...
...
Next Story

Kamada Ekadashi: కామద ఏకాదశి మార్చి 28న, 29న? ఆ రోజు ఈ తులసి పరిహారాలను పాటిస్తే కష్టాలు, పేదరికం నుంచి బయటపడచ్చు!

మార్చి 29న వచ్చే ఏకాదశిని కామద ఏకాదశిగా జరుపుకుంటాము. హిందూ క్యాలెండర్ ప్రకారం, చైత్ర మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని కామద ఏకాదశి అని అంటారు. ఈ ఏడాది కామద ఏకాదశి మార్చి 29న వచ్చింది. ఆరోజు ఏకాదశి ఉపవాసం ఉండి విష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వలన పాపాలు తొలగిపోతాయి.

Published on: Mar 23, 2026, 17:01:12 IST
Advertisement

ప్రతి నెలా రెండు ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్ల పక్షంలో, మరొకటి కృష్ణ పక్షంలో. అంటే సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. మార్చి 29న వచ్చే ఏకాదశిని కామద ఏకాదశిగా జరుపుకుంటాము. హిందూ క్యాలెండర్ ప్రకారం, చైత్ర మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని కామద ఏకాదశి అని అంటారు. ఈ ఏడాది కామద ఏకాదశి మార్చి 29న వచ్చింది. ఆరోజు ఏకాదశి ఉపవాసం ఉండి విష్ణువును భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వలన పాపాలు తొలగిపోతాయి.

Kamada Ekadashi: కామద ఏకాదశి మార్చి 28న, 29న? (pinterest)
Kamada Ekadashi: కామద ఏకాదశి మార్చి 28న, 29న? (pinterest)

కామద ఏకాదశి వ్రతం ఆచరిస్తే పండితుడిని చంపిన పాపం కూడా తొలగిపోతుందని అంటారు. కామద ఏకాదశి నాడు విష్ణువును ఆరాధించి, కొన్ని పరిహారాలను పాటిస్తే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. కామద ఏకాదశి నాడు కచ్చితంగా తులసి, విష్ణువుకు తులసి దళాలను సమర్పించండి. ఇలా చేయడం వలన ఆర్థిక నష్టాలు, ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే కచ్చితంగా ఈ ఏకాదశి నాడు వీటిని పాటించేటట్టు చూసుకోండి.

మార్చి 29న కామద ఏకాదశి.. ఈ తులసి పరిహారాలతో పేదరికం తొలగిపోతుంది

అష్టగంధం సమర్పించండి:

కామద ఏకాదశి నాడు తులసి మొక్కకు పసుపు, చందనం, అష్టగంధం సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. కష్టాలన్నీ తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులు, ఆటంకాలు తొలగిపోతాయి. సానుకూల ఫలితాలను చూడవచ్చు.

దీపారాధన:

కామద ఏకాదశి నాడు తులసి మొక్క ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి. సాయంత్రం ప్రదోషకాలంలో ఈ దీపాన్ని వెలిగిస్తే మరింత మంచిది. ఆ తర్వాత “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాన్ని పఠించండి. ఇది శుభ ఫలితాలను అందిస్తుంది, పేదరికాన్ని తొలగిస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది.

ప్రదక్షిణలు చేయండి:

శాలిగ్రామాలు ఇంట్లో ఉన్నట్లయితే వాటికి తులసి ఆకులను సమర్పించండి. అయితే తులసి ఆకులను ఏకాదశి నాడు తెంపకూడదు. ముందు రోజే వాటిని తెచ్చి పెట్టుకోండి.

నీటిని సమర్పించండి:

కామద ఏకాదశి నాడు స్నానం చేసిన తర్వాత ఒక రాగి పాత్రలో నీళ్లు వేసి, కొద్దిగా పచ్చి పాలు, గంగాజలాన్ని కూడా వేసి ఆ మిశ్రమాన్ని తులసి మొక్కకు సమర్పించండి. మూడుసార్లు ఇలా సమర్పించినట్లయితే జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగి పోతాయి. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe