Jupiter Transit 2026: గురువు హంస మహాపురుష రాజయోగం ఈ 4 రాశుల అదృష్టాన్ని తెరుస్తుంది.. డబ్బు, ఆనందంతో పాటు అనేక లాభాలు!
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. 2026లో గురుగ్రహ సంచారం కారణంగా హంస మహాపురుష రాజయోగం కూడా ఏర్పడనుంది. ఈ హంస మహాపురుష రాజయోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి విశేష ఫలితాలు లభించనున్నాయి. ఏ రాశుల వారిపై దీని ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితాల్లో కూడా చాలా మార్పులను తీసుకు వస్తుంది. 2026లో కొన్ని ప్రధాన గ్రహాల సంచారాల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. దీంతో అన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది. 2026లో గురుగ్రహ సంచారం కారణంగా హంస మహాపురుష రాజయోగం కూడా ఏర్పడనుంది. ఈ హంస మహాపురుష రాజయోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి విశేష ఫలితాలు లభించనున్నాయి. ఏ రాశుల వారిపై దీని ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కర్కాటక రాశిలో గురు సంచారం.. ఈ రాశులకు గోల్డెన్ డేస్
గురు గ్రహం జ్ఞానం, అదృష్టం మొదలైన వాటికి కారకుడు. గురు సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. జూన్ 2న గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడుతుంది. ఈ హంస మహాపురుష రాజయోగం కొన్ని రాశుల వారికి డబ్బు, పేరు, ప్రతిష్టలు, గౌరవం వంటి శుభ ఫలితాలను తీసుకొస్తుంది. మరి హంస మహాపురుష రాజయోగం ఏ రాశుల వారికి బాగా కలిసి వస్తుందో చూద్దాం.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి హంస మహాపురుష రాజయోగం బాగా కలిసి వచ్చేలా చేస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. కర్కాటక రాశి వారు తమ జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు. కెరీర్‌లో మంచి మార్పులు వస్తాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జీతం పెరుగుతుంది. బాధ్యతలు కూడా పెరుగుతాయి. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది.
కన్య రాశి
కన్య రాశి వారికి హంస మహాపురుష రాజయోగం బాగా కలిసి వస్తుంది. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబంలో ఉన్న టెన్షన్లు తొలగిపోతాయి. సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. ఆనందంగా వుంటారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ హంస మహాపురుష రాజయోగం అనేక విధాలుగా లాభాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సక్సెస్‌ను అడుగుతుంటారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తవుతాయి. పెద్ద ఇన్వెస్ట్‌మెంట్లు చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.
మీన రాశి
మీన రాశి వారికి హంస మహాపురుష రాజయోగం శుభ ఫలితాలను తీసుకొస్తుంది. సానుకూల మార్పులను తెస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారస్తులకు ఇది శుభ సమయం. ఉద్యోగస్తులు ప్రమోషన్లను పొందుతారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి తొలగిపోతుంది. మొత్తం మీద సంతోషంగా ఉండొచ్చు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


