Ugadi Dhanu rasi Horoscope: ఉగాది నుంచి ధనుస్సు రాశికి ఎలా ఉంటుంది? మార్చి 2026 నుంచి ఏప్రిల్ 2027 వరకు ఫలితాలు ఇవిగో!

ఈ పరాభవ నామ సంవత్సరం ప్రతి ఒక్కరికి కలిసి రావాలని, ఆనందంగా ఉండాలని, సంతోషంగా మొదలు పెడతారో. పరాభవ నామ సంవత్సరంలో అనేక రాశుల్లో చాలా మార్పులు రాబోతున్నాయి. ఈరోజు ధనస్సు రాశి వారికి పరాభవ తెలుగు నామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది? ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి?

Published on: Mar 18, 2026 1:30 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొత్త తెలుగు సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ పరాభవ నామ సంవత్సరం ప్రతి ఒక్కరికి కలిసి రావాలని, ఆనందంగా ఉండాలని, సంతోషంగా మొదలు పెడతారో. పరాభవ నామ సంవత్సరంలో అనేక రాశుల్లో చాలా మార్పులు రాబోతున్నాయి. ఈరోజు ధనస్సు రాశి వారికి పరాభవ తెలుగు నామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది? ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? వంటి వివరాలు తెలుసుకుందాం.

Ugadi Dhanu rasi Horoscope: ఉగాది నుంచి ధనుస్సు రాశికి ఎలా ఉంటుంది? (pinterest)
Ugadi Dhanu rasi Horoscope: ఉగాది నుంచి ధనుస్సు రాశికి ఎలా ఉంటుంది? (pinterest)

పరాభవ నామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుంది?

పరాభవ నామ సంవత్సరం లో ఈ రాశి వారికి కొన్ని హెచ్చుతగ్గులు ఉంటాయి. గురువు జూన్ నుంచి ఎనిమిదవ స్థానంలో సంచరించడం వలన, శని నాలుగవ స్థానంలో సంచరించడం వలన, రాహువు డిసెంబర్ దాకా మూడవ స్థానంలో సంచరించడం వలన, ఆ తర్వాత రెండవ స్థానంలో సంచరించడం, కేతువు డిసెంబర్ దాకా తొమ్మిదవ స్థానంలో సంచరించడం వల్ల ఈ రాశి వారికి మధ్యస్థ ఫలితాల నుంచి చెడు ఫలితాలు కలగబోతున్నాయి.

పరాభవ నామ సంవత్సరంలో ధనస్సు రాశి వారిపై అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఉంటుంది. గురుని ప్రభావం ఉండడం వలన వృత్తి, వ్యాపారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుటుంబ పరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ధనస్సు రాశి నిరుద్యోగులు ఉద్యోగం విషయంలో కాస్త ఇబ్బందులను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది.

విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలు

రాజకీయ ఒత్తిళ్లు, చికాకులు ఇబ్బంది పెడతాయి. వ్యాపారస్తులకు కొంతకాలం కష్టపడాల్సిన సమయం. చికాకులు కూడా వ్యాపారస్తులకు ఉంటాయి. సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు. విద్యార్థులు కూడా మధ్యస్థ ఫలితాలను చూస్తారు. కాస్త ఇష్టపడి, కష్టపడి చదువుపై శ్రద్ధతో కొనసాగితే మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి.

రైతులకు మధ్యస్థం నుంచి చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. రైతులు జాగ్రత్తగా ఉండాలి. ధనస్సు రాశి స్త్రీలు కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడతారు. గొడవలకు దూరంగా ఉండడం మంచిది. ధనస్సు రాశి వారికి ఈ కొత్త తెలుగు సంవత్సరంలో కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి.

పరిహారాలు

ఈ రాశి వారు మంచి ఫలితాలు కలగాలంటే కొన్ని పరిహారాలను పాటించడం మంచిది. ధనస్సు రాశి వారు పరాభవ నామ సంవత్సరంలో శుభ ఫలితాలు పొందాలంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తే మంచిదే. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేస్తే మంచిది. అలాగే మందపల్లి లాంటి క్షేత్రాలను సందర్శించి తైలాభిషేకం చేయడం వలన సమస్యలు తొలగిపోతాయి. ఇక ధనస్సు రాశి వారికి మాసవారి ఫలితాలు కూడా చూద్దాం. మార్చి, ఏప్రిల్ 2026 నుంచి ఏప్రిల్ 2027 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం.

పరాభవ నామ సంవత్సరం ధనస్సు రాశి వారి మాస ఫలితాలు:

మార్చి, ఏప్రిల్ 2026: ఈ నెలల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక లాభాలను చూస్తారు. గాయాలు వంటివి ఏర్పడవచ్చు కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి.

మే 2026: ఈ నెల మీకు వృత్తి, వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ప్రయాణాలు చేస్తారు. అవి లాభాలను తీసుకొస్తాయి. కుటుంబ సఖ్యత, మిత్రులతో కలయిక ఉంటుంది. ధన లాభం కలుగుతుంది. స్త్రీలకు ఆరోగ్యం బాగుంటుంది. కొన్ని పనులు కూడా సకాలంలో పూర్తి చేస్తారు.

జూన్ 2026: ఈ నెల మీకు అనుకూలంగా లేదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు అధికారులతో ఇబ్బందులు కలుగుతాయి. స్త్రీలకు అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. దూర దేశాలకు బదిలీలు అవ్వచ్చు.

జూలై 2026: ఈ నెల మీకు అనుకూలంగా లేదు. జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు రావచ్చు. తోటి ఉద్యోగస్తులతో కూడా ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. లోన్స్ తీసుకుంటారు. స్త్రీలకు కుటుంబంలో ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు పెరుగుతాయి.

ఆగస్టు 2026: ఈ నెల ధనస్సు రాశి వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. గౌరవం పెరుగుతుంది. సమాజంలో కీర్తి, ప్రతిష్టలను పొందుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు ఉండొచ్చు.

సెప్టెంబర్ 2026: ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. డబ్బు చేతికి అందితే సమస్యలన్నీ తీరిపోతాయి. ధన లాభం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ పరంగా కూడా లాభాలను చూస్తారు. స్త్రీలకు కుటుంబంలో సంతోషం ఉంటుంది.

అక్టోబర్ 2026: ఈ నెల మీకు పెద్దగా అనుకూలంగా లేదు. అప్పులు చేస్తారు. వ్యాపారస్తులకు నష్టం కలిగే అవకాశం ఉంది. ఏదైనా చిన్న మాట మాట్లాడినా విరోధం కలుగుతుంది. భార్యా భర్తల మధ్య చిన్నపాటి సమస్యలు ఉంటాయి. స్త్రీలకు అనారోగ్య సమస్యలు పెరుగుతాయి.

నవంబర్ 2026: ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు అభివృద్ధి ఉంటుంది. స్త్రీలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వస్త్ర లాభం, వస్తు భూషణ ప్రాప్తి కలుగుతాయి. ఆనందంగా ఉంటారు.

డిసెంబర్ 2026: ఈ నెల మీకు మధ్యస్థంగా ఉంటుంది. రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. ఆర్థికపరంగా లాభాలను చూస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.

జనవరి 2027: ఈ నెల మీకు పెద్దగా అనుకూలంగా లేదు. ఆర్థికపరంగా ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్త. అలసట కలుగుతుంది. స్త్రీలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో విరోధం ఉంటుంది.

ఫిబ్రవరి 2027: ఈ నెల మీకు అనుకూలంగా లేదు. నిద్రలేమి కారణంగా అనారోగ్యం వస్తుంది. ఆకలి లేకపోవడం వంటివి చూస్తారు. ఉద్యోగస్తులకు దూర ప్రాంత బదిలీలు ఉంటాయి. స్త్రీలకు సామాన్యంగా ఉంటుంది.

మార్చి, ఏప్రిల్ 2027: ఈ నెల మీకు వృత్తి, ఉద్యోగ పరంగా సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆర్థికపరంగా లాభాలను చూస్తారు. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా విషయంలో ఆశతో వ్యవహరిస్తే మంచిది. స్త్రీలకు అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. ఆభరణ ప్రాప్తి కలుగుతుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More