కామిక ఏకాదశి 2026: వ్రతం ఎప్పుడు? చేయాల్సినవి, చేయకూడనివి తెలుసుకోండి!

కామిక ఏకాదశి హిందూ సంప్రదాయంలో శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఏకాదశుల్లో ఒకటి. 2026లో ఈ ఏకాదశి ఆగస్టు 9, ఆదివారం ఉదయ తిథి ప్రకారం ఆచరించబడుతుంది. ఈ రోజున శ్రీమహావిష్ణువును శాస్త్రోక్తంగా పూజించి ఉపవాసం, నామజపం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం విశేష పుణ్యఫలితాలను ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

Published on: Aug 7, 2026, 12:31:00 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్లపక్షంలో, మరొకటి కృష్ణపక్షంలో. ఇలా సంవత్సరానికి 24 ఏకాదశులను మనం జరుపుకుంటాము. అయితే త్వరలోనే కామిక ఏకాదశి రాబోతోంది. కామిక ఏకాదశి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయంతో పాటు చేయాల్సినవి, చేయకూడనివి కూడా తెలుసుకుందాం.

కామిక ఏకాదశి 2026: వ్రతం ఎప్పుడు? చేయాల్సినవి, చేయకూడనివి తెలుసుకోండి! (pinterest)
కామిక ఏకాదశి 2026: వ్రతం ఎప్పుడు? చేయాల్సినవి, చేయకూడనివి తెలుసుకోండి! (pinterest)

కామిక ఏకాదశి 2026

కామిక ఏకాదశి నాడు విష్ణువును ఆరాధించడం వలన విష్ణువు అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. పంచాంగం ప్రకారం ఏకాదశి ఆగస్టు 8న మధ్యాహ్నం 1:59 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 9న ఉదయం 11:04 గంటల వరకు ఉంటుంది. ఉదయ తిథి ప్రకారం కామికా ఏకాదశిని జరుపుకోవాలి. కాబట్టి ఆగస్టు 9, ఆదివారం నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. సోమవారం ఉదయం 5:50 నుంచి 8:00 గంటల మధ్య వ్రతాన్ని విరమించాలి.

ఏకాదశి రోజు ఏం చేస్తే మంచిది?

ఏకాదశి నాడు శాస్త్రోక్త విధానంలో విష్ణువును పూజించాలి. ఉపవాసాన్ని ఆచరించాలి. వీలైనంత ఎక్కువగా శ్రీహరిని స్మరించుకోవాలి. శ్రీహరి నామజపం చేయడం వలన అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు.

అలాగే విష్ణు మంత్రాలను కూడా జపించండి. తులసీదేవిని కూడా భక్తిశ్రద్ధలతో పూజిస్తే విశేషమైన ఫలితాలను పొందవచ్చు. దీపాన్ని వెలిగించి, ప్రదక్షిణాలు చేసి, మంత్రాలు చదువుకుని, చివరిగా హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించండి.

ఏకాదశి నాడు చేయకూడని పనులు

ఏకాదశి నాడు తల రుద్దుకోకూడదు. కేవలం తలస్నానం మాత్రమే చేయాలి. ఏకాదశి నాడు ఇంటిని కడుక్కోవడం, బట్టలు ఉతకడం వంటి పనులు చేయకూడదు. అలాగే తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు.

ఎందుకంటే ఆ రోజు తులసి కూడా విష్ణువు కోసం ఉపవాసం ఉంటుందని నమ్మకం. తులసి ఆకులను కోయడం కూడా మంచిది కాదు. మొక్కను తాకడం కూడా మంచిది కాదు. అయితే ఆవు నెయ్యితో దీపం వెలిగించి పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు.

ఏకాదశి వ్రత కథ, మంత్రజపం ప్రాముఖ్యత

విష్ణు పురాణం ప్రకారం చూసినట్లయితే, ఏకాదశి నాడు "ఓం నమో భగవతే వాసుదేవాయ" లేదా "హరే కృష్ణ మహా మంత్రాన్ని 108 సార్లు జపించండి. అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఏకాదశి వ్రత కథను వినడం లేదా చదవడం చాలా అవసరం. లేకపోతే పూజ సంపూర్ణం కాదు. వ్రత కథ చదువుకుని పూజ చేయడం వలన పూర్తి ఫలితం కలుగుతుంది. విష్ణు అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More