కార్తీక మాసం అంటే మొట్టమొదట అందరికీ గుర్తొచ్చేది దీపారాధన. కార్తీక మాసంలో దీపాలను వెలిగించే సంప్రదాయం ఉంది. కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు ప్రత్యేక ఫలితాలు కలగాలంటే ఏం చేయాలి? కార్తీక మాసంలో దీపారాధన విశిష్టత ఏంటి? ఏ దీపాన్ని వెలిగించాలి? ఏ నూనెతో వెలిగించాలి? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కార్తీక మాసంలో దీపాలను వెలిగించేటప్పుడు ఇలా చేయండి.. ఆ శివయ్య అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు

ఆవు నెయ్యి దీపం
కార్తీక మాసంలో ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. నెయ్యి దీపం శుభానికి, పవిత్రతకు ప్రత్యేకం. విష్ణువు, లక్ష్మీదేవి పూజలో నెయ్యి దీపాన్ని వెలిగించడం శుభప్రదం. ఉదయం లేదా సాయంత్రం పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం మంచిది.
నువ్వుల నూనె దీపం
నువ్వుల నూనెతో కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. శివారాధనలో నువ్వుల నూనె దీపానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే శుభఫలితాలు కలుగుతాయి. శనిదేవుడిని పూజించేటప్పుడు కూడా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తారు.
తులసి దీపం
కార్తీక మాసంలో తులసి మొక్క ఎదుట దీపారాధన చేయడం మంచిది. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కార్తీక మాసంలో ప్రతిరోజూ సాయంత్రం పూట తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగిస్తే మంచిదే.
365 వత్తుల దీపం
కార్తీక మాసంలో చాలా మంది 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. ప్రతి రోజూ దీపారాధన చేసినంత పుణ్యం కలగాలంటే కార్తీక మాసంలో ఓ రోజు ఉపవాసం ఉండి 365 వత్తుల దీపాన్ని వెలిగించడం మంచిది. చాలామంది కార్తీక పౌర్ణమి లేదా ఏకాదశి నాడు 365 వత్తులు వెలిగిస్తారు.
అఖండ దీపం
అఖండ దీపం అంటే ఆగకుండా వెలుగుతూ ఉండాలి. కార్తీక మాసంలో చాలామంది ఇళ్లలో అఖండ దీపాన్ని వెలిగిస్తారు. అఖండ దీపాన్ని వెలిగించేటప్పుడు దానిలో సరిపడా నూనె లేదా నెయ్యి వేయడం, దీపం ఆరిపోకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు ఈ విషయాలను పాటించడం మంచిది
{{/usCountry}}అఖండ దీపం అంటే ఆగకుండా వెలుగుతూ ఉండాలి. కార్తీక మాసంలో చాలామంది ఇళ్లలో అఖండ దీపాన్ని వెలిగిస్తారు. అఖండ దీపాన్ని వెలిగించేటప్పుడు దానిలో సరిపడా నూనె లేదా నెయ్యి వేయడం, దీపం ఆరిపోకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు ఈ విషయాలను పాటించడం మంచిది
{{/usCountry}}ప్రతిరోజూ ఇంటిని శుభ్రం చేసుకుని దీపారాధన చేయండి.
దీపం వెలిగించేటప్పుడు పూజా స్థలం శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి.
మట్టి ప్రమిదలను ఉపయోగించి దీపారాధన చేయడం మంచిది.
దీపాన్ని వెలిగించేటప్పుడు దేవుడిని స్మరించుకుని దీపాన్ని వెలిగించండి.
నిరాకరణ: ఈ వ్యాసంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించండి.