హిందూ సంప్రదాయంలో, వాస్తు శాస్త్రంలో తాబేలుకు చాలా ప్రముఖమైన స్థానం ఉన్న విషయం తెలిసిందే. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం చేసేటప్పుడు మందర పర్వతాన్ని మోయడానికి సాక్షాత్తు విష్ణుమూర్తి కూర్మావతారం రూపం ధరించారు. క్షీరసాగర మథనానికి తాబేలు ఆధారం కావడం, దాని నుండే లక్ష్మీదేవి జన్మించడం వల్ల, ఎక్కడ తాబేలు ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయని భక్తులు దృఢంగా నమ్ముతారు. అందుకే ఇంట్లో తాబేలు విగ్రహాన్ని ఉంచడం వల్ల విష్ణుమూర్తి, అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయని వాస్తు నిపుణులు, పండితులు చెబుతుంటారు.

ఇళ్లలో, కార్యాలయాలలో స్ఫటిక తాబేళ్లను ఉంచడం ఒక కొత్త పోకడగా మారింది. స్ఫటికాలకు సహజంగానే ప్రతికూల శక్తిని గ్రహించి, సానుకూల శక్తిని విడుదల చేసే గుణం ఉంటుంది. ఇంట్లో నిరంతర గొడవలు, మానసిక అశాంతి, ఆర్థిక సమస్యలు వంటివి ఉన్నప్పుడు, ఒక స్ఫటిక తాబేలును తీసుకురావడం ఆయా ఇళ్లలోని వాస్తు దోషాలను తొలగిస్తుంది. ఇది కేవలం అలంకరణ వస్తువు మాత్రమే కాదు, ఇంటి వాతావరణాన్ని పవిత్రం చేసే ఒక అద్భుతమైన వాస్తు సాధనం కూడా.
అయితే ఇంట్లో స్ఫటిక తాబేలును ఉంచేటప్పుడు వాస్తు నియమాలను కచ్చితంగా పాటించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం, స్ఫటిక తాబేలును ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచడం ఎల్లప్పుడూ చాలా శుభప్రదం. ఉత్తర దిశకు అధిపతి కుబేరుడు కాబట్టి, ఈ దిశలో తాబేలును ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి. సంపద ఆకర్షణ పెరుగుతుంది. అలాగే వాణిజ్య సంస్థలు, కార్యాలయాలలో దీనిని నగదు పెట్టె దగ్గర లేదా ఉత్తర దిశలో ఉంచడం వల్ల వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి.
స్ఫటిక తాబేలును ఉంచుకునేటప్పుడు గుర్తుంచుకోవలసిన మరో ముఖ్యమైన విషయం దానిని ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. ఒక చిన్న గాజు లేదా రాగి గిన్నెలో కొంత శుభ్రమైన నీటిని పోసి, ఆ నీటిలో ఈ స్ఫటిక తాబేలును పెట్టాలి. ఆ తాబేలు ఎల్లప్పుడూ ఇంటి లోపలికి అభిముఖంగా ఉండాలి, తలుపు వైపు గానీ లేదా బయటికి గానీ కాదు. వాస్తు శాస్త్రం ప్రకారం, తాబేలు లోపలికి అభిముఖంగా ఉంటే ఇంటికి సంపద వస్తుంది, అదే బయటికి అభిముఖంగా ఉంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. పాత్రలోని నీటిని ప్రతిరోజూ మార్చడం, దానిని పవిత్రంగా ఉంచడం వలన మీరు ప్రయోజనాలను త్వరగా పొందగలుగుతారు.
ఆరోగ్యం పరంగా తాబేలును దీర్ఘాయువుకు చిహ్నంగా పరిగణిస్తారు. తాబేళ్లు వందల సంవత్సరాలు జీవిస్తాయి. ఇంట్లో తాబేలును ఉంచుకోవడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుందని నమ్మకం. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతుంటారు. న్యూమరాలజీ నిపుణుల ప్రకారం.. ఒక చిన్న స్ఫటిక తాబేలును ఉత్తర దిశలో, ముఖ్యంగా చదువుకుంటున్న పిల్లల గదులలో లేదా వారు కూర్చునే బల్లపై ఉంచితే.. అది వారి ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచుతుందని, చదువులో రాణిస్తారని అంటారు.
{{/usCountry}}ఆరోగ్యం పరంగా తాబేలును దీర్ఘాయువుకు చిహ్నంగా పరిగణిస్తారు. తాబేళ్లు వందల సంవత్సరాలు జీవిస్తాయి. ఇంట్లో తాబేలును ఉంచుకోవడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుందని నమ్మకం. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతుంటారు. న్యూమరాలజీ నిపుణుల ప్రకారం.. ఒక చిన్న స్ఫటిక తాబేలును ఉత్తర దిశలో, ముఖ్యంగా చదువుకుంటున్న పిల్లల గదులలో లేదా వారు కూర్చునే బల్లపై ఉంచితే.. అది వారి ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచుతుందని, చదువులో రాణిస్తారని అంటారు.
{{/usCountry}}మీరు కూడా ఆర్థిక అభివృద్ధిని.. మీ ఇంట్లో శాంతి కోసం ఒక స్ఫటిక తాబేలును తీసుకువచ్చి, దానిని ఉత్తర దిశలో ఉన్న ఒక నీటి పాత్రలో ప్రతిష్ఠించండి. ఇది మీ ఇంటి నుండి ప్రతికూల శక్తులను తొలగించడమే కాకుండా.. అన్ని అడ్డంకులను తొలగించి, దానిని లక్ష్మీ నిలయంగా మారుస్తుంది.