గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలను, అశుభ యోగాలను చూస్తూ ఉంటాం. దేవగురువు బృహస్పతి జ్ఞానం, సంపద, సంతోషం, అదృష్టం మొదలైన వాటికి కారకుడు. 2026లో గురువు సంచారం చాలా ముఖ్యమైనది. గురువు ఏడాదికి ఒకసారి సంచారంలో మార్పు చేస్తాడు.

2025లో ఒక్కసారి మాత్రమే సంచారంలో మార్పు చేసిన గురువు, ఈ ఏడాది ఐదు నెలల్లో రెండు సార్లు సంచారంలో మార్పు చేయనున్నాడు. అలాగే గురువు సంచారంలో మార్పు రావడంతో గజకేసరి రాజయోగం కూడా ఏర్పడనుంది. ఈ రాజయోగం కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలను తీసుకురాబోతోంది.
ఐదు నెలల పాటు గజకేసరి రాజయోగం:
మామూలుగా చూసినట్లయితే, గురువు ఏడాదికి ఒకసారి తన సంచారంలో మార్పు చేస్తాడు. 2026లో చూసుకున్నట్లయితే, జూన్ నుంచి అక్టోబర్ దాకా రెండు సార్లు తన సంచారంలో మార్పు రాబోతోంది. జూన్ 2న గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 31న సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలోకి జూన్ నెలలో గురువు ప్రవేశించినప్పుడు గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఇది చాలా శుభప్రదమైన రాజయోగం. దీంతో నాలుగు రాశుల వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. మరి ఆ అదృష్ట రాశుల్లో మీరు ఉన్నారేమో చూసుకోండి.
గజకేసరి రాజయోగం.. నాలుగు రాశులకు అనేక లాభాలు
1.ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి గురువు గజకేసరి రాజయోగం విపరీతమైన లాభాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సక్సెస్‌ను అందుకుంటారు. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా ఇది అద్భుతమైన సమయం. విష్ణువును పూజించి, గురువారం నాడు ఉపవాసం ఉంటే ఈ రాశి వారి సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు.
2.మిథున రాశి:
మిథున రాశి వారికి గజకేసరి రాజయోగం విపరీతమైన అదృష్టాన్ని తీసుకొస్తుంది. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. ప్రమోషన్ రావచ్చు. వ్యాపారస్తులకు కూడా లాభదాయకంగా ఉంటుంది. పసుపు రంగులో ఉండే పప్పులను దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.
3.వృషభ రాశి:
{{/usCountry}}మిథున రాశి వారికి గజకేసరి రాజయోగం విపరీతమైన అదృష్టాన్ని తీసుకొస్తుంది. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. ప్రమోషన్ రావచ్చు. వ్యాపారస్తులకు కూడా లాభదాయకంగా ఉంటుంది. పసుపు రంగులో ఉండే పప్పులను దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.
3.వృషభ రాశి:
{{/usCountry}}వృషభ రాశి వారికి గురువు గజకేసరి రాజయోగం అనేక లాభాలను తీసుకు వస్తుంది. సమస్యలను తొలగిస్తుంది. కెరీర్‌లో మంచి స్థాయికి చేరుకుంటారు. ఆర్థికపరంగా బాగుంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో మంచి మార్పులను చూస్తారు. గురువారం నాడు పూజకు సంబంధించిన సామాగ్రిని గుడిలో దానం చేయడం మంచిది. అలాగే “ఓం బ్రహ్మ బృహస్పతయే నమః” మంత్రాన్ని జపిస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి.
4.కర్కాటక రాశి:
ఈ రాశి వారికి కూడా గజకేసరి రాజయోగం మంచి ఫలితాలను తీసుకురాబోతోంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ రాశి వారు కొత్త ఉద్యోగాన్ని పొందుతారు. వ్యాపారస్తులకు కూడా బాగా కలిసి వస్తుంది. గోవులకు ఆహారాన్ని సమర్పించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే గురువారం నాడు ఉపవాసం ఉంటే కూడా మంచిది.