Amavasya: రేపు 2025 చివరి అమావాస్య తర్వాత ఈ 5 రాశుల వారి జీవితం మారిపోతుంది.. డబ్బు, శుభవార్తలతో పాటు ఎన్నో!

Amavasya: రేపే ఈ 2025లో వచ్చే చివరి అమావాస్య. డిసెంబర్ 19, 2025న రానుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది. ఈ అమావాస్య తర్వాత కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. మరి రేపు అమావాస్య తర్వాత ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది? ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

Published on: Dec 18, 2025, 10:00:55 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Amavasya: 2025 ముగింపు దశకి వచ్చేసింది. మరి కొన్ని రోజుల్లో 2025 పూర్తి కానుంది. ఇక ఇది ఇలా ఉంటే, రేపే ఈ 2025లో వచ్చే చివరి అమావాస్య. డిసెంబర్ 19, 2025న రానుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది. ఈ అమావాస్య తర్వాత కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. గ్రహాలు కాలనుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు అది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది.

Amavasya: రేపు 2025 చివరి అమావాస్య తర్వాత ఈ 5 రాశుల వారి జీవితం మారిపోతుంది (pinterest)
Amavasya: రేపు 2025 చివరి అమావాస్య తర్వాత ఈ 5 రాశుల వారి జీవితం మారిపోతుంది (pinterest)

చివరి అమావాస్య తర్వాత ఈ ఐదు రాశుల వారి జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. ఆనందం, శ్రేయస్సు కూడా కలుగుతాయి. మరి రేపు అమావాస్య తర్వాత ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

రేపు చివరి అమావాస్య తర్వాత ఈ రాశుల వారి జీవితం మారిపోతుంది.. జీవితంలో అద్భుతం చోటు చేసుకోనుంది

1.సింహ రాశి

సింహ రాశి వారికి అమావాస్య బాగా మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. ఈ అమావాస్య తర్వాత ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. జీవితంలో అద్భుతాలు జరుగుతాయని నమ్మకం కలుగుతుంది. చేదు జ్ఞాపకాలు, ఎదురు దెబ్బలు తొలగిపోతాయి. పనికి తగ్గ గుర్తింపు, సమాజంలో గౌరవం, జీవితంలో ఆనందం ఉంటాయి.

2.వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ అమావాస్య తర్వాత బాగా కలిసి రాబోతోంది. ఊహించని బహుమతులను పొందుతారు. దీనికోసం శ్రమించిన పనిలో విజయం సాధిస్తారు. ఆనందంగా ఉంటారు. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. సంతోషకరమైన జీవితం ఉంటుంది.

3.ధనస్సు రాశి

ధనస్సు రాశి వారికి ఈ అమావాస్య తర్వాత బాగా కలిసి వస్తుంది. ఈ అమావాస్య తర్వాత ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. మానసిక పరిస్థితుల్లో కూడా మార్పును చూస్తారు. కొత్త వార్తలు మానసిక స్థితిని మారుస్తాయి. సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. మనసు తేలికపడుతుంది.

4.కుంభ రాశి

కుంభ రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. ఈ రాశి వారు ఈ సమయంలో అనేక రకాల లాభాలను పొందుతారు. రూపొందించిన ప్రణాళికల్లో మార్పులు వచ్చినా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. శుభవార్తలను కూడా అందుకుంటారు.

5.మీన రాశి

మీన రాశి వారికి అమావాస్య తర్వాత బాగా కలిసి వస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ప్రియమైన వారితో కలిసి సంతోషంగా ఉంటారు. ఈ సమయంలో కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి.

అమావాస్య నాడు ఏం చేస్తే మంచిది?

అమావాస్య నాడు దానం చేయడం వలన చక్కటి ఫలితాన్ని చూస్తారు. అమావాస్య నాడు పితృదేవతలను స్మరించుకోవాలి. అలాగే వారి పేరు చెప్పి దానధర్మాలు చేస్తే కూడా మంచి ఫలితాన్ని చూస్తారు. పేదలకు, అవసరమైన వారికి మీకు తోచినది దానం చేస్తే కూడా చక్కటి ఫలితం ఉంటుంది. అలాగే సానుకూల ఆలోచనలను పెంపొందించుకొని కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తే, మొత్తం అన్నీ కలిసి వస్తాయి. ఆనందంగా ఉండొచ్చు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More