ఈరోజే శక్తివంతమైన పాపమోచని ఏకాదశి.. ప్రాముఖ్యత, పూజా విధానంతో పాటు పఠించాల్సిన మంత్రాలు తెలుసుకోండి!
పాపమోచని ఏకాదశి నాడు కొన్ని పద్ధతులు పాటించి, పరిహారాలను ఆచరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఏకాదశి విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఫాల్గుణ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని పాపమోచని ఏకాదశిగా జరుపుకుంటాము. ఈరోజు ఉపవాసం ఉండి విష్ణువును భక్తి, శ్రద్ధలతో ఆరాధిస్తే సుఖ సంతోషాలు కలుగుతాయి.
పాపాలను తొలగించే పాపమోచని ఏకాదశి చాలా విశేషమైనది. ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఈ ఏకాదశికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది. పాపమోచని ఏకాదశి నాడు కొన్ని పద్ధతులు పాటించి, పరిహారాలను ఆచరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఏకాదశి విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఫాల్గుణ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని పాపమోచని ఏకాదశిగా జరుపుకుంటాము. ఈరోజు ఉపవాసం ఉండి విష్ణువును భక్తి, శ్రద్ధలతో ఆరాధిస్తే సుఖ సంతోషాలు కలుగుతాయి.

పాపమోచని ఏకాదశి 2026
పాపమోచని ఏకాదశి నాడు షోడశోపచారాలతో విష్ణువును ఆరాధించి, బ్రాహ్మణులకు భోజనం పెట్టి, సోదరులతో పాటు భోజనం చేస్తే చాలా మంచిదని చెబుతారు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సకల పాపాలు కూడా తొలగిపోతాయి.
పాపమోచని ఏకాదశి ప్రాముఖ్యత
పాపమోచని ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. అనేక రకాల రోగాల బాధల నుంచి కూడా సులువుగా బయట పడేందుకు వీలవుతుంది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సంతాన సమస్యలు కూడా ఉండవు. మానసిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆనందంగా ఉండొచ్చు.
పాపమోచని ఏకాదశి పూజా విధానం
ఈరోజు తెల్లవారుజామున నిద్రలేచి బ్రహ్మముహూర్తంలో స్నానం చేయాలి.
ఆ తర్వాత ఉపవాస దీక్షను ప్రారంభించాలి.
మొదట పూజ గదిని శుభ్రం చేసి, ఆ తర్వాత లక్ష్మీదేవి, విష్ణుమూర్తి విగ్రహాలను లేదా ఫోటోలను పెట్టాలి. అభిషేకం చేయాలి.
లక్ష్మీదేవికి పసుపు పువ్వులతో మాల కట్టి సమర్పించాలి.
విష్ణువుకు కచ్చితంగా తులసి ఆకులను సమర్పించేటట్టు చూసుకోండి.
అలాగే లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అనుగ్రహం కలగడానికి విష్ణు చాలీసా పారాయణం చేయండి.
పాపమోచని ఏకాదశి నాడు అన్నదానం చేస్తే ఎంతో చక్కటి ఫలితం కలుగుతుంది.
పేదలకు శక్తిమేరకు పండ్లు, ఆహారం, స్వీట్లు, వస్త్రాలు, పుస్తకాలు వంటివి దానం చేస్తే కూడా మంచి జరుగుతుంది. ఆనందం, శ్రేయస్సు కలుగుతాయి.
విష్ణువును స్మరించుకొని తులసి మొక్క దగ్గర దీపాలను వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. పాపమోచని ఏకాదశి రోజు ఉపవాసం లేని వారు అన్నం తినకుండా చూసుకోండి. ఉపవాస దీక్షలో ఉన్నవారు పాలు, పండ్లు, పండ్ల రసాలు వంటివి తీసుకోవచ్చు.
ఏకాదశి నాడు జపించాల్సిన మంత్రాలు
1. విష్ణు మంత్రం: ఓం నమో భగవతే వాసుదేవాయ
2. శ్రీ విష్ణు గాయత్రీ మంత్రం: ఓం నారాయణాయ విద్మహే, వాసుదేవాయ ధీమహి, తన్నో విష్ణుః ప్రచోదయాత్
3. విష్ణు బీజ మంత్రం: ఓం నమో నారాయణాయ నమః
4. శ్రీమన్నారాయణ మంత్రం: ఓం శ్రీమన్నారాయణాయ నమః
5. హరే కృష్ణ మహా మంత్రం:
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే
ఈ మంత్రాలను 11, 21 లేదా 108 సార్లు జపిస్తే మంచిది. అలా చేస్తే మనసుకు ప్రశాంతత కలుగుతుంది. కుటుంబంలో శాంతి కూడా ఉంటుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper












