కార్తీక మాసంలో ఈ 5 దీపాలు వెలిగిస్తున్నారా? వాటి విశిష్టత తెలిస్తే ఆశ్చర్యపోతారు!
హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో దీపారాధనకు విశేష ప్రాధాన్యత ఉంది. ఆవు నెయ్యి, నువ్వుల నూనెతో పాటు 365 వత్తుల దీపం వెలిగించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం, నియమాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
కార్తీక మాసం అంటే మొట్టమొదట అందరికీ గుర్తొచ్చేది దీపారాధన. కార్తీక మాసంలో దీపాలను వెలిగించే సంప్రదాయం ఉంది. కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు ప్రత్యేక ఫలితాలు కలగాలంటే ఏం చేయాలి? కార్తీక మాసంలో దీపారాధన విశిష్టత ఏంటి? ఏ దీపాన్ని వెలిగించాలి? ఏ నూనెతో వెలిగించాలి? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కార్తీక మాసంలో దీపాలను వెలిగించేటప్పుడు ఇలా చేయండి.. ఆ శివయ్య అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు
ఆవు నెయ్యి దీపం
కార్తీక మాసంలో ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. నెయ్యి దీపం శుభానికి, పవిత్రతకు ప్రత్యేకం. విష్ణువు, లక్ష్మీదేవి పూజలో నెయ్యి దీపాన్ని వెలిగించడం శుభప్రదం. ఉదయం లేదా సాయంత్రం పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం మంచిది.
నువ్వుల నూనె దీపం
నువ్వుల నూనెతో కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. శివారాధనలో నువ్వుల నూనె దీపానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే శుభఫలితాలు కలుగుతాయి. శనిదేవుడిని పూజించేటప్పుడు కూడా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తారు.
తులసి దీపం
కార్తీక మాసంలో తులసి మొక్క ఎదుట దీపారాధన చేయడం మంచిది. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కార్తీక మాసంలో ప్రతిరోజూ సాయంత్రం పూట తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగిస్తే మంచిదే.
365 వత్తుల దీపం
కార్తీక మాసంలో చాలా మంది 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. ప్రతి రోజూ దీపారాధన చేసినంత పుణ్యం కలగాలంటే కార్తీక మాసంలో ఓ రోజు ఉపవాసం ఉండి 365 వత్తుల దీపాన్ని వెలిగించడం మంచిది. చాలామంది కార్తీక పౌర్ణమి లేదా ఏకాదశి నాడు 365 వత్తులు వెలిగిస్తారు.
అఖండ దీపం
అఖండ దీపం అంటే ఆగకుండా వెలుగుతూ ఉండాలి. కార్తీక మాసంలో చాలామంది ఇళ్లలో అఖండ దీపాన్ని వెలిగిస్తారు. అఖండ దీపాన్ని వెలిగించేటప్పుడు దానిలో సరిపడా నూనె లేదా నెయ్యి వేయడం, దీపం ఆరిపోకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు ఈ విషయాలను పాటించడం మంచిది
ప్రతిరోజూ ఇంటిని శుభ్రం చేసుకుని దీపారాధన చేయండి.
దీపం వెలిగించేటప్పుడు పూజా స్థలం శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి.
మట్టి ప్రమిదలను ఉపయోగించి దీపారాధన చేయడం మంచిది.
దీపాన్ని వెలిగించేటప్పుడు దేవుడిని స్మరించుకుని దీపాన్ని వెలిగించండి.
నిరాకరణ: ఈ వ్యాసంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


