Rare Alignment of four planets: ఒకే వరుసలో నాలుగు గ్రహాలు.. ధన యోగంతో ఈ రాశులకు డబ్బు, సంతోషం, ప్రమోషన్లతో పాటు ఎన్నో!

Rare Alignment of four planets: ఒక్కోసారి గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు కొన్ని గ్రహాలు వరుసగా ఉంటాయి. ఈసారి అలాగే జరగబోతుంది. ఒకే వరుసలో ఏకంగా నాలుగు గ్రహాలు ఉండడంతో ధనయోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలను తీసుకురాబోతోంది. ఆ అదృష్ట రాశులు ఎవరు?

Published on: Apr 18, 2026, 08:55:09 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Rare Alignment of four planets: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితంలో కూడా అనేక మార్పులను తీసుకు వస్తుంది. ఈ రోజు రాత్రి 4 గ్రహాల వలన విశేషమైన ధన యోగం ఏర్పడబోతోంది. ఇది కొన్ని రాశుల వారి అదృష్టాన్ని మార్చబోతోంది. కుజుడు, బుధుడు, శని, నెప్ట్యూన్ ఒకే వరుసలో ఉంటాయి. ఈ అరుదైన దృశ్యం ఈ రోజు జరగబోతోంది. ఇది పన్నెండు రాశుల జీవితంపై ప్రభావం చూపించడమే కాకుండా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకురాబోతోంది.

Rare Alignment of four planets: ఒకే వరుసలో నాలుగు గ్రహాలు.. ధన యోగంతో ఈ రాశులకు కనీవినీ ఎరుగని విధంగా లాభాలు (pinterest)
Rare Alignment of four planets: ఒకే వరుసలో నాలుగు గ్రహాలు.. ధన యోగంతో ఈ రాశులకు కనీవినీ ఎరుగని విధంగా లాభాలు (pinterest)

ఒకే వరుసలో నాలుగు గ్రహాలు

నాలుగు గ్రహాలు ఒకే వరుసలో (Rare Alignment of four planets) ఉంటాయి. దీనితో ప్రత్యేకమైన ధనయోగం ఏర్పడుతోంది. ఇది ఏప్రిల్ 23 వరకు కొనసాగుతుంది. ఇది నాలుగు రాశుల వారి జీవితంలో అనేక మార్పులు తీసుకువస్తుంది. మరి ఈ సమయంలో ఏ రాశులకు బాగుంటుంది? ఎవరికి ఎక్కువగా లాభాలు కలుగుతాయో చూసేద్దాం.

ధనయోగంతో ఈ రాశుల వారికి విపరీతమైన లాభాలు:

1.సింహ రాశి:

సింహ రాశి వారు ఈ సమయంలో సక్సెస్‌ను అందుకుంటారు. కెరీర్‌లో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మంచి ఉద్యోగం, ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి.

2.వృషభ రాశి:

వృషభ రాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాత ఇన్వెస్ట్‌మెంట్‌ల నుంచి ఎక్కువగా లాభాలు ఉంటాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. సంతోషం పెరుగుతుంది. ఒత్తిడి నుంచి సులువుగా బయటపడతారు.

3.ధనస్సు రాశి:

ధనస్సు రాశి వారికి కూడా ఇది అద్భుతమైన సమయమని చెప్పొచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు ఈ సమయంలో మీ చేతికి వస్తుంది. వ్యాపారస్తులకు భారీగా లాభాలు ఉంటాయి. మీ ప్లాన్లు విజయవంతంగా పూర్తి అవుతాయి. అన్ని విధాలుగా మీకు ఈ సమయంలో కలిసి వస్తుంది.

4.మీన రాశి:

మీన రాశి వారికి ఈ సంయోగం మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారి ఆదాయం కూడా పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ఒత్తిడి నుంచి సులువుగా బయటపడతారు. ఆనందంగా ఉంటారు. ఏ విధమైన లోటు లేకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా హాయిగా ఉంటారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More