ఈ 3 రాశులకు కేతు గండం.. జూన్ 30 వరకు ఆర్థిక నష్టాలు, మానసిక ఒత్తిడి.. రిస్క్ అస్సలు తీసుకోవద్దు!

కేతువు మఖ నక్షత్రం మూడవ పాదంలోకి ప్రవేశించడం వల్ల మిథున, కన్య, మీన రాశుల వారికి ప్రతికూల పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Published on: May 18, 2026, 09:36:32 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. ఆ సమయంలో అశుభ యోగాలను, శుభ యోగాలను చూస్తూ ఉంటాం. కేతువు నీడ గ్రహం. కేతువు సంచారంలో మార్పు వస్తే ద్వాదశ రాశుల వారి జీవితంలో కూడా అనేక మార్పులు వస్తాయి. మే 29, శుక్రవారం నాడు కేతువు మఖ నక్షత్రం మూడవ పాదంలోకి ఉదయం 10:16కి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. కేతువు జూన్ 30 వరకు మఖ నక్షత్రం మూడవ పాదంలోనే సంచారం చేస్తాడు. ఆ తర్వాత రెండో పాదంలోకి అడుగుపెడతాడు.

ఈ 3 రాశులకు కేతు గండం.. జూన్ 30 వరకు ఆర్థిక నష్టాలు, మానసిక ఒత్తిడి (pinterest)
ఈ 3 రాశులకు కేతు గండం.. జూన్ 30 వరకు ఆర్థిక నష్టాలు, మానసిక ఒత్తిడి (pinterest)

కేతువు సంచారం

కేతువు తిరోగమనంలో ఉన్నప్పుడు ఆ దశను చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. మఖా నక్షత్రానికి అధిపతి బుధుడు. బుధుడు కమ్యూనికేషన్, తెలివితేటలు, వ్యాపారం మొదలైన వాటికి కారకుడు. అయితే కేతువు మఖ నక్షత్రం మూడవ పాదంలోకి ప్రవేశించినప్పుడు కొన్ని రాశుల వారికి కష్టాలు వస్తాయి. మరి ఆ దురదృష్ట రాశులు ఎవరు? ఏ రాశుల వారికి ఇబ్బందులు వస్తాయి? తెలుసుకుందాం.

కెరీర్, వ్యాపారంపై ప్రభావం

కేతువు మఖ నక్షత్రం మూడవ పాదంలోకి ప్రవేశించినప్పుడు కొన్ని రాశుల వారికి చిక్కులు ఎదురవుతాయి. ముఖ్యంగా కెరీర్, వ్యాపారంలో నెగిటివ్ ప్రభావాన్ని చూడాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మరి ఆ రాశులు ఎవరనేది ఇప్పుడు చూద్దాం.

కేతువు సంచారంతో ఈ రాశుల వారి కెరీర్‌లో ఇబ్బందులు... తస్మాత్ జాగ్రత్త!

1.మిథున రాశి

మిథున రాశి వారికి కేతువు నక్షత్ర సంచారంతో సమస్యలు వస్తాయి. పని ప్రదేశంలో ఛాలెంజ్‌లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పురోగతి తగ్గుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ఆర్థికపరంగా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఎక్కువ నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు ఆలోచించి ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

2.కన్య రాశి

కన్య రాశి వారికి కేతువు సంచారం వలన సమస్యలు వస్తాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కష్టానికి తగిన ఫలితం ఉండకపోవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా తెలియని వ్యక్తులను నమ్మకండి.

3.మీన రాశి

మీన రాశి వారు ఈ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీన రాశి వారు మాటల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆర్థికపరంగా కూడా ఈ రాశి వారికి నష్టాలు కలిగే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండండి. ప్రశాంతంగా, సహనంగా ఉంటే ఇబ్బందులు రావు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More