ప్రతి ఏటా వైశాఖ శుద్ధ తదియ నాడు అక్షయ తృతీయను జరుపుకుంటాము. అక్షయ తృతీయ నాడు కేవలం బంగారం మాత్రమే కొనాలి అనుకుంటే పొరపాటు. అక్షయ తృతీయ నాడు బంగారమే కొనక్కర్లేదు. కొన్ని పాటించడం వలన ఎంతో మంచి జరుగుతుంది. ఆ రోజు ఇంటికి బంగారాన్ని తెచ్చుకుంటే లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లోనే ఉంటుందని, అక్షయంగా ఉంటుందని నమ్మకం. కానీ నీటి కుండను దానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. మట్టికుండను కడిగి, అందులో నీళ్లు, యాలకులు, పచ్చ కర్పూరం, లవంగాలు వేసి దానం చేయడం వలన మంచి ఫలితాన్ని చూస్తారు. అలాగే విసనకర్ర, గొడుగు, చాప, చెప్పులు వంటి విధానం చేస్తే కూడా ఎంతో పుణ్యం.

అక్షయ తృతీయ నాడు స్వయంపాకం ఇచ్చుకుంటే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. చింతపండు, కూరలు, బియ్యం, పప్పు వంటి వంట సామాగ్రిని దానం చేయొచ్చు. అలాగే దంపతులు ఇద్దరు కలిసి జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ, గాజులను ముత్తైదువకు ఇచ్చుకుంటే కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది. జన్మ జన్మలకు సువాసినిత్వం ప్రాప్తిస్తుందని పండితులు తెలిపారు.
అక్షయ తృతీయ నాడు అక్షయపాత్రను ఎలా పెట్టాలి?
శక్తివంతమైన అక్షయపాత్రను ఈ రోజు పెట్టుకోవచ్చు. ధన ధాన్యాలు వృద్ధి చెందాలంటే అక్షయపాత్రను ఎలా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. అందుకోసం ముందు ఒక మట్టికుండను శుభ్రంగా కడిగి పెట్టండి.
దానిపై పసుపు, కుంకుమలతో అలంకరించి, అందులో పసుపు, కుంకుమ, జవ్వాది, పచ్చ కర్పూరం, రాళ్ల ఉప్పు వేయండి. రాళ్ల ఉప్పు కాస్త ఎక్కువగా వేయండి.
ఆ తర్వాత అందులో పసుపు లేదా ఎరుపు రంగులో ఉండే జాకెట్ ముక్కను చిన్న ముక్కగా కట్ చేసి పెట్టండి. కాస్త జాకెట్ ముక్కను నొక్కి, దానిపైన డబ్బులను పెట్టండి. మీకు నచ్చినంత పెట్టొచ్చు 116లు ఇలా మీకు తోచినట్టు పెట్టొచ్చు.
ఒక ప్లేట్ తీసుకుని, దానిపైన వరి పిండితో పద్మం వేసి, పసుపు, కుంకుమలు కూడా వేసి, చుట్టూ పసుపు, కుంకుమలను పెట్టి అక్షయపాత్రను పెట్టండి.
{{/usCountry}}ఒక ప్లేట్ తీసుకుని, దానిపైన వరి పిండితో పద్మం వేసి, పసుపు, కుంకుమలు కూడా వేసి, చుట్టూ పసుపు, కుంకుమలను పెట్టి అక్షయపాత్రను పెట్టండి.
{{/usCountry}}ఇప్పుడు అక్షయపాత్రకు మూత వేసి, దానికి కూడా పసుపు, కుంకుమలు వేసి, లక్ష్మీ రూపం లేకపోతే నాణెం పెట్టి, పూలతో అలంకరించుకోండి.
ఒక రోజు తర్వాత కావాలనుకుంటే అక్షయపాత్రలో ఉన్న డబ్బులను తీసుకోవచ్చు. లేకపోతే అక్షయ తృతీయ నాడు కూడా పెట్టుకోవచ్చు.
దీనిని ఇంట్లో కానీ, వ్యాపార ప్రదేశంలో కానీ పెట్టుకోవచ్చు.
ఇందులో ఉన్న ఉప్పును పారే నీటిలో లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయొచ్చు.
దీనిని కావాలంటే అలా దేవుడి దగ్గర ఉంచేయొచ్చు. మంగళవారం, శుక్రవారం నాడు మాత్రం తీయకండి. ఎప్పుడైనా మిగిలిన రోజుల్లో తీసుకోవచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం తప్పనిసరా?
లేదు. బంగారం కొనడం ఒక సంప్రదాయం మాత్రమే. అంతకంటే ముఖ్యంగా ఈ రోజున దానధర్మాలు చేయడం, పితృ తర్పణాలు ఇవ్వడం వల్ల అక్షయమైన పుణ్యఫలం లభిస్తుంది.
2. స్వయంపాకం ఎవరికి ఇవ్వాలి?
బ్రాహ్మణులకు లేదా గుడిలో ఉండే పూజారులకు స్వయంపాకం ఇవ్వడం ఉత్తమం.
3. ఇంట్లో అక్షయపాత్ర ఎక్కడ పెట్టాలి?
పూజా గదిలో కానీ లేదా మీరు వ్యాపారం చేసే చోట క్యాష్ బాక్స్ దగ్గర కానీ ఈ పాత్రను ఉంచుకోవచ్చు.