జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభ గ్రహంగా భావించే బృహస్పతి (గురువు) త్వరలోనే తన స్థానాన్ని మార్చబోతున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత 2026 అక్టోబర్ 31వ తేదీన గురు గ్రహం సింహ రాశిలోకి ప్రవేశించనుంది. 2027 జనవరి 24 వరకు, అంటే దాదాపు 86 రోజుల పాటు బృహస్పతి ఈ రాశిలోనే సంచరిస్తాడు.

సింహ రాశికి అధిపతి సూర్యుడు. జ్యోతిష్య నిబంధనల ప్రకారం సూర్యుడు, బృహస్పతి పరస్పరం మిత్ర గ్రహాలు. స్నేహ రాశి అయిన సింహంలోకి గురుడు ప్రవేశించడం వల్ల మానవ జీవితాల్లో, ముఖ్యంగా మానసిక ఆత్మవిశ్వాసంలో, నాయకత్వ లక్షణాలలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ్ వివరిస్తున్నారు.
ఈ సంచార కాలంలో సమాజంలో గౌరవ మర్యాదలు, హోదా గణనీయంగా పెరుగుతాయి. పిల్లల పురోగతి, ఉన్నత విద్య, సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి విశేషమైన ఫలితాలు దక్కుతాయి. ఉద్యోగస్తులకు కెరీర్‌లో పదోన్నతి, ఉన్నత స్థానాలు లభిస్తాయి.
ఈ గురు సంచారం మెజారిటీ రాశుల వారికి అత్యంత శ్రేయస్సకరంగా ఉండబోతున్నప్పటికీ, కొన్ని రాశుల వారు మాత్రం ఆర్థిక, మానసిక సవాళ్లను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని పంచాంగ కర్తలు స్పష్టం చేస్తున్నారు.
- మేష రాశి : ఈ సంచార ప్రభావంతో మేష రాశి వారికి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీ ధైర్య సాహసాలకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.
- వృషభ రాశి : ఊహించని ఆర్థిక లాభాలు వెతుక్కుంటూ వస్తాయి. సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన బకాయిలు లేదా రావాల్సిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది.
- మిథున రాశి : కార్యసిద్ధి లభిస్తుంది. నిలిచిపోయిన పనులు ఊపందుకుంటాయి. మీరు చేపట్టే ప్రతి పనిలోనూ శౌర్యం, విజయం మీ సొంతమవుతాయి.
- కర్కాటక రాశి : సామాజిక హోదా పెరుగుతుంది. ఆఫీసులో లేదా వృత్తిపరమైన క్షేత్రంలో మీ ఇమేజ్ మరింత బలపడుతుంది.
- సింహ రాశి : స్వరాశిలోకి గురువు రావడం వల్ల మీ వ్యక్తిత్వం ఎంతగానో వికసిస్తుంది. ఉపాధి, వ్యాపార రంగాల్లో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు.
- కన్యా రాశి : నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. పాత పెట్టుబడుల నుంచి కూడా మంచి రాబడి లభించి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
- తులా రాశి : ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే వ్యాపారంలో భారీ లాభాలు గడిస్తారు.
- వృశ్చిక రాశి : గత కొంతకాలంగా వేధిస్తున్న మానసిక ఆందోళనలు, భావోద్వేగ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రశాంతతతో పాటు ఆర్థిక స్థితి బలపడుతుంది.
- ధనుస్సు రాశి : అదృష్టం పూర్తిగా మీవైపే ఉంటుంది. పెండింగ్ పనులన్నీ చకచకా పూర్తవుతాయి. కుటుంబంలో ఆనందం, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
- మకర రాశి : కెరీర్‌లో అద్భుతమైన పురోగతి ఉంటుంది. పిల్లల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించి మనస్సు సంతోషంగా ఉంటుంది.
ఈ 2 రాశుల వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి….
- కుంభ రాశి : బృహస్పతి సంచారం వల్ల సంతానానికి సంబంధించిన చింతలు తొలగిపోయినప్పటికీ, కొన్ని రకాల సవాళ్లు ఎదురవుతాయి. ఆశించిన విజయం సాధించడానికి కఠినంగా శ్రమించాల్సి ఉంటుంది. రాబడిని మించి ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున ఆర్థికంగా నష్టపోకుండా చూసుకోవాలి. సుదూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం శ్రేయస్కరం.
- మీన రాశి: ఈ సమయంలో మీ జ్ఞాన తృష్ణ పెరిగినప్పటికీ, ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తవచ్చు. అనవసర ఖర్చుల వల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి కాబట్టి తొందరపడి ఎలాంటి నిర్ణయాలూ తీసుకోకూడదు.