కార్తీక మాసంలో శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ 8 వస్తువులతో పూజ చేయండి, ఈ శివ మంత్రాలను జపించండి!

కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసంగా భావిస్తారు. ఈ పవిత్ర మాసంలో శివుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం, అభిషేకాలు చేయడం, దీపాలు వెలిగించడం విశేష ఫలితాలను ఇస్తాయని భక్తుల నమ్మకం.  

Published on: Nov 10, 2026, 09:30:18 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ నెలలో శివ కేశవులకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. శివకేశవులకు ప్రీతికరమైన నెలగా కార్తీక మాసాన్ని భావిస్తారు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివుడిని ఆరాధిస్తారు. తెల్లవారుజామున నిద్రలేచి పవిత్ర స్నానం చేసి, శివలింగానికి అభిషేకాలు చేస్తారు. అలాగే దీపాలను కూడా వెలిగిస్తారు.

కార్తీక మాసంలో శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ 8 వస్తువులతో పూజ చేయండి, ఈ శివ మంత్రాలను జపించండి! (AI)
కార్తీక మాసంలో శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ 8 వస్తువులతో పూజ చేయండి, ఈ శివ మంత్రాలను జపించండి! (AI)

కార్తీక మాసంలో శివుడిని భక్తితో ఆరాధించడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆధ్యాత్మిక చైతన్యం లభిస్తుంది. కార్తీక మాసంలో శివుడికి ఎంతో ఇష్టమైన ఈ ఎనిమిది పూజా ద్రవ్యాలను పూజ చేసేటప్పుడు సమర్పించడం మంచిది. అలాగే ఈ మంత్రాలన్నింటినీ కూడా పఠించండి. శివుడికి ఎంతో ఇష్టమైన ఈ ఎనిమిదింటినీ కార్తీక మాసంలో తప్పకుండా సమర్పించండి.

కార్తీక మాసంలో శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ 8 వస్తువులతో పూజ చేయండి

మారేడు దళాలు:

శివుడికి మారేడు దళాలు అంటే ఎంతో ఇష్టం. మూడు ఆకులు కలిగిన బిల్వపత్రాలను కచ్చితంగా శివుడికి సమర్పించండి. బిల్వపత్రాలను శివుడికి సమర్పిస్తే మీ కోరికలు నెరవేరుతాయి. వాటిని సమర్పించేటప్పుడు 'ఓం నమః శివాయ' అనే మంత్రాన్ని జపించండి. శివుడికి బిల్వపత్రాలను సమర్పించడం వలన ఆ శివయ్య అనుగ్రహం కలిగి, కష్టాలన్నీ తొలగిపోతాయి. అనుకున్న కోరికలను నెరవేర్చుకోవచ్చు.

పాలు:

శివుడికి పాలాభిషేకం చేయడం వలన అద్భుతమైన లాభాలు కలుగుతాయి. కార్తీక సోమవారం నాడు పాలను శివలింగానికి అభిషేకం చేయడం వలన ఆ శివయ్య కరుణాకటాక్షాలు లభిస్తాయి. పాలు పవిత్రతకు, శాంతికి ప్రతీక.

పవిత్రమైన జలం:

శివలింగానికి నీటితో కూడా అభిషేకం చేయాలి. కార్తీక మాసంలో శివలింగానికి నీటిని సమర్పించడం వలన ఆ శివయ్య అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే అభిషేకం చేసేటప్పుడు శివనామ స్మరణ చేయడం వలన ప్రశాంతత కలుగుతుంది.

తేనె:

శివుడికి ఎంతో ఇష్టమైన తేనెను కూడా కచ్చితంగా సమర్పించండి. తేనెను సమర్పించడం వలన శివయ్య అనుగ్రహం లభిస్తుంది. తేనె మధురమైన వాక్కుకు, ప్రేమకు ప్రతీక.

పెరుగు:

శివలింగానికి పెరుగును కూడా సమర్పించండి. పంచామృతంలో పెరుగు ముఖ్యమైన పదార్థం. భక్తులు పెరుగుతో కూడా శివలింగానికి అభిషేకం చేయడం మంచిది.

నెయ్యి:

కార్తీక మాసంలో నెయ్యితో దీపాలను వెలిగించాలి. అలాగే కుదిరితే శివయ్య ఆలయానికి వెళ్లి నెయ్యి దీపాన్ని వెలిగించండి. శుభ ఫలితాలు కలుగుతాయి. శివయ్య అనుగ్రహం లభిస్తుంది.

తెల్లటి పూలు:

శివారాధనలో తెల్లటి పూలకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. తెల్లని పూలతో శివుడిని ఆరాధించడం వలన శివయ్య అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా జిల్లేడు పూలను సమర్పించేటట్లు చూసుకోండి.

విభూతి:

విభూతిని సమర్పించడం వలన శివుని అనుగ్రహం లభిస్తుంది. శివుడు నుదుటిపై విభూతి ధరించడం ఆయన వైరాగ్యానికి, జీవిత సత్యానికి ప్రతీక. శివపూజ చేసిన తర్వాత భక్తులు విభూతిని నుదుటిపై ధరిస్తారు.

కార్తీక మాసంలో ఈ శివ మంత్రాలను కూడా జపించండి

పంచాక్షరీ మంత్రం:

'ఓం నమః శివాయ' అనే మంత్రాన్ని ప్రతిరోజూ జపించండి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఈ మంత్రాన్ని జపిస్తే ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందవచ్చు.

మహామృత్యుంజయ మంత్రం:

ఈ మంత్రాన్ని జపించడం వలన ఆరోగ్యం కలుగుతుంది. ఆపదల నుంచి రక్షణ కోసం భక్తులు ఈ మంత్రాన్ని జపిస్తారు.

శివ గాయత్రీ మంత్రం:

శివుని అనుగ్రహం కోసం శివ గాయత్రీ మంత్రాన్ని కూడా జపించండి. జ్ఞానం, ఆధ్యాత్మిక చైతన్యం, సద్బుద్ధి కలుగుతాయి.

శివ ధ్యాన మంత్రం:

కర్పూరగౌరం కరుణావతారం

సంసారసారం భుజగేంద్రహారం

సదా వసంతం హృదయారవిందే

భవం భవానీ సహితం నమామి

ఈ మంత్రాన్ని జపించడం వలన శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More