...
...
Next Story

ఈరోజు నుంచి కార్తీక మాసం మొదలు.. శివ కేశవుల అనుగ్రహం కలగాలంటే ఈ నెల రోజులు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకోండి!

కార్తీక మాసం ఈరోజు నుంచి మొదలవుతుంది, నెల పొడవునా ఈ విధంగా పాటించినట్లయితే సంతోషంగా ఉండొచ్చు. కార్తీక మాసంలో ఉదయాన్నే పవిత్ర స్నానం చేయాలి. శివుడుని ధ్యానించాలి. శివకేశవుల అనుగ్రహం కలిగి కష్టాలన్నీ తీరిపోతాయి. కార్తీక మాసంలో శివ కేశవుల అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసుకుందాం.

Published on: Oct 22, 2025, 08:00:16 IST
Advertisement

కార్తీక మాసంలో పరమేశ్వరుడిని ఆరాధించడం వలన పరమేశ్వరుని ప్రత్యేక అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. కార్తీక మాసంలో కొన్ని పనులు చేయడం వలన శివకేశవుల ఆశీస్సులు కలుగుతాయి. కార్తీక మాసం ఈరోజు నుంచి మొదలవుతుంది, కనుక నెల పొడవునా ఈ విధంగా పాటించినట్లయితే సంతోషంగా ఉండొచ్చు. శివకేశవుల అనుగ్రహం కలిగి కష్టాలన్నీ తీరిపోతాయి.

కార్తీక మాసంలో శివ కేశవుల అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి?

1.ఉపవాసం, దానం:

కార్తీక మాసంలో శివ కేశవుల అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి? (pinterest)
కార్తీక మాసంలో శివ కేశవుల అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి? (pinterest)

కార్తీక మాసంలో ఉపవాసం ఉంటే చాలా మంచి జరుగుతుంది. మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి వంటి వాటికి దూరంగా ఉండాలి. కార్తీకమాసంలో ఆహారం, దుస్తులు వంటివి దానం చేయడం వలన మంచి జరుగుతుంది.

2.స్నానం, ధ్యానం:

కార్తీక మాసంలో ఉదయాన్నే పవిత్ర స్నానం చేయాలి. శివుడు లేదా విష్ణువుని ధ్యానించాలి. ఇలా చేయడం వలన వారి ఆశీస్సులు కలుగుతాయి.

3.దీపం వెలిగించాలి:

ప్రతిరోజు సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం అయిన తర్వాత దీపారాధన చేయాలి. ఉసిరి చెట్టు కింద దీపం చేస్తే మంచిది. అలాగే తులసి కోట దగ్గర, విష్ణు ఆలయాల్లో దీపారాధన చేయడం వలన మరింత ఫలితం కలుగుతుంది.

4.నైవేద్యాలు:

విష్ణుకి పూలు, పండ్లు, తమలపాకులు, తులసిదళాలను సమర్పిస్తే మంచిది. అలాగే శివుడికి కార్తీక మాసంలో బిల్వ పత్రాలు సమర్పించండి.

5.పూజ మందిరాన్ని శుభ్రంగా ఉంచండి:

కార్తీకమాసంలో పూజ చేసేటప్పుడు పూజ గదిని శుభ్రంగా ఉంచాలి. గంగాజలం లేదా స్వచ్ఛమైన నీటిని చల్లి శుద్ధి చేయాలి. శివుడు, విష్ణువు, లక్ష్మీదేవి విగ్రహాలను లేదా ఫోటోలను పెట్టి పూజించండి.

6.భజనలు, కీర్తనలు:

కార్తీక మాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు లక్ష్మీ కళ్యాణం చేస్తారు. ఆ రోజున తులసిని పూజిస్తే మంచి జరుగుతుంది, భయాలన్నీ తొలగిపోతాయి.

కార్తీకమాసంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి:

  • కార్తీకమాసంలో ఒకసారి మాత్రమే భోజనం తినాలి. పాలు, పండ్లు మిగిలిన సమయంలో తినొచ్చు.
  • కార్తీకమాసంలో నెల రోజులు పూజలు చేసేవారు మంచంపై నిద్రపోకూడదు. నేల మీద నిద్రపోవాలి.
  • కార్తీక మాసంలో సూర్యోదయం తర్వాత స్నానం చేయడం మంచిది కాదు. సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి.
  • కార్తీకమాసంలో మద్యం తీసుకోవడం మంచిది కాదు. కార్తీక మాసంలో నిష్టతో పూజలు చేసే వారు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి.

ఉసిరి చెట్టు కింద భోజనం ఎందుకు చేయాలి?

కార్తీకమాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే మంచిది. వనభోజనాలు చేస్తారు. ఉసిరి చెట్టును లక్ష్మీ, పరమేశ్వరుడు, విష్ణువులకు ప్రత్యేకంగా చెబుతారు. అందుకని ఆ రోజున భగవంతుని ఆశీస్సులు లభించాలని ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేస్తారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe