...
...
Next Story

గురువు సంచారం 2026: గురువు సంచారంతో 6 రాశుల అదృష్టం ప్రకాశిస్తుంది, అనేక మార్గాల ద్వారా డబ్బు చేతికి వస్తుంది!

గురువు కాలానుగుణంగా తన రాశిని మారుస్తూ ఉంటాడు. అలాగే గురువు నక్షత్రాన్ని కూడా కాలానుగుణంగా మార్చడం జరుగుతుంది. జనవరి 2026లో గురువు పునర్వసు నక్షత్రం రెండవ పాదంలోకి అడుగు పెడతాడు. కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది. గురువు నక్షత్ర సంచారంతో ఎలాంటి మార్పులు వస్తాయి?

Published on: Dec 21, 2025, 13:30:14 IST
Advertisement

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకువస్తుంది. గురువు కూడా కాలానుగుణంగా తన రాశిని మారుస్తూ ఉంటాడు. అలాగే గురువు నక్షత్రాన్ని కూడా కాలానుగుణంగా మార్చడం జరుగుతుంది.

గురువు సంచారంలో మార్పు.. ఈ రాశులకు అనేక లాభాలు (pinterest)
గురువు సంచారంలో మార్పు.. ఈ రాశులకు అనేక లాభాలు (pinterest)

జనవరి 2026లో గురువు పునర్వసు నక్షత్రం రెండవ పాదంలోకి అడుగు పెడతాడు. దీంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. అదృష్టం కూడా కలిసి వస్తుంది. గురువు నక్షత్ర సంచారంతో ఎలాంటి మార్పులు వస్తాయి? ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయి? ఇప్పుడు తెలుసుకుందాం.

గురువు నక్షత్ర సంచారం

గురువు జనవరి 4న సాయంత్రం 5:49కి పునర్వసు నక్షత్రంలోకి అడుగు పెడతాడు. దీంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయి. అదృష్టం కూడా ఎక్కువవుతుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు అనేక లాభాలను పొందడానికి వీలవుతుంది.

గురువు సంచారంలో మార్పు.. ఈ రాశులకు అనేక లాభాలు

గురువు నక్షత్ర సంచారం జరిగినప్పుడు కొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. అదృష్టం పెరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ప్రమోషన్లు కూడా రావచ్చు. ఆర్థిక స్థితిలో కూడా అనేక మార్పులను చూస్తారు.

గురువు నక్షత్ర సంచారంలో మార్పుతో, ఈ రాశుల వారికి బోలెడు లాభాలు

1.కన్యా రాశి

కన్యా రాశి వారికి గురువు సంచారంలో మార్పు శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటారు. అదృష్టం ఎక్కువవుతుంది. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. పాత ప్లాన్లు ఈ సమయంలో ఫలిస్తాయి. ఇలా అన్ని విధాలుగా ఈ రాశి వారికి లాభాలు కలుగుతాయి.

2.తులా రాశి

ధనస్సు రాశి వారికి గురువు నక్షత్ర సంచారం అనేక లాభాలను తీసుకొస్తుంది. ప్రేమ పెరుగుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. సక్సెస్‌ను అందుకుంటారు. వ్యాపారంలో కూడా అనేక లాభాలు వస్తాయి. రిలేషన్‌షిప్‌లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి.

4.కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ సంచారం అనేక లాభాలను తీసుకు వస్తుంది. ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. తెలివితేటలు, క్రియేటివిటీ పెరుగుతాయి. పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు జరుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలను వింటారు. పాత ఇన్వెస్ట్మెంట్ల నుంచి ఎక్కువ లాభాలను పొందడానికి కూడా వీలవుతుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe