Khappar Yogam 2026: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పులు వస్తే, అది ద్వాదశ రాశుల వారి జీవితంలో కూడా అనేక విధమైన మార్పులను తీసుకు వస్తుంది. ఒక్కోసారి ఇది శుభ ఫలితాలను తీసుకొస్తే, ఒక్కోసారి అశుభ ఫలితాలు కలుగుతాయి. త్వరలో కప్పర (Khappar Yogam 2026) యోగం ఏర్పడుతుంది. ఇది మే 1 నుంచి జూన్ 29 వరకు ఉంటుంది. ఈ కప్పర యోగం అనేది సమస్యలను కలిగించే అవకాశం ఉంది.

ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడినప్పటికీ, కొన్ని రాశుల వారు మాత్రం సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం ఈ సమయంలో కొన్ని రాశుల వారు ఊహించని మార్పులను చూస్తారు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కెరీర్‌లో ఇబ్బందులు వంటివి ఉండొచ్చు. మరి ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉంటే మంచిది? ఇప్పుడు తెలుసుకుందాం.
భయంకరమైన కప్పర యోగం.. మే 1 నుంచి రాశుల వారికి సమస్యలు
ఈ యోగం ఎలా ఏర్పడుతుంది?
ఈ యోగం క్రూర గ్రహాలైనటువంటి రాహువు, కేతువు వలన ఏర్పడవచ్చు. లేదా కుజుడు, శని గ్రహాల వలన కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఈ యోగం వలన మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు కూడా ఏర్పడవచ్చు.
భయంకరమైన కప్పర యోగం.. ఈ రాశులు వారు జాగ్రత్తగా ఉంటే మంచిది
1.మిథున రాశి:
ఈ సమయంలో మిథున రాశి వారు ఎత్తుపల్లాలు చూస్తారు. ఇబ్బందులు వస్తాయి. చిన్న చిన్న అపార్థాలు కూడా కలగవచ్చు. సహనంతో వ్యవహరిస్తే మంచిది. ఈ సమయంలో ఈ రాశి వారికి పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. నీరసం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు కచ్చితంగా ప్రణాళిక వేసుకోవడం చాలా అవసరం.
2.కన్య రాశి:
కన్య రాశి వారికి కూడా ఇది చాలా ఒత్తిడిని తీసుకొచ్చే సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు కన్ఫ్యూజన్లో ఉంటారు. అనవసరమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థికపరంగా కూడా సమస్యలు ఉండొచ్చు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బును ఆదా చేసుకోవాలి. ఏదైనా ముఖ్యమైన ప్రాజెక్టు ఉంటే బాగా ఆలోచించుకోవాలి. అనవసరంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. చిన్న చిన్న సమస్యలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
3.మకర రాశి:
{{/usCountry}}కన్య రాశి వారికి కూడా ఇది చాలా ఒత్తిడిని తీసుకొచ్చే సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు కన్ఫ్యూజన్లో ఉంటారు. అనవసరమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థికపరంగా కూడా సమస్యలు ఉండొచ్చు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బును ఆదా చేసుకోవాలి. ఏదైనా ముఖ్యమైన ప్రాజెక్టు ఉంటే బాగా ఆలోచించుకోవాలి. అనవసరంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. చిన్న చిన్న సమస్యలు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
3.మకర రాశి:
{{/usCountry}}మకర రాశి వారికి ఇది ఛాలెంజింగ్ సమయం. ఈ సమయంలో ఈ రాశి వారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా ఒకటికి పది సార్లు ఆలోచిస్తేనే మంచిది.
4.మీన రాశి:
మీన రాశి వారికి కూడా ఈ సమయంలో ఇబ్బందులు వస్తాయి. అనవసరంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. టెన్షన్ పెరుగుతుంది. ఆర్థికపరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు వద్దు. ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు ఏమి తీసుకోవద్దు.