...
...
Next Story

జయ ఏకాదశి 2026: జయ ఏకాదశి వేళ రవి యోగం, ఇలా పూజిస్తే విష్ణువు ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది!

ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. ఏకాదశి నాడు విష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించి ఉపవాసం ఉంటే ఎంతో మేలు జరుగుతుంది. పాపాలన్నీ తొలగిపోతాయి, మోక్షాన్ని కూడా పొందవచ్చు. ఈసారి వచ్చే ఏకాదశి చాలా విశేషమైనది. జయ ఏకాదశి ఉపవాసం తేదీ, సమయం, పూజా విధానం సహా పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Published on: Jan 27, 2026, 08:00:16 IST
Advertisement

ఏకాదశి తిథికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. ఏకాదశి నాడు విష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించి ఉపవాసం ఉంటే ఎంతో మేలు జరుగుతుంది. పాపాలన్నీ తొలగిపోతాయి, మోక్షాన్ని కూడా పొందవచ్చు. ఈసారి వచ్చే ఏకాదశి చాలా విశేషమైనది. జయ ఏకాదశి ఉపవాసం తేదీ, సమయం, పూజా విధానం సహా పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

జయ ఏకాదశి 2026

జయ ఏకాదశి 2026: జయ ఏకాదశి వేళ రవి యోగం (pinterest)
జయ ఏకాదశి 2026: జయ ఏకాదశి వేళ రవి యోగం (pinterest)

ఏకాదశి తిథి జనవరి 28 సాయంత్రం 4:35కి ప్రారంభమై, జనవరి 29 మధ్యాహ్నం 1:55కి ముగుస్తుంది. ఈ లెక్కన జయ ఏకాదశి ఉపవాసం, పూజను జనవరి 29న జరుపుకోవాలి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి విగ్రహాలను ప్రతిష్టించి పూజ చేయాలి. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఏకాదశి విశిష్టతను వివరించాడు.

ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మోక్షం లభిస్తుందని, సక్సెస్‌ను అందుకోవచ్చని, పేదరికం నుంచి కూడా బయటపడవచ్చని తెలిపాడు. శత్రువుల బాధల నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే సమాజంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి. పూర్వికుల ఆశీస్సులు కూడా పొందే అవకాశం కలుగుతుంది.

జయ ఏకాదశి 2026 వేళ శుభ యోగాలు

జయ ఏకాదశి నాడు భద్రవాస, రవి యోగాలు ఏర్పడతాయి. రవి యోగం సమయంలో లక్ష్మీనారాయణులను ఆరాధించడం చాలా మంచిది. ఇలా చేయడం వలన భక్తులు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. కెరీర్, వ్యాపారంలో కూడా మంచి ఫలితాలు సాధిస్తారు. లక్ష్మీదేవి మరియు విష్ణువుల అనుగ్రహం కలుగుతుంది.

జయ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఇలా ఆరాధించండి

  1. జయ ఏకాదశి నాడు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి ధ్యానం చేయాలి.
  2. ఆ తర్వాత స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసి విష్ణుమూర్తిని పూజించాలి.
  3. జయ ఏకాదశి నాడు పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది.
  4. ఇంట్లో గంగాజలాన్ని జల్లి, సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి పూజ ప్రారంభించాలి.
  5. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి విగ్రహాలను ప్రతిష్టించి పూజ చేయాలి.
  6. పసుపు రంగు వస్త్రాలను విష్ణుమూర్తికి సమర్పించాలి.
  7. పసుపు రంగు పువ్వులు, పండ్లు, స్వీట్లు నైవేద్యంగా సమర్పించాలి.
  8. విష్ణు చాలీసా, విష్ణు స్తోత్రాలను పఠించాలి.
  9. తరువాత రోజు ఉపవాసాన్ని విరమించి, తోచిన వాటిని దానం చేయడం మంచిది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks