గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది.

కేతువు క్రూర గ్రహం. కానీ ఒక్కోసారి కేతువు కూడా శుభ ఫలితాలను తీసుకొస్తూ ఉంటుంది. మార్చి 29న కేతువు మఖ నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. కేతువు నక్షత్ర సంచారంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. ఎనిమిది నెలల పాటు ఈ రాశుల వారు అనేక విధాలుగా ప్రయోజనాలను పొందుతారు. మరి అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.
మఖ నక్షత్రంలోకి కేతువు.. ఈ రాశులకు అనేక లాభాలు
1.సింహ రాశి:
సింహ రాశి వారికి కేతువు నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు పురోగతిని చూస్తారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. వ్యాపారులకు ఇది అద్భుత సమయం. విజయాలను అందుకుంటారు. ఆర్థికపరంగా కూడా ఇది మంచి సమయం. సానుకూల మార్పులను చూస్తారు. సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుంది.
2.వృషభ రాశి:
వృషభ రాశి వారికి కేతువు సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. ఉద్యోగుల జీతం పెరుగుతుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. వ్యాపారులకు అభివృద్ధి కనబడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. సంతోషం కూడా రెట్టింపు అవుతుంది.
3.కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి కేతువు నక్షత్ర సంచారంతో మంచి మార్పులు వస్తాయి. అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఉద్యోగులకు, వ్యాపారులకు పురోగతి ఉంటుంది. సంపద పెరుగుతుంది. భారీ పెట్టుబడుల నుంచి లాభాలను పొందుతారు.
4.తుల రాశి:
తులా రాశి వారికి కేతువు నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కెరీర్‌లో మంచి మార్పులను చూస్తారు. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ప్రయాణాల ద్వారా కొత్త అనుభవాలను పొందుతారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు.
5.మకర రాశి:
మకర రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ఊహించని లాభాలను పొందుతారు. కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు, వ్యాపారాలకు కూడా ఇది శుభ సమయం. కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు. పెట్టుబడుల నుంచి కూడా బాగా రాబడి వస్తుంది. మనశ్శాంతిగా ఉంటారు.
{{/usCountry}}మకర రాశి వారికి ఇది అద్భుతమైన సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ఊహించని లాభాలను పొందుతారు. కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు, వ్యాపారాలకు కూడా ఇది శుభ సమయం. కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు. పెట్టుబడుల నుంచి కూడా బాగా రాబడి వస్తుంది. మనశ్శాంతిగా ఉంటారు.
{{/usCountry}}