు. అమావాస్య రోజున శనివారం నాడు లేదా రాహువు సమయంలో దొరికిన డబ్బు విషయంలో మీరు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి.

మొదట చుట్టుపక్కల ఎవరైనా దాని కోసం వెతుకుతున్నారేమో చూడండి. అది ఆలయ ఖజానాలో వేయడం లేదా పేదలకు దానం చేయడం మంచిది. దీనివల్ల దోషం తొలగిపోతుంది. దానిని ఇంటికి తీసుకువచ్చి నేరుగా ఖర్చు చేయవద్దని శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే అవి ఎవరి కన్నీళ్లో మీకు తెలియదు. దానిని తీసుకున్న వెంటనే చేతులు కడుక్కొని, గంగాజలంతో లేదా ఉప్పునీటితో పవిత్రం చేసుకోండి.

మీకు పెద్ద మొత్తంలో డబ్బు దొరికితే, దానిని పోలీస్ స్టేషన్‌కు అప్పగించడం చట్టబద్ధంగా, మతపరంగా సరైనది. ఒక వారంలోగా దానిని స్వీకరించడానికి ఎవరూ రాకపోతే, దానిని మతపరమైన ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు.

మొత్తమ్మీద ప్రయాణంలో వెళ్తుంటే.. డబ్బు దొరకటం అనేది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. అది మిమ్మల్ని మీరు పరీక్షించుకునే ఒక పరీక్ష కూడా. మీకు నిజాయితీ, దాతృత్వ గుణం ఉంటే, ఆ డబ్బు మీకు మంచిని మాత్రమే తెస్తుంది. మీరు దానిని స్వార్థ కారణాల కోసం ఉపయోగిస్తేనే అది సమస్యలను సృష్టిస్తుంది.

గమనిక : ఇది కేవలం నమ్మకాల మీద ఆధారపడిన కథనం. ఎవరికైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe