July Monthly Horoscope: జూలైలో గ్రహాల సంచారం.. ఈ 4 రాశుల వారికి అదృష్టం తలుపుతట్టనుంది!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై నెలలో శుక్రుడు, సూర్యుడు, బుధుడు, శని గ్రహాల సంచారాలు మరియు గమన మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ గ్రహ మార్పుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలగనున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

Published on: Jun 24, 2026, 11:00:58 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. ఆ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతినెలా ఏదో ఒక గ్రహం తన రాశిని లేదా గమనాన్ని మారుస్తూ ఉంటుంది. ఇక జూలై నెలలో గ్రహాల సంచారాల కారణంగా ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.

July Monthly Horoscope: జూలైలో గ్రహాల సంచారం.. ఈ 4 రాశుల వారికి అదృష్టం తలుపుతట్టనుంది! (pinterest)
July Monthly Horoscope: జూలైలో గ్రహాల సంచారం.. ఈ 4 రాశుల వారికి అదృష్టం తలుపుతట్టనుంది! (pinterest)

జూలై నెలలో శుక్రుడు, బుధుడు, సూర్యుడు, శని గ్రహం గమనాన్ని మారుస్తారు. శుక్రుడు సుఖసంపదలకు కారకుడు. బుధుడు వ్యాపారాలు, వాక్చాతుర్యానికి కారకుడు. సూర్యుడు గ్రహాధిపతి, అలాగే ధైర్యం, ఆత్మవిశ్వాసానికి కారకుడు. శని గ్రహం మనం చేసిన పనులను బట్టి ఫలితాన్ని ఇస్తుంది. అయితే, జూలై 4న శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. జూలై 16న సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. జూలై 24న బుధుడు తిరోగమనం నుంచి మార్గగతిలోకి వస్తాడు. అలాగే శని జూలై 27న వక్రగతిని ప్రారంభిస్తాడు. ఈ ప్రధాన గ్రహాల మార్పులు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకురాబోతున్నాయి. మరి అదృష్ట రాశులు ఎవరో, వీరిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.

ప్రధాన గ్రహాల సంచారంలో మార్పులు.. ఈ రాశుల వారికి శుభ ఫలితాలు

1.సింహ రాశి

సింహ రాశి వారికి జూలై నెల అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి. నిలిచిపోయిన పనులను వేగంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి కలుగుతుంది. జీతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కష్ట సమయంలో స్నేహితుల సహకారం ఉంటుంది. సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తాయి. మీ పనికి తగిన ప్రశంసలు దక్కుతాయి.

2.తులా రాశి

తులా రాశి వారికి ఈ నెల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారు విజయాలను పొందుతారు. సాధనలతో నిండి ఉంటుంది. కెరీర్‌లో మంచి అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరంగా లాభాలు కనబడతాయి. ఉద్యోగ రంగంలో పెద్ద విజయాన్ని అందుకుంటారు. వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయి. విద్యార్థులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి విజయాలు లభిస్తాయి.

3.మకర రాశి

మకర రాశి వారికి ఇది శుభ సమయం. కష్టపడి పని చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆగిపోయిన పనులను మళ్లీ ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. పెద్ద ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

4.మీన రాశి

మీన రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. జూలై నెలలో మీకు బాగా కలిసి వస్తుంది. నిరుద్యోగులు కొత్త ఉద్యోగ అవకాశాలను పొందుతారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం చూస్తారు. చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇతరులకు ఇచ్చిన అప్పు తిరిగి పొందుతారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More