ఈరోజు చైత్ర అమావాస్య వేళ సూర్య, చంద్రుల కలయిక.. నాలుగు రాశులకు అనేక లాభాలు.. డబ్బు, ప్రశాంతత, సంతోషం రెట్టింపు !
గ్రహాలు రాశి మార్పు చెందినప్పుడు 12 రాశులు వారిపై ప్రభావం పడుతుంది. ఈరోజు చైత్ర అమావాస్య. పైగా ఈరోజే సూర్య, చంద్ర గ్రహాలు సంయోగం కూడా. దీంతో కొన్ని రాశుల వారికి అనేక విధాలుగా లాభాలు కలగబోతున్నాయి. 12 రాశులు వారిపై ప్రభావం పడినా ఈ రాశుల వారికి మాత్రం డబ్బు, సంతోషం, ప్రశాంతతతో పాటు అనేక లాభాలు.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అందరి జీవితంలో ఎన్నో మార్పులను తీసుకువస్తుంది. ఒక్కో సారి శుభ ఫలితాలు కలిగితే, ఒక్కోసారి అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు అమావాస్య. ఈ చైత్ర అమావాస్య వల్ల సూర్య చంద్రులు సంయోగం చెందారు. సూర్యచంద్రుల కలయికతో కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలు కలగబోతున్నాయి. సక్సెస్‌ని అందుకుంటారు. అలా ఎన్నో రకాలుగా ప్రయోజనాలు ఉంటాయి. మరి ఈరోజు సూర్యచంద్ర గ్రహాల కలయిక వలన ఏ రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుందో తెలుసుకుందాం.

సూర్య చంద్రుల కలయిక:
సూర్యచంద్రులు మేషరాశిలో ఈరోజు సంయోగం చెందారు. దీంతో ఈ రాశుల వారికి విపరీతంగా లాభాలు కలగబోతున్నాయి. కొన్ని రాశుల వారు విజయాలను కూడా అందుకోబోతున్నారు. మరి అదృష్ట రాశులు ఎవరు?
1.మేష రాశి:
మేష రాశి వారికి ఈరోజు అమావాస్య వేళ సూర్యచంద్ర గ్రహాల కలయిక కారణంగా పెండింగ్‌లో ఉన్న టాస్కులు పూర్తవుతాయి. వ్యాపారస్తులు పెద్ద డీల్స్‌ను పొందుతారు. సమాజంలో గౌరవం, మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ప్రశాంతత, సంతోషం రెట్టింపు అవుతాయి. పేదవారికి దానం చేస్తే విశేషమైన ఫలితాలను పొందవచ్చు.
2.తులా రాశి:
తులా రాశి వారికి ఇది శుభ సమయం. సూర్యచంద్రుల కలయిక ఈ రాశి వారికి అనేక విధాలుగా లాభాలను తీసుకురాబోతోంది. ఆస్తులకు సంబంధించి ప్రయోజనాలను పొందుతారు. కొత్త ఇల్లు లేదా కారును కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. ప్రేమ జీవితం దృఢంగా ఉంటుంది. శని దేవుడికి ఆవాల నూనెతో దీపారాధన చేస్తే శుభ ఫలితాలను చూస్తారు.
3.వృషభ రాశి:
ఈ రాశి వారికి కూడా ఇది శుభ సమయం. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. ఆర్థిక పరంగా బాగుంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. రావి చెట్టు కింద దీపారాధన చేస్తే మంచి జరుగుతుంది.
4.ధనుస్సు రాశి:
ఈ రాశి వారికి కూడా ఇది అద్భుతమైన సమయం అని చెప్పొచ్చు. వ్యాపారస్తులు భారీగా లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావచ్చు. జీతం పెరిగే అవకాశం ఉంది. ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. దీపదానం చేయడం వలన ఈ రాశి వారికి ఈ రోజు బాగా కలిసి వస్తుంది.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


