Ketu: మాయావి కేతువు నక్షత్ర మార్పు.. ఈ 3 రాశుల వారికి రాజయోగం.. ఇక కాసుల వర్షమే!
Ketu: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత రహస్యమైన గ్రహంగా భావించే కేతువు తన నక్షత్ర పదాన్ని మార్చుకోబోతున్నాడు. మే 31 నుంచి మఘ నక్షత్రం మూడో పాదంలోకి కేతువు ప్రవేశం వల్ల సింహ, ధనుస్సు, వృషభ రాశుల వారికి అదృష్టం వరించనుంది. ఆర్థికంగా, వృత్తిపరంగా వీరికి తిరుగుండదు.
జ్యోతిష్య శాస్త్రంలో కేతువును 'ఛాయా గ్రహం' లేదా 'మాయావి గ్రహం' అని పిలుస్తారు. కేతువు ఎప్పుడూ వెనక్కి నడుస్తుంటాడు (వక్రీ గతి). ఈ గ్రహం ఒక రాశిలో లేదా నక్షత్రంలో సంచరించే విధానం మన జీవితాలను సమూలంగా మార్చేస్తుంది. ప్రస్తుతం కేతువు సూర్యుడి రాశి అయిన సింహ రాశిలో, మఘ నక్షత్రంలో కొలువై ఉన్నాడు. మే నెలాఖరులో కేతువు తన నక్షత్ర పదాన్ని మార్చుకోబోతున్నాడు. ఈ మార్పు వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన సానుకూల ఫలితాలు రానున్నాయి.

మే 31న నక్షత్ర పద మార్పు
హిందూ పంచాంగం ప్రకారం, 2026 మే 31వ తేదీ రాత్రి 02:28 గంటలకు కేతువు మఘ నక్షత్రం నాలుగో పాదం నుంచి మూడో పాదంలోకి ప్రవేశిస్తాడు. కేతువు ఒక నక్షత్రం నుంచి మరో నక్షత్రానికి లేదా పాదానికి మారినప్పుడు అది ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఈ మార్పు వల్ల మూడు రాశుల వారికి పట్టని అదృష్టం తలుపు తట్టబోతోంది. ఆ రాశుల వివరాలు ఇవే..
1.సింహ రాశి:
కేతువు సంచారం వల్ల సింహ రాశి వారికి అన్ని రంగాల్లోనూ సానుకూలత కనిపిస్తుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయంలో అద్భుతమైన శుభవార్తలు అందుతాయి. వ్యాపారంలో మీరు వేసిన ప్రణాళికలు ఇప్పుడు కార్యరూపం దాల్చుతాయి.
గతంలో ఆగిపోయిన పనులు వేగవంతం అవుతాయి. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. పాత స్నేహితులను కలవడం వల్ల మానసిక ఉల్లాసం లభిస్తుంది. అంతేకాదు, ఎక్కడో ఆగిపోయిన మీ సొంత డబ్బు తిరిగి మీ చేతికి వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది.
2.ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి జాతకులకు కేతువు మార్పు కాసుల వర్షం కురిపించనుంది. మీరు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తుంటే ఇదే సరైన సమయం. అనుకోని విధంగా మీకు ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభాలు పెరుగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు క్రమంగా తగ్గుతాయి. ప్రేమలో ఉన్నవారికి బంధం మరింత బలపడుతుంది. భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.
3.వృషభ రాశి:
వృషభ రాశి వారికి కేతువు సంచారం వల్ల ఇంటికి మహర్దశ పడుతుంది. ముఖ్యంగా సంతానం విషయంలో ఏదైనా సమస్య ఉంటే అది తొలగిపోయి, వారి నుంచి మీరు శుభవార్తలు వింటారు. ఈ కాలంలో మీరు ఆధ్యాత్మిక లేదా వ్యాపార నిమిత్తం విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అందరితో సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యాపారంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


