హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ నెలలో శివ కేశవులకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. శివకేశవులకు ప్రీతికరమైన నెలగా కార్తీక మాసాన్ని భావిస్తారు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివుడిని ఆరాధిస్తారు. తెల్లవారుజామున నిద్రలేచి పవిత్ర స్నానం చేసి, శివలింగానికి అభిషేకాలు చేస్తారు. అలాగే దీపాలను కూడా వెలిగిస్తారు.

కార్తీక మాసంలో శివుడిని భక్తితో ఆరాధించడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆధ్యాత్మిక చైతన్యం లభిస్తుంది. కార్తీక మాసంలో శివుడికి ఎంతో ఇష్టమైన ఈ ఎనిమిది పూజా ద్రవ్యాలను పూజ చేసేటప్పుడు సమర్పించడం మంచిది. అలాగే ఈ మంత్రాలన్నింటినీ కూడా పఠించండి. శివుడికి ఎంతో ఇష్టమైన ఈ ఎనిమిదింటినీ కార్తీక మాసంలో తప్పకుండా సమర్పించండి.
కార్తీక మాసంలో శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ 8 వస్తువులతో పూజ చేయండి
మారేడు దళాలు:
శివుడికి మారేడు దళాలు అంటే ఎంతో ఇష్టం. మూడు ఆకులు కలిగిన బిల్వపత్రాలను కచ్చితంగా శివుడికి సమర్పించండి. బిల్వపత్రాలను శివుడికి సమర్పిస్తే మీ కోరికలు నెరవేరుతాయి. వాటిని సమర్పించేటప్పుడు 'ఓం నమః శివాయ' అనే మంత్రాన్ని జపించండి. శివుడికి బిల్వపత్రాలను సమర్పించడం వలన ఆ శివయ్య అనుగ్రహం కలిగి, కష్టాలన్నీ తొలగిపోతాయి. అనుకున్న కోరికలను నెరవేర్చుకోవచ్చు.
పాలు:
శివుడికి పాలాభిషేకం చేయడం వలన అద్భుతమైన లాభాలు కలుగుతాయి. కార్తీక సోమవారం నాడు పాలను శివలింగానికి అభిషేకం చేయడం వలన ఆ శివయ్య కరుణాకటాక్షాలు లభిస్తాయి. పాలు పవిత్రతకు, శాంతికి ప్రతీక.
పవిత్రమైన జలం:
శివలింగానికి నీటితో కూడా అభిషేకం చేయాలి. కార్తీక మాసంలో శివలింగానికి నీటిని సమర్పించడం వలన ఆ శివయ్య అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే అభిషేకం చేసేటప్పుడు శివనామ స్మరణ చేయడం వలన ప్రశాంతత కలుగుతుంది.
తేనె:
{{/usCountry}}శివలింగానికి నీటితో కూడా అభిషేకం చేయాలి. కార్తీక మాసంలో శివలింగానికి నీటిని సమర్పించడం వలన ఆ శివయ్య అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే అభిషేకం చేసేటప్పుడు శివనామ స్మరణ చేయడం వలన ప్రశాంతత కలుగుతుంది.
తేనె:
{{/usCountry}}శివుడికి ఎంతో ఇష్టమైన తేనెను కూడా కచ్చితంగా సమర్పించండి. తేనెను సమర్పించడం వలన శివయ్య అనుగ్రహం లభిస్తుంది. తేనె మధురమైన వాక్కుకు, ప్రేమకు ప్రతీక.
పెరుగు:
శివలింగానికి పెరుగును కూడా సమర్పించండి. పంచామృతంలో పెరుగు ముఖ్యమైన పదార్థం. భక్తులు పెరుగుతో కూడా శివలింగానికి అభిషేకం చేయడం మంచిది.
నెయ్యి:
కార్తీక మాసంలో నెయ్యితో దీపాలను వెలిగించాలి. అలాగే కుదిరితే శివయ్య ఆలయానికి వెళ్లి నెయ్యి దీపాన్ని వెలిగించండి. శుభ ఫలితాలు కలుగుతాయి. శివయ్య అనుగ్రహం లభిస్తుంది.
తెల్లటి పూలు:
శివారాధనలో తెల్లటి పూలకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. తెల్లని పూలతో శివుడిని ఆరాధించడం వలన శివయ్య అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా జిల్లేడు పూలను సమర్పించేటట్లు చూసుకోండి.
విభూతి:
విభూతిని సమర్పించడం వలన శివుని అనుగ్రహం లభిస్తుంది. శివుడు నుదుటిపై విభూతి ధరించడం ఆయన వైరాగ్యానికి, జీవిత సత్యానికి ప్రతీక. శివపూజ చేసిన తర్వాత భక్తులు విభూతిని నుదుటిపై ధరిస్తారు.
కార్తీక మాసంలో ఈ శివ మంత్రాలను కూడా జపించండి
పంచాక్షరీ మంత్రం:
'ఓం నమః శివాయ' అనే మంత్రాన్ని ప్రతిరోజూ జపించండి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఈ మంత్రాన్ని జపిస్తే ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందవచ్చు.
మహామృత్యుంజయ మంత్రం:
ఈ మంత్రాన్ని జపించడం వలన ఆరోగ్యం కలుగుతుంది. ఆపదల నుంచి రక్షణ కోసం భక్తులు ఈ మంత్రాన్ని జపిస్తారు.
శివ గాయత్రీ మంత్రం:
శివుని అనుగ్రహం కోసం శివ గాయత్రీ మంత్రాన్ని కూడా జపించండి. జ్ఞానం, ఆధ్యాత్మిక చైతన్యం, సద్బుద్ధి కలుగుతాయి.
శివ ధ్యాన మంత్రం:
కర్పూరగౌరం కరుణావతారం
సంసారసారం భుజగేంద్రహారం
సదా వసంతం హృదయారవిందే
భవం భవానీ సహితం నమామి
ఈ మంత్రాన్ని జపించడం వలన శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది.