సింహ రాశి వార ఫలం : ఈ వారం మీ జాతకం ఎలా ఉంది..? ఆర్థికం, ప్రేమ, ఆరోగ్య విషయాల్లో కీలక సూచనలు ఇవే!

ఈ వారం సింహ రాశి వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. తొందరపాటు నిర్ణయాలు నష్టాన్ని చేకూరుస్తాయి. ఆర్థిక లావాదేవీలు, కొత్త పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. 

Published on: Jun 21, 2026, 09:56:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వారం ప్రారంభంలో మీలో ధైర్యం, పనిలో వేగం స్పష్టంగా కనిపిస్తాయి. గత కొంతకాలంగా వాయిదా వేసిన పనులను పూర్తి చేయడానికి మీరు నడుం బిగిస్తారు. కఠినమైన సంభాషణలు జరపడం, చిన్నపాటి ప్రయాణాలు చేయడం, నిలిచిపోయిన పనులను ఫాలో-అప్ చేసుకోవడం వంటి ప్రాక్టికల్ పనుల్లో ఈ వారం పురోగతి లభిస్తుంది.

సింహ రాశి వారఫలాలు
సింహ రాశి వారఫలాలు

ధైర్యంగా అడుగులు వేయడం మంచిదే అయినప్పటికీ, దానిని తొందరపాటుగా మార్చుకోకుండా చూసుకోవడం ముఖ్యం. మీ మాటతీరు ఈ వారం ఇంట్లో గట్టి ప్రభావం చూపుతుంది, కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు స్వరాన్ని కాస్త మృదువుగా ఉంచుకోవడం మంచిది. కొత్త వాహనం కొనాలన్నా లేదా ఏదైనా పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేయాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

వారం మధ్యలో మీ పనితీరుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఏ పనిలోనూ షార్ట్‌కట్‌లు వెతకవద్దు, అవి అస్సలు వర్కవుట్ కావు. శ్రమకు తగ్గ ఫలితాలు వెంటనే కనిపించకపోయినా, నిరాశ చెందకుండా మీ పనిని మీరు కొనసాగించడం అవసరం. తోబుట్టువులు లేదా బంధువుల నుంచి మీకు ఊహించని మద్దతు లభిస్తుంది. వారు ఇచ్చే సలహాలు మీ మనోధైర్యాన్ని రెట్టింపు చేస్తాయి. వారాంతానికి వాతావరణం తేలికపడుతుంది. కొత్త వ్యక్తులను కలవడం, పొరుగువారితో సాన్నిహిత్యం పెరగడం లేదా పాత స్నేహితులతో గడపడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది.

ప్రేమ, దాంపత్య జీవితం:

సింహ రాశి వారి ప్రేమ జీవితం ఈ వారం ప్రారంభంలో కొద్దిగా సున్నితంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో లేదా లాంగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారితో చిన్న చిన్న విషయాలకే విభేదాలు వచ్చే ప్రమాదం ఉంది. ఇద్దరూ తమ పంతాలకే పోతే చిన్న సమస్య కాస్తా పెద్ద వివాదంగా మారుతుంది. అలాంటి సమయాల్లో రెండు రోజుల పాటు ఒకరిపై ఒకరు కోపంగా ఉండటం కంటే, ఒక పది నిమిషాల పాటు మౌనంగా ఉండటం ఎంతో మేలు చేస్తుంది. ఇక ఒంటరిగా ఉన్నవారు తమకు ప్రేమ దొరకడం లేదని నిరాశ చెందాల్సిన పనిలేదు….. వారం మధ్య నాటికి పరిస్థితులు అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య వాతావరణం మళ్లీ చక్కబడుతుంది.

ఈ వారం మీ భాగస్వామికి మీరు చేసే ప్రాక్టికల్ పనుల ద్వారానే మీ ప్రేమ వ్యక్తమవుతుంది. వారు మీ పనుల్లో చేదోడు వాదోడుగా నిలవడం, మీ బాధలను ప్రశాంతంగా వినడం వంటివి మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి. పిల్లలకు సంబంధించిన ఏదైనా శుభవార్త లేదా వారి ప్రయత్నాలు మీకు ఎనలేని గర్వాన్ని ఇస్తాయి.

కొత్తగా ప్రేమలో పడిన వారికి ఈ వారం సంభాషణలు చాలా సహజంగా, హాయిగా సాగుతాయి. శుక్ర, శనివారాల్లో మీ సామాజిక బంధాలు మెరుగవుతాయి. కుటుంబ వేడుకలు లేదా స్నేహితుల కలయిక వల్ల పాత జ్ఞాపకాలు పలకరించి, బంధాల్లో వెచ్చదనం పెరుగుతుంది. అయితే…. ఆఫీస్ ఒత్తిడిని ఇంటికి తీసుకురావొద్దు. వారాంతంలో మీ తల్లికి లేదా ఇంట్లోని వృద్ధ మహిళలకు సమయం కేటాయించండి… ఇది మీకు మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది.

ఉద్యోగం, కెరీర్ :

ఉద్యోగ పరంగా ఈ వారం మీరు కష్టపడాల్సి ఉంటుంది. వారం ప్రారంభంలో ఇతరులు కష్టమని భావించే సవాలుతో కూడిన పనులను మీరు చేతిలోకి తీసుకుంటారు. ఇది మీ కార్యాలయంలో మీ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఆఫీస్ పనులు, డాక్యుమెంటేషన్, లేదా క్షేత్రస్థాయి పరిశీలనల కోసం చిన్నపాటి ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. మీ శ్రమకు తక్షణ గుర్తింపు లేదా ప్రశంసలు ఆశించవద్దు. మంగళవారం నుంచి గురువారం వరకు పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల మనస్సు చంచలంగా మారే అవకాశం ఉంది. అనేక ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముట్టినా, ఈ సమయం మీ భవిష్యత్తు విజయాలకు గట్టి పునాది వేస్తుంది.

సహోద్యోగులు లేదా క్లాస్‌మేట్స్ నుంచి మీకు అవసరమైన సమాచారం, నైతిక మద్దతు లభిస్తాయి. విద్యార్థులు పరీక్షల సమయంలో చివరి నిమిషంలో హడావుడి పడకుండా, రోజువారీ చదువులపై దృష్టి పెట్టడం మంచిది. గురువారం నాడు కాస్త సోమరితనం ఆవహించినా…. బద్ధకాన్ని వదిలి పని ప్రారంభించగానే మీలో ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది. ఈ వారం కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడంలో లేదా కొత్త వ్యాపారాల్లో ఎక్కువ ఉత్సాహం చూపించకపోవడమే మంచిది. ప్రస్తుతానికి పరిస్థితులు ఇంకా పూర్తిగా అనుకూలంగా లేవు, కాబట్టి పాత పనులనే పటిష్టం చేసుకోవడం ఉత్తమం.

ఆర్థిక పరిస్థితి :

సింహ రాశి వారికి ఈ వారం కష్టపడి పనిచేయడం ద్వారానే ఆదాయం సమకూరుతుంది. వారం ప్రారంభంలో ఆర్థిక పరిస్థితి సాదాసీదాగా ఉంటుంది. పెద్దగా నష్టాలు లేకపోయినా….. విచ్చలవిడి ఖర్చులకు అవకాశం లేదు. అందువల్ల కఠినమైన ఆర్థిక క్రమశిక్షణ అవసరం. విలాస వస్తువులు, కొత్త వాహనాలు కొనాలనే ఆలోచనలను ప్రస్తుతానికి వాయిదా వేయడం ఉత్తమం.

మీ ఆలోచనలు బలంగా ఉన్నా, సమయం మాత్రం అంత అనుకూలంగా లేదు. కాబట్టి కేవలం నిత్యావసరాలకే ఖర్చు చేస్తూ, మిగిలిన డబ్బును దాచుకోండి. ఉద్యోగం, ఫ్రీలాన్స్, లేదా వ్యాపార రంగాల్లో ఉన్నవారు ప్రతి రూపాయి సంపాదించడానికి కష్టపడాల్సి వస్తుంది. అయితే దీని గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు, ప్రస్తుత మార్కెట్ పరిస్థితి అలానే ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టడం, రిస్క్‌తో కూడిన వ్యాపారాలు చేయడం, ఎవరికైనా అప్పులు ఇవ్వడం వంటి పనులకు దూరంగా ఉండండి.

ఏదైనా స్కీమ్ లేదా ప్లాన్ పై పైన చాలా ఆకర్షణీయంగా కనిపించినా, తొందరపడకుండా దాని లోతుపాతులను పరిశీలించండి. శనివారం పొదుపుకు చాలా మంచి రోజు. భవిష్యత్తు అవసరాల కోసం చిన్న మొత్తంలో దాచుకున్నా అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వారం చివరన ఆర్థికంగా ఒక స్థిరత్వానికి రావడం మీకు సంతృప్తిని ఇస్తుంది.

ఆరోగ్యం :

ఆరోగ్య విషయంలో శరీరం ఇచ్చే చిన్నపాటి సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. వారం ప్రారంభంలో అధిక వేడి, మానసిక ఒత్తిడి, సహనం కోల్పోవడం వల్ల తలనొప్పి, ఎసిడిటీ, నిద్రలేమి లేదా చిరాకు వంటి సమస్యలు తలెత్తవచ్చు. ప్రయాణాలు చేసేటప్పుడు తగినంత నీటిని వెంట ఉంచుకోవడం మరియు సమయానికి భోజనం చేయడం మరువకండి. ఏ పనిలోనూ హడావుడి పడొద్దు. వాహనాలు నడిపేటప్పుడు, ముఖ్యంగా వారాంతాల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం.

ఆహారపు అలవాట్లపై ప్రత్యేక నియంత్రణ ఉండాలి. శారీరక అలసట వల్ల రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. కేవలం కాలక్షేపం కోసం మళ్లీ మళ్లీ ఏది పడితే అది తినడం మానేయండి. సాత్విక ఆహారం, సరైన పరిమాణంలో నీరు తాగడం, తగినంత నిద్రపోవడం వల్ల ఆరోగ్యం కుదుటపడుతుంది. వారాంతంలో ఆరోగ్యం మెరుగవుతుంది.

కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. శనివారం నాడు ఇంట్లోనే ఉంటూ, ఇంటి భోజనం తింటూ విశ్రాంతి తీసుకోవడం మంచిది. అమ్మతో సమయం గడపడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తాయి. ఈ వారం పెద్ద పెద్ద ఆర్భాటాలు కాకుండా…. క్రమబద్ధమైన అలవాట్లే మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

ధైర్యంగా ముందడుగు వేయండి…. కానీ ఎక్కడా తొందరపాటు ప్రదర్శించవద్దు. ఇంట్లో మాట్లాడేటప్పుడు మీ స్వరాన్ని మృదువుగా ఉంచుకోండి మరియు ఆర్థిక వ్యవహారాల్లో స్థిరత్వాన్ని కాపాడుకోండి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More