రేపు గురు, శుక్రుల నుంచి ఈ నాలుగు రాశులకు కాసుల వర్షం, విపరీతమైన ఆనందం, అదృష్టంతో పాటు మరెన్నో లాభాలు!

గురువు జ్ఞానం, అదృష్టం మొదలైన వాటికి కారకుడు. శుక్రుడు సంతోషం, విలాసాలు, డబ్బు, ప్రేమ వంటి వాటికి కారకుడు. ఈ రెండిటి సంయోగం ప్రతియుతి దృష్టి యోగాన్ని ఏర్పరచబోతోంది. శుక్రుడు, గురువు 120 డిగ్రీల వద్ద ఉండడంతో ఈ యోగం ఏర్పడబోతోంది. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది.

Published on: Jan 8, 2026, 14:00:52 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. కొన్నిసార్లు గ్రహాల సంచారంలో మార్పు కారణంగా శుభయోగాలు ఏర్పడితే, కొన్నిసార్లు అశుభయోగాలు ఏర్పడతాయి.

రేపు గురు, శుక్రుల నుంచి ఈ నాలుగు రాశులకు కాసుల వర్షం (pinterest)
రేపు గురు, శుక్రుల నుంచి ఈ నాలుగు రాశులకు కాసుల వర్షం (pinterest)

గురు, శుక్రుల శక్తివంతమైన యోగం

జనవరి 9, అంటే రేపు రాత్రి 11:02కి ఈ యోగం ఏర్పడనుంది. గురువు జ్ఞానం, అదృష్టం మొదలైన వాటికి కారకుడు. శుక్రుడు సంతోషం, విలాసాలు, డబ్బు, ప్రేమ వంటి వాటికి కారకుడు. ఈ రెండిటి సంయోగం ప్రతియుతి దృష్టి యోగాన్ని ఏర్పరచబోతోంది. శుక్రుడు, గురువు 120 డిగ్రీల వద్ద ఉండడంతో ఈ యోగం ఏర్పడబోతోంది. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది. దీంతో ఒక్కసారిగా ఈ రాశుల వారు అనేక లాభాలను పొందుతారు. మరి ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

గురువు, శుక్రుడు ఈ రాశుల వారికి కాసుల వర్షాన్ని కురిపించబోతున్నారు.. విపరీతమైన ఆనందం, అదృష్టం కలగబోతోంది

1.వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రెండిటి కారణంగా ఏర్పడే యోగం శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆనందం ఎక్కువ అవుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పని ప్రదేశంలో సక్సెస్‌ను చూస్తారు. మతపరమైన కార్యక్రమాల్లో ఆసక్తిగా పాల్గొంటారు. సంతోషం, ప్రశాంతత ఎక్కువ అవుతాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అదృష్టం తలుపు తడుతుంది. ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది.

2.కర్కాటక రాశి

ఈ రాశి వారికి ఈ దృష్టి యోగం కారణంగా శుభ ఫలితాలు ఎదురవుతాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. వ్యాపారంలో ఎక్కువ లాభాలు ఉంటాయి. సానుకూల మార్పులను చూస్తారు. కెరియర్లో సక్సెస్ అందుకుంటారు. పెండింగ్‌లో ఉన్న టాస్కులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కెరియర్లో మంచి సక్సెస్‌ను చూస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత దృఢంగా మారుతుంది.

3.ధనస్సు రాశి

ధనస్సు రాశి వారికి ఈ గ్రహాల సంయోగం కారణంగా ఏర్పడే యోగం సానుకూల మార్పులను తీసుకువస్తుంది. కెరియర్లో మంచి మార్పులను చూస్తారు. సాలరీ పెరుగుతుంది. కొత్త వ్యాపారాలను మొదలు పెడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి దూరం అవుతుంది. సమాజంలో గౌరవం, మర్యాదలు లభిస్తాయి. అదృష్టం మీ వెంట ఉంటుంది.

4.మకర రాశి

మకర రాశి వారికి గురు, శుక్రుల కారణంగా ఏర్పడే యోగం మంచి ఫలితాలను తీసుకొస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కెరీర్లో మంచి మార్పులను చూస్తారు. వ్యాపారస్తులకు అదిరిపోయే లాభాలు కలుగుతాయి. ప్రేమ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More