Gajakesari Yogam: మార్చి 25న చంద్ర-గురువుల సంయోగంతో గజకేసరి రాజయోగం.. 4 రాశులకు ఊహించని లాభాలు!
మార్చి 25న ఈ రెండు గ్రహాలు మిథున రాశిలో సంయోగం చెంది మార్చి 27 వరకు ఉంటాయి. ఈ రెండు గ్రహాలు సంయోగం చెందడంతో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఇది చాలా శుభప్రదమైన యోగం. గజకేసరి యోగం జీవితంలో సానుకూల మార్పులను తీసుకొస్తుంది. పైగా కొన్ని రాశుల వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. వాటి సంచారంలో మార్పు జరిగినప్పుడు అన్ని రాశుల వారి జీవితంలో చాలా మార్పులు వస్తాయి. మార్చి 25న చంద్రుడు, గురువు ఒకే రాశిలో సంచారం చేయబోతున్నారు. ఈ రెండిటి కలయిక మార్చి 27 వరకు ఉంటుంది. ఈ రెండు గ్రహాలు మిథున రాశిలో సంయోగం చెందబోతున్నాయి. చంద్ర-గురువుల మహా సంయోగం ఈ నెలలో విపరీతమైన అదృష్టాన్ని తీసుకురాబోతోంది.

గజకేసరి యోగం
మార్చి 25న ఈ రెండు గ్రహాలు మిథున రాశిలో సంయోగం చెంది మార్చి 27 వరకు ఉంటాయి. ఈ రెండు గ్రహాలు సంయోగం చెందడంతో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఇది చాలా శుభప్రదమైన యోగం. గజకేసరి యోగం జీవితంలో సానుకూల మార్పులను తీసుకొస్తుంది.
పైగా కొన్ని రాశుల వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఆర్థికపరంగా కొన్ని రాశుల వారికి బాగుంటుంది. అలాగే కెరీర్‌లో కూడా బాగా కలిసి వస్తుంది. గౌరవం, మర్యాదలు కూడా పెరుగుతాయి. మరి గజకేసరి రాజయోగంతో ఏ రాశుల వారు భారీగా లాభాలను పొందబోతున్నారు, ఎవరు ఎలాంటి ప్రయోజనాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
మరో నాలుగు రోజుల్లో చంద్ర-గురువుల సంయోగంతో గజకేసరి రాజయోగం.. ఈ రాశుల వారికి అనేక లాభాలను అందిస్తుంది
1.మేష రాశి:
మేష రాశి వారికి గజకేసరి రాజయోగం బాగా కలిసి వస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆర్థికపరంగా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే భారీగా లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. విదేశాల్లో కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లాలనుకునే వారి కలలు నెరవేరుతాయి.
2.మిథున రాశి:
మిథున రాశి వారికి గజకేసరి రాజయోగం అనేక విధాలుగా లాభాలను తీసుకొస్తుంది. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. ప్రమోషన్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. సంతోషం కూడా పెరుగుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభిస్తే కూడా బాగా కలిసి వస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలను చూస్తారు. కొత్త ఇల్లు లేదా ప్రాపర్టీలను కొనుగోలు చేసే అవకాశముంది.
3.సింహ రాశి:
సింహ రాశి వారికి ఈ రెండు గ్రహాల కలయిక వలన ఏర్పడే ఈ యోగం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సక్సెస్‌ను అందుకుంటారు. ఆర్థికపరంగా బాగుంటుంది. మీ పనికి తగ్గ ప్రశంసలు పొందుతారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. కొత్త ప్రాజెక్టులు మీ చేతికి వస్తాయి. ఎప్పటినుంచో పూర్తి కాని పనులను ఈ సమయంలో పూర్తి చేస్తారు. ఖర్చులు కూడా తగ్గుతాయి.
4.ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారికి గజకేసరి రాజయోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సక్సెస్‌ను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు మీ చేతికి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాభాలు వస్తాయి. కొత్త వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


