కార్తీక మాసంలో దీపారాధనకున్న విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కార్తీక మాసంలో శివకేశవులను ప్రత్యేకంగా పూజిస్తారు. ప్రతిరోజూ దీపారాధన చేస్తారు. తులసి మొక్క దగ్గర కూడా కార్తీక మాసం అంతా దీపారాధన చేస్తారు. చాలా మంది శివాలయాలకు వెళ్లి కూడా దీపారాధన చేస్తారు. అయితే, ప్రధాన ద్వారం దగ్గర ఈ దీపాన్ని వెలిగించడం వలన అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.

సాయంత్రం పూట ఇంటి గుమ్మం దగ్గర దీపాలు వెలిగించడం వలన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. సుఖసంతోషాలు, ఐశ్వర్యం కూడా కలుగుతాయని నమ్ముతారు. ఇంటి గుమ్మం దగ్గర దీపం ఎలా పెట్టాలి? ఏ దిశలో పెట్టాలి? ఎటువంటి ప్రమిదలను ఉపయోగించాలి? అనే వివరాలు తెలుసుకుందాం.
కార్తీక మాసంలో ఇంటి గుమ్మం దగ్గర దీపారాధన ఎలా చేయాలి?
ముందు శుభ్రంగా ఉంచండి
కార్తీక మాసంలో ప్రతిరోజూ ఇంటి ప్రధాన ద్వారం శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంటి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. సాయంత్రం దీపం వెలిగించడానికి ముందు ఒకసారి శుభ్రం చేసి, గుమ్మం ముందు ముగ్గు వేసి, పసుపు కుంకుమలతో గుమ్మాన్ని అలంకరించిన తర్వాత మాత్రమే దీపాన్ని వెలిగించాలి.
ఇరువైపులా దీపాలు
కార్తీక మాసంలో ప్రధాన ద్వారానికి ఇరువైపులా రెండు దీపాలను వెలిగించడం మంచిది. కొంతమంది ఐదు ప్రమిదలు లేదా కుటుంబ ఆచారాన్ని బట్టి ప్రమిదలను పెడుతూ ఉంటారు.
ఏ నూనెతో వెలిగించాలి?
దీపారాధనకు ఆవు నెయ్యి ఉత్తమం. నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేయొచ్చు. శుభ్రమైన మట్టి ప్రమిదలు తీసుకుని, పత్తి వత్తులు వేసి దీపారాధన చేయాలి.
సంధ్యా సమయంలో దీపారాధన
కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం సమయంలో దీపారాధన చేయడం వలన అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. సాయంత్రం సంధ్యా సమయంలో పూజగదిలో, తులసి కోట దగ్గర దీపాలను వెలిగిస్తే మంచిది. అలాగే ప్రధాన ద్వారం దగ్గర కూడా దీపాలను వెలిగించడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు.
దీపాన్ని వెలిగించేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకోండి
{{/usCountry}}కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం సమయంలో దీపారాధన చేయడం వలన అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. సాయంత్రం సంధ్యా సమయంలో పూజగదిలో, తులసి కోట దగ్గర దీపాలను వెలిగిస్తే మంచిది. అలాగే ప్రధాన ద్వారం దగ్గర కూడా దీపాలను వెలిగించడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు.
దీపాన్ని వెలిగించేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకోండి
{{/usCountry}}
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహః
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే
గుమ్మం దగ్గర పెట్టేటప్పుడు ఈ నియమాలను పాటించండి
దీపం పెట్టేటప్పుడు ఆ ప్రదేశం శుభ్రంగా ఉండాలి.
దీపాలను స్థిరంగా ఉండే ప్రమిదల్లో వెలిగించండి.
గాలికి దీపాలు ఆరిపోకుండా జాగ్రత్తలు తీసుకోండి.
దీపం వెలిగించాక నిర్లక్ష్యం చేయొద్దు.
తులసి కోట దగ్గర దీపారాధన
ప్రధాన ద్వారం దగ్గర దీపాన్ని వెలిగించడంతోపాటు తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించడం మంచిది. తులసి దేవిని లక్ష్మీదేవిగా భావిస్తాము. తులసి దగ్గర దీపాన్ని వెలిగించి ప్రదక్షిణలు చేస్తే మంచిది.
ఆకాశ దీపం
కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఈ దీపాన్ని భగవంతుడికి సమర్పించే పవిత్రమైన దీపం అని అంటారు. కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని వెలిగించడం లేదా ఆలయ ప్రాంగణంలో వెలిగించిన ఆకాశ దీపాన్ని చూసి నమస్కారం చేసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది.
కార్తీక మాసంలో ప్రతికూల శక్తి తొలగిపోవాలంటే ఏం చేయాలి? ఇలా చేస్తే ఐశ్వర్యం, సుఖ సంతోషాలు కూడా!
కార్తీక మాసంలో చాలా మంది వివిధ పద్ధతులను పాటిస్తూ ఉంటారు. కార్తీక మాసాన్ని శివకేశవులకు అంకితం చేయడం జరిగింది. కార్తీక మాసంలో భక్తిశ్రద్ధలతో పూజలు చేయాలి. అలాగే ప్రతికూలత తొలగిపోవాలంటే వీటిని పాటించండి.
ప్రతిరోజూ ఉదయం దీపారాధన
ప్రతిరోజూ ఉదయం దీపారాధన చేసి నమస్కారం చేసుకోవాలి. అలాగే తులసి దగ్గర కూడా దీపారాధన చేయాలి. అలా చేయడం వలన లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు.
శివలింగానికి అభిషేకం
కార్తీక మాసంలో శివలింగానికి అభిషేకం చేసి, శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలను సమర్పించండి. 108 సార్లు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి.
విష్ణు సహస్రనామ పారాయణం
కార్తీక మాసంలో విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే కూడా మంచిదని చెబుతారు. దీనివల్ల ప్రతికూలత తొలగిపోతుందని భక్తుల నమ్మకం.
ధూపం, దీపం
కార్తీక మాసంలో ధూపం, దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ప్రతికూలత తొలగిపోతుందని నమ్ముతారు.
అన్నదానం, సేవా కార్యక్రమాలు
కార్తీక మాసంలో అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. సేవా కార్యక్రమాలు చేయడం వలన ఐశ్వర్యం పెరుగుతుందని, సుఖసంతోషాలు కూడా ఉంటాయని విశ్వసిస్తారు.