...
...
Next Story

January 2026 Festivals: జనవరిలో భోగి, సంక్రాంతితో పాటు ఏ పండుగలు ఎప్పుడు వచ్చాయి? వ్రతాలు, పండుగల పూర్తి లిస్ట్ ఇదిగో!

జనవరి 1, 2026 గురువారం అనగా నేడు ఆంగ్ల సంవత్సరం మొదలు అయ్యింది. 2026 జనవరి నెల క్యాలెండర్, పండుగలు, సెలవులు, రాశిఫలాలు, మరియు 2026 సంవత్సరానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలు ఈ కథనంలో అందుబాటులో ఉన్నాయి. ఈ నెలలో కొన్ని ముఖ్యమైన శుభకార్యాలు కూడా జరుగుతాయి. జనవరి 2026 వ్రతాలు, పండుగలు లిస్ట్ ఇదిగో.

Published on: Jan 1, 2026, 12:30:47 IST
Advertisement

జనవరి 1, 2026 గురువారం అనగా నేడు ఆంగ్ల సంవత్సరం మొదలు అయ్యింది. 2026 జనవరి నెల క్యాలెండర్, పండుగలు, సెలవులు, రాశిఫలాలు, మరియు 2026 సంవత్సరానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలు ఈ కథనంలో అందుబాటులో ఉన్నాయి. ఈ నెలలో కొన్ని ముఖ్యమైన శుభకార్యాలు కూడా జరుగుతాయి.

జనవరి 2026 వ్రతాలు, పండుగలు (pinterest)
జనవరి 2026 వ్రతాలు, పండుగలు (pinterest)

2026 జనవరి 1వ తేదీ గురువారం నాడు నూతన సంవత్సరం మొదలు అయ్యింది. 2025 సంవత్సరంలో ఉన్నట్లే, కొత్త సంవత్సరం 2026 లో కూడా పండుగల తేదీల విషయంలో కాస్త గందరగోళం ఉంది. ముఖ్యంగా హోళీ మరియు దీపావళి పండుగల తేదీలపై కాస్త కన్ఫ్యూజన్ వుంది.

హోలీ 2026 ఎప్పుడు వచ్చింది?

హోలీ పండుగ రోజున గ్రహణం ఉంది. సాధారణంగా హోలికి ముందు రోజు హోలికా దహనం చేస్తారు. గ్రహణం వలన హోలికా దహనం ఏ రోజున చేయాలి అనే విషయంలో సందేహం వస్తుంది. అయితే, రంగులు చల్లుకుని హోళీ జరుపుకునే రోజు మార్చి 4గా నిర్ణయించబడింది. గ్రహణాలు, తిథుల మార్పుల వల్ల 2026లో కూడా కాస్త పండుగల తేదీలపై అయోమయం ఏర్పడింది.

జనవరి 2026 వ్రతాలు, పండుగలు

1 జనవరి 2026, గురువారం- ప్రదోష వ్రతం

3 జనవరి 2026, శనివారం- పుష్య పూర్ణిమ

6 జనవరి 2026, మంగళవారం- సంకటహర చతుర్థి

14 జనవరి 2026, బుధవారం- భోగి పండుగ, షట్తిల ఏకాదశి

14 జనవరి 2026, గురువారం- మకర సంక్రాంతి

18 జనవరి 2026, ఆదివారం- అమావాస్య

23 జనవరి 2026, శుక్రవారం- వసంత పంచమి

25 జనవరి 2026, ఆదివారం- రథ సప్తమి

26 జనవరి 2026, సోమవారం- భీష్మ అష్టమి

29 జనవరి 2026, గురువారం- జయ ఏకాదశి

30 జనవరి 2026, శుక్రవారం- ప్రదోష వ్రతం

ప్రదోష వ్రతం నాడు పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే మంచి జరుగుతుందని, సంతోషంగా ఉండొచ్చని నమ్ముతారు. అలాగే పుష్య పౌర్ణమి నాడు చంద్రుడిని ఆరాధించి కొన్ని పరిహారాలను పాటిస్తే సమస్యలు తీరుతాయని నమ్మకం. ఆ రోజు మా లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని ప్రత్యేకించి ఆరాధిస్తే ఉత్తమ ఫలితాలను చూడొచ్చు. అలాగే జనవరి 6న వచ్చే సంకటహర చతుర్థి నాడు వినాయకుడిని ఆరాధిస్తే విఘ్నాలు అన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు. భోగి మంటలు, భోగి పండ్లు, గంగిరెద్దులు, గాలిపటాలను ఎగుర వేయడం, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దులు, పిండి వంటలతో భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ జరుపుకుంటాము.

షట్తిల ఏకాదశి నాడు విష్ణువుని ఆరాధించాలి. మాస శివరాత్రి నాడు శివుడిని పూజించాలి. వసంత పంచమి నాడు సరస్వతి దేవిని ఆరాధించాలి. అక్షరాభ్యాసం అవ్వని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించుకోవడానికి ఇది ఉత్తమ రోజు. రథ సప్తమి నాడు సూర్యుడిని పూజించి, చిక్కుడు ఆకుల్లో పరమాన్నం వేసి నైవేద్యం పెడతారు. జయ ఏకాదశి చాలా విశేషమైన రోజు. ఆ రోజున కూడా విష్ణువుని భక్తితో ఆరాధిస్తే మంచిది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks