గత కొంతకాలంగా పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి శుభకార్యాల కోసం ఎదురుచూస్తున్న వారికి అప్డేట్. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న జ్యేష్ట అధిక మాసం జూన్ 15వ తేదీతో ముగియనుంది. జూన్ 16 నుండి నిజ జ్యేష్ట మాసం (శుద్ధ మాసం) ప్రారంభం కానుండటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మళ్లీ శుభముహూర్తాల జాతర మొదలుకానుంది.

అధిక మాసం కారణంగా గత నెల రోజులుగా నిలిచిపోయిన శుభకార్యాల సందడి, జూన్ మూడో వారం నుండి తెలుగు రాష్ట్రాల ఇళ్లలో మళ్లీ ప్రారంభం కాబోతోంది. శాస్త్రాల ప్రకారం అధిక మాసాన్ని శూన్య మాసం అని కూడా పిలుస్తారు. సాధారణంగా పెద్దలు శూన్యాలు అంటుంటారు. ఈ సమయంలో విశ్వంలో శుభ శక్తుల ప్రభావం తక్కువగా ఉంటుందని నమ్ముతారు. అందుకే ఈ కాలంలో పెళ్లిళ్లు, శంకుస్థాపనలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వంటి శుభకార్యాలను నిషిద్ధంగా భావిస్తారు.
జూన్ 15న అధిక మాస శూన్య రోజులు ముగిసిన వెంటనే, జూన్ 16 నుండి సరికొత్త శుభ ముహూర్తాలు అందుబాటులోకి రానున్నాయి. పంచాంగ శ్రవణాల ప్రకారం జూన్ ద్వితీయార్థంలో, జూలై, ఆగస్టు నెలల్లో భారీగా వివాహ ముహూర్తాలు ఉన్నాయి.
వివాహ ముహూర్తాలు : జూన్ 18, 21, 24, 25, 29 తేదీల్లో బలమైన లగ్నాలు ఉన్నట్లు పురోహితులు చెబుతున్నారు.
గృహప్రవేశాలు : జూన్ చివరి వారంలో, జూలై మొదటి వారంలో మంచి తిథులు ఉన్నాయి.
వ్యాపార ప్రారంభాలు : జూన్ 17 బుధవారం, జూన్ 19 శుక్రవారం రోజులు నూతన పనులకు అనుకూలంగా ఉన్నాయి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
శుభముహూర్తాలు ఒకేసారి ప్రారంభం అవుతుండటంతో మార్కెట్లో డిమాండ్ విపరీతంగా పెరగనుంది. కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు ముహూర్తాలు తక్కువగా ఉన్న రోజుల్లో హాల్స్ దొరకడం కష్టం కాబట్టి ఇప్పుడే అడ్వాన్స్ చేసుకోవడం ఉత్తమం. పురోహితులు, క్యాటరింగ్ సర్వీసెస్ వారి డేట్స్ ముందే లాక్ చేసుకోండి. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైతే డిమాండ్ పెరిగి బంగారం ధరలు కూడా మారే అవకాశం ఉంటుంది.
{{/usCountry}}శుభముహూర్తాలు ఒకేసారి ప్రారంభం అవుతుండటంతో మార్కెట్లో డిమాండ్ విపరీతంగా పెరగనుంది. కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు ముహూర్తాలు తక్కువగా ఉన్న రోజుల్లో హాల్స్ దొరకడం కష్టం కాబట్టి ఇప్పుడే అడ్వాన్స్ చేసుకోవడం ఉత్తమం. పురోహితులు, క్యాటరింగ్ సర్వీసెస్ వారి డేట్స్ ముందే లాక్ చేసుకోండి. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైతే డిమాండ్ పెరిగి బంగారం ధరలు కూడా మారే అవకాశం ఉంటుంది.
{{/usCountry}}గమనిక : ప్రాంతాన్ని బట్టి, మీ పిల్లల నక్షత్ర బలాన్ని బట్టి ముహూర్తాల సమయాల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. మీ కుటుంబ పురోహితులను లేదా పంచాంగకర్తలను సంప్రదించి కచ్చితమైన లగ్న సమయాలను నిర్ణయించుకోగలరు.